Intinti Gruhalakshmi 23 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 మే 2022, సోమవారం ఎపిసోడ్ 639 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి సంగీతం మీద కొన్ని డౌట్స్ ఉండటంతో యూట్యూబ్ లో చూసి రాత్రి సాధన చేస్తుంది. దాంట్లో చూసి రాత్రి అన్నం తిన్న తర్వాత ఆరు బయట కూర్చొని నేర్చుకుంటూ ఉంటుంది తులసి. తనకు ఉన్న పట్టుదలను చూసి దివ్య షాక్ అవుతుంది. నీకు ఉన్న ఓపికలో మాకు సగం ఉన్నా మేము ఎప్పుడో బాగుపడేవాళ్లం అని అనుకొని వెళ్లి నిద్రపోతుంది. పరందామయ్య కూడా అదే చెబుతాడు తులసితో. తను అనుకుందంటే ఏదైనా సాధించేవరకు వదలదు అని అంటాడు పరందామయ్య. తన సాధన పూర్తయ్యాక.. గులాబి చెట్టు వైపు చూసి ఏంటి నా పాట బాగుందా అని అడుగుతుంది.
రోజు రోజుకూ సంగీతం విషయంలో నా మీద నాకే నమ్మకం కలుగుతోంది. ఈ విషయంలో ప్రవళికకు థాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. రోజూ తులసి పాట వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటోంది అని అంటుంది అనసూయ. మరోవైపు నందు తనకు జరిగిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సతీశ్ తనను తీవ్రంగా అవమానించడాన్ని జీర్ణించుకోలేడు నందు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. తన చేయి పట్టుకుంటుంది. సారీ నందు అంటుంది. తప్పు నాదే అంటుంది. నిన్ను సతీశ్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండాల్సింది అంటుంది. ఎవరు ఏంటో తెలుసుకున్నావు కదా.. అంటారు నందు.
అయితే.. నువ్వు మరొక కంపెనీ స్టార్ట్ చేయి అంటుంది లాస్య. దీంతో కంపెనీ స్టార్ట్ చేయడం అంటే మాటలు కాదు.. పెట్టుబడి కావాలి అంటాడు నందు. మనం ఇన్వెస్ట్ చేసేవాళ్లను వెతుకుదాం అంటుంది లాస్య. దీంతో నా ఫ్రెండ్ సంజన ఇన్వెస్ట్ మెంట్ కోసం వెయిట్ చేస్తోంది అని అంటుంది.
దీంతో అది జరిగే పని కాదు లాస్య అంటాడు. సంజనాను అడగనివ్వు అంటుంది లాస్య. దీంతో సరే.. నీ ఇష్టం అంటాడు నందు. దీంతో లాస్య చాలా సంతోషిస్తుంది. కట్ చేస్తే తెల్లారుతుంది. సంజన ఇంటికి వెళ్లి సంగీతం నేర్పిస్తూ ఉంటుంది తులసి.
ఇంతలో అక్కడికి లాస్య వస్తుంది. తులసిని కోపంగా చూస్తుంది. పొగరు కాకపోతే కనీసం నా వైపు కూడా చూడటం లేదు అని అనుకుంటుంది లాస్య. ఇంతలో సంజన అక్కడికి వస్తుంది. ఏంటి టీచర్ తో మాట్లాడటానికి వచ్చావా అంటుంది. లేదు.. నీతో మాట్లాడటానికి వచ్చాను అంటుంది లాస్య.
దీంతో ఇద్దరూ హాల్ లోకి వెళ్తారు. మా నందు సాఫ్ట్ వేర్ ఎక్స్ పర్ట్.. ఓన్ గా ప్రాజెక్ట్స్ డీల్ చేసే కెపాసిటీ ఉంది. ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాడు. నువ్వు ఇన్వెస్ట్ చేశావంటే నీకు 50 శాతం ప్రాఫిట్ ఇస్తా అంటుంది లాస్య. దీంతో సరే.. మా ఆయనతో ఒకసారి మాట్లాడి నీకు ఫోన్ చేస్తా అంటుంది సంజన.
