Intinti Gruhalakshmi 24 Oct Today Episode : వర్షంలో తడిసి ముద్దయిన తులసి, సామ్రాట్.. గెస్ట్ హౌస్ కు వెళ్లి ఒకే బెడ్ రూమ్ లో.. నందుకు తెలుస్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: October 24, 2022, 9:00 am

Intinti Gruhalakshmi 24 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 771 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్ కోసం తులసి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పటికే లాస్య, నందు తన ఇంటికి వస్తారు. సామ్రాట్ ఇంకా రాలేదు ఏంటి అని పరందామయ్య అడుగుతాడు. ఆ తర్వాత చీర బాగుంది. కొత్తదా అని అడుగుతుంది లాస్య. దీంతో అవును కొత్తదే. మా ఆయన అప్పుడెప్పుడో కొనిచ్చారు. దాన్ని కట్టుకోవడానికి ఇప్పుడు సమయం దొరికింది అంటుంది తులసి. ఇంతలో సామ్రాట్ వస్తాడు. ఇక వెళ్లండి మేడమ్. అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అంటుంది లాస్య. అవును ఆయన లోపలికి రాలేదేంటి నందు అంటుంది తులసి. దీంతో పబ్లిసిటీ కోసం. మేము తెగించి తిరుగుతాం అని కాలనీ వాళ్లకు చెప్పడం కోసం అంటాడు. ఈరోజు ఊరు దాటి తిరుగుతున్నారు. రేపు దేశం దాటి తిరుగుతారు అంటాడు నందు. ఆ తర్వాత ఇన్ని మాటలు పడి వెళ్లాలా అంటుంది అనసూయ. మా తులసి ఏం చేసినా రైటే చేస్తుంది అంటాడు పరందామయ్య.

intinti gruhalakshmi 24 october 2022 full episode

intinti gruhalakshmi 24 october 2022 full episode

ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వస్తుంది తులసి. అక్కడ కారు పక్కన తులసి కోసం సామ్రాట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సిగ్గులేకుండా ఎంత బరి తెగించి పోయాడు. డ్రైవర్ లా కారు డోర్ తీసి పట్టుకుంటున్నాడు అని అనుకుంటుంది అనసూయ. ఆ తర్వాత ఇద్దరూ వరంగల్ కు కారులో బయలు దేరుతారు. కారులో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు తులసి, సామ్రాట్. నాకు కావాల్సింది ప్రశాంతత అంటుంది తులసి. నేనంటే ఎవ్వరికీ ఎంత కోపం ఉన్నా సరే.. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రాకపోతే అందరూ కంగారు పడతారు. ఒకరిని చూడకుండా ఒకరం ఉండలేం. అదొక అందమైన ప్రపంచం అంటుంది తులసి. దీంతో మీరు చెబుతుంటే నాకు కూడా అలాంటి ప్రపంచం ఉంటే బాగుండు అనిపిస్తోంది అంటాడు సామ్రాట్.

ఆశపడగానే సరిపోదు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటాడు సామ్రాట్. దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. ఎవరికి దక్కాల్సిన ఆనందం వాళ్లకు ఇస్తాడు. దొరికిన దానితో తృప్తి పడాలి అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 24 Oct Today Episode : అనసూయను రెచ్చగొట్టిన లాస్య

అవును.. నా గురువు దగ్గర అదే నేర్చుకొన్నా అంటాడు సామ్రాట్. గురువా ఎవరు ఆ గురువు అంటుంది తులసి. దీంతో ఇంకెవరు మీరే అంటాడు సామ్రాట్. కట్ చేస్తే అనసూయ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంతలో కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది లాస్య. మామూలుగా చెబితే ఎందుకు తులసి వింటుంది. ఒకప్పుడు నా మీద ఎంతలా అరిచేవారో మరిచిపోయారా? ఏకమైపోయింది ఆ ఆవేశం అంటుంది లాస్య.

అనసూయను రెచ్చగొడుతుంది లాస్య. అత్తయ్య ఒకటి గుర్తు పెట్టుకోండి. తులసి మిమ్మల్ని చూడకపోతే ప్రపంచం ఏమీ తలకిందులు కాదు. మీ కొడుకు ఇంట్లో మీరు ఉండొచ్చు. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. కానీ.. తులసికి భయపడి పారిపోయావు అని ఈ కాలనీ వాళ్లు అనుకుంటారు అంటుంది లాస్య.

మధ్యలో తులసికి ఒక గుడి కనిపించడంతో ఆ గుడి లోపలికి వెళ్తారు సామ్రాట్, తులసి. దేవుడిని దర్శించుకొని మనసు ప్రశాంతంగా ఉంది అంటుంది తులసి. రండి.. కాసేపు అక్కడ కూర్చుందాం అని తనను తీసుకెళ్తాడు సామ్రాట్.

మరోవైపు నందు, దివ్య ఇద్దరూ కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. నందు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వస్తుంది అనసూయ. ఇంతలో అంకిత వచ్చి భోజనం టైమ్ అయింది. అన్నం పెట్టనా అంటుంది అంకిత.

దీంతో పిండం పెట్టవే అంటుంది అనసూయ. ఏంటి అమ్మమ్మ అలా అంటున్నారు అంటుంది అంకిత. మీ ఆంటీ చేసిన పనికి నాకు కడుపు నిండిపోయింది అంటుంది అనసూయ. ఇంతలో దివ్య ఉండి.. ఏం కూర వండావు వదిన అని అడుగుతుంది దివ్య.

దీంతో గుత్తి వంకాయ కూర అంటుంది అంకిత. దీంతో తనకు కూడా నోరు ఊరుతుంది. మరోవైపు గుడిలో కూర్చొని సరదగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు సామ్రాట్, తులసి. అక్కడ ఉన్న భక్తులు వాళ్లను చూసి.. ఆయన ఎంత బాగున్నాడు కదా అని అనుకుంటారు.

నాకు ఇలాంటి వాడు కావాలి అని అక్కడున్న యువతులు అనుకుంటారు. ఆ తర్వాత రాత్రి అవుతుంది. తులసి, సామ్రాట్ ఇద్దరూ వానలో తడిచి ఒక గెస్ట్ హౌస్ లో తలదాచుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Soundarya : సౌందర్యతో నా బంధం అలాంటిది.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన నటుడు సురేష్!"

  2. "Tatkal Ticket Refund : తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు కట్ అవుతుంది? రీఫండ్ రూల్స్ ఇవే!"

  3. "Ginger Tulsi Tea : గొంతు నొప్పి, జలుబుతో ఇబ్బందా? ఇంట్లోనే అల్లం తులసి టీ ఇలా తయారు చేసుకోండి!"

  4. "AP Telangana Rains : ఆర్నాబ్ తుఫాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల భయం.. ఈ జిల్లాల్లో అప్రమత్తతం..!"

  5. "Hyper Aadi : మళ్లీ జనసేన కోసం హైపర్ ఆది.. ఇంటింటి ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్లు!"

  6. "Vijay Deverakonda : రష్మికతో విడాకుల ప్రచారం.. ఒక్క కిస్ ఫొటోతో విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై..!"

  7. "Anirudh Reddy : నేను చచ్చిపోయాక నిధులు ఇవ్వండి.. సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp