intinti gruhalakshmi 22 february 2022 full episode
Intinti Gruhalakshmi 22 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఫిబ్రవరి 2022 మంగళవారం ఎపిసోడ్ 562 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీస్ స్టేషన్ కు వచ్చి నానా యాగి చేస్తున్నావు. నీ మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేస్తా.. అని బెదిరిస్తాడు ఎస్ఐ. లాయర్ గారు ఎస్ఐ గారే మా అబ్బాయిని ఎక్కడో దాచారు. ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నారు.. అని చెబుతుంది. కానీ.. లాయర్ దేనికైనా సాక్ష్యం ఉండాలి. మీ సాక్ష్యం పనికిరాదు అంటాడు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. పదండి.. వెళ్దాం అంటాడు లాయర్. దీంతో నేను రాను ఇక్కడి నుంచి అంటుంది తులసి. కానీ.. లాయర్ తనను బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. తులసి వెళ్లగానే నా ఈగోనే టచ్ చేస్తాడా.. నీ కొడుకు నీకు ఎప్పటికీ దక్కడు అని తన మనసులో అనుకుంటాడు ఎస్ఐ.
intinti gruhalakshmi 22 february 2022 full episode
చూడండి అమ్మ. ఎస్ఐ మీ కొడుకును ఎక్కడో దాచాడు. అది నిజం. మొండితనంతో పోకుండా ఎస్ఐని కూల్ చేయండి. అప్పుడే ఎస్ఐ మీ అబ్బాయి మీకు దక్కుతాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం.. అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న మనోజ్ గురించి వాకబు చేయడానికి తులసి హాస్పిటల్ కు వెళ్తుంది. డాక్టర్ మనోజ్ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది తులసి. దీంతో అతడి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెబుతుంది డాక్టర్. ఐసీయూ దగ్గరికి వెళ్లి నీ ఒక్క ప్రాణంతో మా అందరి ప్రాణాలు ముడిపడి ఉన్నాయి అని అనుకుంటుంది తులసి.
మరోవైపు అభి కోసం అంకిత ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ.. తులసి ఒక్కతే ఇంటికి వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అభి ఎక్కడ. మీతో పాటు రాలేదు ఏంటి.. అని అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. అభి.. రాలేదు అంటుంది తులసి. ఎందుకు రాలేదు ఆంటి అని అడుగుతుంది అంకిత.
ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ వచ్చి తీరుతుందని లాయర్ చెప్పారు కదా. మీరు అలా మౌనంగా ఉంటే మాకు టెన్షన్ గా ఉంది ఆంటి అంటుంది అంకిత. బెయిల్ పిటిషిన్ ప్రాపర్ గా సెట్ చేసి ఉండరు. బెయిల్ పేపర్ రిజెక్ట్ అయి ఉంటుంది.. అని అక్కడికి వచ్చిన లాస్య అంటుంది.
మీ అందరికీ ఆ మాత్రం అర్థం కావడం లేదా.. గుడ్లు మిటకరించి చూడటం నాకూ వచ్చు. ఇంతమంది నోరు చించుకొని అరుస్తుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదా అని అడుగుతుంది లాస్య. మీ తులసి ఆంటి చెప్పేవన్నీ చందమామ కథలు.. కాకమ్మ కథలు అని ఎప్పుడో చెప్పాను కదా అంకిత అంటుంది లాస్య.
లాస్య నువ్వు ఆగు.. అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు నందు. అభి అసలు పోలీస్ స్టేషన్ లోనే లేడు అని చెబుతుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. అదేంటి ఆంటి.. మీరే చెప్పారు కదా.. అభిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారని అంటుంది అంకిత.
తులసి నువ్వు చెప్పింది అబద్ధమా అని అంటాడు నందు. దీంతో అబద్ధం ఎందుకు చెబుతాను.. నేను వద్దన్నా కూడా స్టేషన్ కు తీసుకెళ్లాడు ఎస్ఐ. అంతకుముందే ఎస్ఐతో అభికి గొడవ అయింది. తన షర్ట్ పట్టుకోవడంతో అభిని కోపంతో అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు ఎస్ఐ అంటుంది తులసి.