ఇంతలో తులసి క్లాస్ అయిపోయింది అని చెబుతుంది. లాస్య అక్కడి నుంచి వెళ్లిపోయాక.. తులసి.. సంజనకు ఏదో చెప్పడం వింటుంది లాస్య. సంజన, తులసి అంత క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతుంది లాస్య. ఏదో ఒక కారణం చెప్పి ఇన్వెస్ట్ చేయకుండా ఆపుతుందా అని అనుకుంటుంది లాస్య.
మీరు నేర్పించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మా పిల్లల్లో చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తోంది అని అంటుంది సంజన. మరోవైపు నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. నందు దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటుంది లాస్య. మనం కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం అంటుంది లాస్య.
సంజన మన ప్రపోజల్ కు ఒప్పుకుంది అని అంటుంది నందుతో. ఇంతలో సంజన ఫోన్ చేస్తుంది. సారీనే.. మా ఆయన ఒప్పుకోలేదు అంటుంది సంజన. సారీ లాస్య అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సంజన. దీంతో లాస్యకు చిరాకు వేస్తుంది. తను వెళ్లేముందు తులసి.. సంజనతో మాట్లాడటం గుర్తు తెచ్చుకొని ఇదంతా తులసే చేసింది అని నందుతో చెబుతుంది.
సంజనతో మాట్లాడేటప్పుడు తను ఆ ఇంట్లోనే ఉంది. ఖచ్చితంగా తనే మన గురించి చెడుగా చెప్పి సంజన మైండ్ పొల్యూట్ చేసింది అని అంటుంది లాస్య. ఏం చేద్దాం అని అంటుంది. దీంతో బుద్ధి చెబుదాం పదా అంటాడు నందు. మరోవైపు తులసి సంగీత పాఠశాల అనే బోర్డును రాసి అందరికీ చూపిస్తుంది.
ఇంతలో అక్కడికి తులసి, నందు వచ్చి.. తులసి అంటూ గట్టిగా అరుస్తుంది తులసి. కొంపలు కూల్చే మనిషిని ఇంట్లో పెట్టుకొని నన్ను అపశకునం అంటారేంటి అంటుంది లాస్య. కొంపలు ముంచే పని చేసేది మీరు అంటుంది అనసూయ. కానీ.. లాస్య మాత్రం రెచ్చిపోతుంది.
సంజనకు నా గురించి ఏం చెప్పావు అని అడుగుతుంది లాస్య. దీంతో తను ఎప్పటి నుంచో నీ ఫ్రెండ్. నీ గురించి తనకు నేనేం చెబుతాను అంటుంది. అబద్ధం చెప్పకు అంటుంది. నందు పెట్టే కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని తనకు చెప్పాను. తను ఒప్పుకుంది.
కానీ.. ఈ విషయం విన్న నువ్వు తనకు మా గురించి చెప్పి తన మైండ్ పొల్యూట్ చేశావు అంటుంది. దీంతో నిజంగా నాకు అంత తెలివే ఉంటే ఈరోజు లాస్య ఇక్కడ ఉండేదే కాదు అంటుంది. ఎదుటి వాళ్ల జీవితాన్ని నాశనం చేసేంత ఓపిక కూడా నాకు లేదు.
నేను చాడీలు చెప్తే నమ్ముతుందా మీ ఫ్రెండ్.. అంటుంది తులసి. మరోవైపు ఆ బోర్డు పట్టుకొని లోపలికి వెళ్లి బోర్డు మీద మళ్లీ ఏదో రాసి తీసుకొస్తుంది దివ్య. మరోవైపు నందు, లాస్య మీద తీవ్రంగా విరుచుకుపడుతుంది తులసి. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు నందు, లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.