Intinti Gruhalakshmi 22 July Today Episode : తులసి బ్లాంక్ చెక్ ను తిరిగి ఇచ్చేయడంతో సామ్రాట్ షాక్.. శృతిని వెతుకుతున్న ప్రేమ్ కు షాక్.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 22 July Today Episode : తులసి బ్లాంక్ చెక్ ను తిరిగి ఇచ్చేయడంతో సామ్రాట్ షాక్.. శృతిని వెతుకుతున్న ప్రేమ్ కు షాక్.. ఇంతలో మరో ట్విస్ట్

 Authored By gatla | The Telugu News | Updated on :22 July 2022,10:30 am

Intinti Gruhalakshmi 22 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 691 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీని ఈవెనింగ్ షాపింగ్ కు తీసుకెళ్తా అని సామ్రాట్ చెబుతాడు. ఇంతలో తన ఇంటికి తులసి వస్తుంది. తులసిని చూసి సామ్రాట్ షాక్ అవుతాడు. హాయ్ ఆంటి అని అంటుంది హనీ. తన దగ్గరికి వెళ్లు అని సామ్రాటే చెబుతాడు. దీంతో తులసి దగ్గరికి వెళ్తుంది హనీ. హాయ్ హనీ ఎలా ఉన్నావు అని అడుగుతుంది తులసి. దీంతో బాగున్నా ఆంటి. నాకు ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా నువ్వు వస్తున్నావు కదా. అందుకే నువ్వు ఉంటే నాకు ఏం కాదు ఆంటి అంటుంది హనీ. ఇదిగో నీకోసం ఉప్మా పెసరట్టు తీసుకొచ్చా అంటుంది. దీంతో తినిపించండి అంటుంది హనీ. దీంతో తనకు తినిపిస్తుంది తులసి.

intinti gruhalakshmi 22 july 2022 full episode

intinti gruhalakshmi 22 july 2022 full episode

తులసికి బ్లాంక్ చెక్ పంపించాను. చూశావు కదా రియాక్షన్ ఎలా ఉందో. ముఖం వెలిగిపోతోంది కదా. మధ్య తరగతి అవసరాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు బాబాయి. ఈరోజుతో నేను చేసిన తప్పును సరిచేసుకున్నాను అంటాడు సామ్రాట్. హనీ తిన్నాక నువ్వు లోపలికి వెళ్లి ఆడుకో అంటుంది తులసి. దీంతో హనీ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత థాంక్స్ అంటుంది. దీంతో ఎందుకు అంటే.. బ్లాంక్ చెక్ ఇచ్చారు కదా అంటుంది తులసి. ఇది నాకు చాలా చిన్న విషయం. మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి అంటాడు సామ్రాట్. దీంత నా వరకు ఇది చాలా పెద్ద విషయం సామ్రాట్ గారు. ఇదిగోండి మీ చెక్ అని తీసి ఇస్తుంది తులసి.

దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ప్లీజ్ తీసుకోండి అంటుంది. ఏంటి మీరు చేసిన పని అంటాడు. దీంతో చేసిన సాయానికి డబ్బు తీసుకుంటే అది సాయం అనిపించుకోదు. స్వార్థం అనిపించుకుంటుంది. వ్యాపారం అనిపించుకుంటుంది. నేను నీలా స్వార్థపరురాలిని కాదు.. వ్యాపారవేత్తను కాదు.. అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 22 July Today Episode : కౌసల్య ఇంటికి శృతి కోసం వెళ్లిన ప్రేమ్

నా చేతుల్లో మీరు బ్లాంక్ చెక్ చేతుల్లో పెట్టినంత మాత్రాన.. మీరు చేసిన తప్పులు ఒప్పుకావు అంటుంది తులసి. మా లాంటి మధ్యతరగతి వాళ్లకు కష్టాలు కొత్తేం కాదు అంటుంది తులసి. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన మీలాంటి వాళ్లకు డబ్బు విలువ తెలియదు కావచ్చు కానీ.. మాకు తెలుసు.