అభి పక్కనే ఉండి నువ్వు ఏం చేస్తున్నావు. వాడిని కంట్రోల్ చేయాలని తెలియదా.. అంటాడు నందు. ఓరి దేవుడో ఏంటి మాకు ఈ కష్టాలు అంటుంది అనసూయ. ఇప్పుడు ఏం చేద్దాం ఆంటి అంటుంది శృతి. ఎందుకు అలా చేశావు మామ్ అంటుంది దివ్య.
పోలీసులు.. అభిని ఎంత టార్చర్ పెడతారా.. అభి కాలో చెయ్యో తీసేసి ఆ తర్వాత దొరికాడు అని అరెస్ట్ చేస్తారు అంటుంది లాస్య. దీంతో అంకిత ఇంకాస్త భయపడుతుంది. లాస్య.. అంకిత ముందు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది తులసి.
ఎందుకు ఈ రాక్షసానందం అంటుంది లాస్య. అభికి ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి కారణం నువ్వే. ఖచ్చితంగా నువ్వే. ఆ గాయత్రి నిన్ను అస్సలు వదిలిపెట్టదు.. అంటుంది లాస్య. లాస్య అడిగిన దానికి సమాధానం చెప్పమను అమ్మ అంటాడు నందు.
దీంతో నేను మీకు సమాధానం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. మరోవైపు అభి విషయంలో ఎలా ముందుకు వెళ్తావు అని పరందామయ్య ప్రశ్నిస్తాడు. అభి ఎక్కడున్నాడో తెలియకపోవచ్చు. తెలుసుకోకుండా వదలను అంటుంది తులసి.
ఇంతలో అంకిత వచ్చి.. ఎలా తీసుకొస్తారు ఆంటి అని అడుగుతుంది. మీకు తెలుసు.. అన్ని దారులు మూసుకుపోయాయి అని. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటుంది. దీంతో నా మీద నమ్మకం ఉంది అంటుంది తులసి.
దీంతో మీ మీద నమ్మకం ఉంటే.. మీ కాపురాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు అని ప్రశ్నిస్తుంది తులసి. దీంతో నిజంగా నేను కాపురాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకోవాలనుకుంటే నేను నిలబెట్టుకునేదాన్ని. కానీ.. నాకు అనవసరం అనిపించింది. అందుకే వదిలేసుకున్నాను అంటుంది తులసి.
ఎలాగైనా ఎస్ఐని కలిసి బతిమిలాడాలని అనుకున్న తులసి.. ఎస్ఐ ఎక్కడున్నాడో వెతుకుతుంది. ఎస్ఐ బారులో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్తుంది. ఓ టేబుల్ దగ్గర ఉన్న ఎస్ఐ దగ్గరికి వెళ్తుంది తులసి. కొడుకు కనిపించడం లేదని తెలిసి మందు కొడదామని బారుకు వచ్చావా అని అడుగుతాడు ఎస్ఐ.
నా కన్నీళ్లతో అయినా మీ మనసు కరుగుతుందేమోనని ఆశగా వచ్చాను అంటుంది తులసి. చూడు.. కన్నీళ్లను కరిగిపోయే క్యారెక్టర్ కాదు నాది అంటాడు ఎస్ఐ. దీంతో నేను కూడా అంతే. ఏడు సముద్రాల అవతల దాచినా నా కొడును ఎట్టి పరిస్థితుల్లోనూ వెతికి పట్టుకుంటాను అటుంది తులసి.
దీంతో చాలెంజ్ చేస్తున్నావా అని అడుగుతాడు ఎస్ఐ. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి తల్లి సిద్ధపడుతుంది. అనుమానం ఉంటే మీ తల్లిని అడగండి అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.