
ATM Transaction Charges In Fy22 Minimum Balance Charge Collections
ATM Transaction Charges : కేవలం ఏటీఎమ్ సర్వీస్ చార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాదారులనుంచి ఓ బ్యాంక్ కు ఏకంగా వందల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫెనాల్టీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. అలాగే ఏటిఎమ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ పరిమితికి మించి చేస్తే అదనపు చార్జీలను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అదనపు చార్జీలు మొత్తంగా కలుపుకొని బ్యాంకులకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతున్నాయి. ఇందులో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంత ఆర్జిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…పంజాబ్ నేషనల్ బ్యాంకు దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంక్ గా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా 4500 కు పైగా బ్రాంచ్ లు ఉన్నాయి. మొదటగా పంజాబ్ నేషనల్ బ్యాంకును 1895లో లాహోర్ లో లాలా లజపతి రాయ్ స్థాపించారు. కాగా ఇండియాలో ఇండియన్స్ ఎస్టాబ్లిష్ చేసిన మొదటి బ్యాంక్ ఇదే. అయితే ఇటీవల ఈ బ్యాంక్ కొత్త నిబంధనలతో మినిమమ్ బ్యాలెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. దీంతో కస్టమర్లు భారీగానే చెల్లించుకుంటున్నారు.పట్టణ ప్రాంతాల్లోని ఖతాదారులు తమ అకౌంట్‌లో కనీసం రూ.10 వేలు మెయింటైన్ చేయాలి. కాగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని రూ.1000 గా నిర్ణయించింది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే గతంలో ఉన్న 300 రూపాయల ఫెనాల్టీని రూ. 600 కు పెంచేసింది. అలాగే సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు రూ. 400 గా నిర్ణయించింది.
ATM Transaction Charges In Fy22 Minimum Balance Charge Collections
మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు 85,18,953 మంది ఖాతాదారుల నుంచి రూ.239 కోట్లు వసూలు చేసింది. అలాగే ఏటీఎం అదనపు చార్జీల పేరుతో రూ. 645 కోట్లు కలెక్ట్ చేసింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో నెలలో 5 సార్లు లావాదేవీలు ఉచితంగా జరపవచ్చు. అంతకుమించి జరిపితే ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ.10 వసూలు చుస్తుంది. అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంలు ఉపయోగిస్తే మెట్రోయేతర సిటీల్లో 5 ట్రాన్సాక్షన్స్ ఉచితం. కాగా పరిమితికి మించి చేస్తే ప్రతి లావాదేవికి రూ.20 వడ్డిస్తోంది.
TG Govt Jobs 2026 : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్…
Parag Agarwal : ఎలాన్ మస్క్ చేతిలో పరాభవం ఎదురైనప్పటికీ, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ పడిలేచిన కెరటంలా…
IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్‌తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్‌పూర్…
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో…
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
Onions for Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతున్న…
This website uses cookies.