డబ్బున్నవాళ్లే కాదు.. డబ్బు లేని వాళ్లు కూడా మనుషులే అని తెలుసుకోండి. మీరు వేసే బిక్ష కోసం నేను మొహం వాచిపోయేలా ఉన్నాను అనుకున్నారు అంతే కదా. మనిషి విలువ డబ్బుతో కాదు.. మంచితనంతో కొలవండి. చిన్నపిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఉత్త చేతులతో రాకూడదు అంటారు. అందుకే తనకు ఇష్టమైన పెసరట్టు దోశ తీసుకొచ్చా అంతే కానీ.. తనను నా వైపునకు తిప్పుకోవడానికి కాదు అంటుంది తులసి.

మరోవైపు శృతి కోసం అక్కడా ఇక్కడా వెతుకుతుంటాడు ప్రేమ్. శృతి ఖచ్చితంగా వాళ్ల కౌసల్య అత్తయ్య ఇంటికే వెళ్లి ఉంటుంది అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు ప్రేమ్ వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది శృతి. తెల్లారేసరికి నీ ప్రేమ్ వస్తాడన్నావు కదా. ఏడి నీ ప్రేమ్ ఇంకా రాలేదు అంటుంది కౌసల్య.

ఇంతలో ప్రేమ్ వాళ్ల ఇంటికి వస్తుంటాడు. అతడిని చూసి శృతి సంతోషిస్తుంది కానీ.. నువ్వు ముందు లోపలికి వెళ్లు. ఒక రెండు నిమిషాలు నేను ప్రేమ్ ఆటాడుకుంటాను అంటుంది కౌసల్య. ఇంతలో శృతి లోపలికి వెళ్తుంది. ప్రేమ్ అక్కడికి వెళ్తాడు. శృతి చాటుగా గమనిస్తూ ఉంటుంది.

నువ్వా అబ్బాయి ఎంత సేపు అయింది వచ్చి.. చూడలేదు. నువ్వు ఒక్కడివే వచ్చావేం. నా మేనకోడలు శృతిని తీసుకురాలేదేంటి.. అని అడుగుతుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. మా గొడవ గురించి ఈవిడకు చెబితే అనవసరంగా తొందరపడి మా అమ్మకు చెబుతుంది. ఎలాగోలా తనను మేనేజ్ చేయాలి అని అనుకుంటాడు ప్రేమ్.

అవునా.. ఏది ఫోన్ చేయి ఒకసారి అంటుంది. దీంతో నేను మళ్లీ చేస్తాను.. ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. ఇంతలో ప్రేమ్ అంటూ శృతి వెళ్లబోతుండగా ఆపుతుంది కౌసల్య. ప్రేమ్ నీకోసం రాలేదు అంటుంది కౌసల్య. దీంతో శృతి షాక్ అవుతుంది.

మరోవైపు నందు, లాస్య.. ఇద్దరూ సామ్రాట్ దగ్గరికి వెళ్తారు. వెల్ కమ్ అని చెబుతాడు సామ్రాట్. నా లాంటి సామ్రాట్ ను వంద మందిని క్రియేట్ చేయాలి అంటాడు. క్రియేటివిటీ ఏ ఒక్కరి సొత్తు కాదు అంటాడు సామ్రాట్. కానీ.. పెట్టబడి లేక పుట్టిన చోటే సమాధి అవుతుంటాయి అంటాడు.

గొప్ప బిజినెస్ ఐడియాలు ఉన్నవాళ్లను వెతికిపట్టుకోవాలి అంటాడు సామ్రాట్. దీంతో నేను వంద మంది సామ్రాట్ లను వెతికి పట్టుకుంటాను సార్. థాంక్యూ అంటాడు నందు. మరోవైపు ఐడియాల కోసం సోషల్ మీడియాలో నందు ఓ పోస్ట్ పెడతాడు. దాన్ని అంకిత చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది