Intinti Gruhalakshmi 26 Nov Today Episode : తులసికి అనారోగ్యం.. లాస్యను వదిలేసి తులసిపై ప్రేమ కురిపిస్తున్న నందు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 26 Nov Today Episode : తులసికి అనారోగ్యం.. లాస్యను వదిలేసి తులసిపై ప్రేమ కురిపిస్తున్న నందు

 Authored By gatla | The Telugu News | Updated on :26 November 2021,12:00 pm

Intinti Gruhalakshmi 26 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 487 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, నందు.. ఇద్దరూ గొడవ పెట్టుకుంటారు. తులసి చాలా సీరియస్ అవుతుంది. లాస్యను ఎందుకు పెళ్లి చేసుకోనని అంటున్నారు. అన్ని విషయాల్లోనూ మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీరు ఇకనైనా మారరా.. అంటూ సీరియస్ అవుతుంది. దీంతో నందుకు కూడా కోపం వస్తుంది.నువ్వు వెంటనే లాస్యను పెళ్లి చేసుకోవాల్సిందే.. అంటుంది తులసి. నాకు సమయం కావాలి తులసి అని అంటాడు నందు. మరి నాతో విడాకుల విషయంలో మాత్రం ఎందుకు అంత తొందరపడ్డారు. అప్పుడెందుకు సమయం తీసుకోలేదు అంటుంది తులసి. దీంతో నందు ఏం మాట్లాడడు.

intinti gruhalakshmi 26 november 2021 full episode

intinti gruhalakshmi 26 november 2021 full episode

మీ తప్పును ఒప్పుకోవడానికి భయపడుతున్నారా? ఆడదాన్ని బలహీనురాలు.. చేతగానిది అని నిందించే మీరు.. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయారు. కానీ.. ఆడది మాత్రం ఎలాంటి కష్టాలను అయినా రాయిలా భరిస్తుంది.. సహిస్తుంది. ఆడదాని ముందు కష్టాలు ఓడిపోతాయి.. కానీ ఆడది ఓడిపోదు.. అంటుంది తులసి.నన్ను బలవంతపెట్టకు తులసి అంటాడు నందు. నన్ను ఇంకా బలవంతపెడితే నేనేం చేస్తానో నాకు తెలియదు అంటాడు నందు. ఇంతలో తులసి కింద పడిపోతుంది. తులసి స్పృహ తప్పి పోతుంది. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే అందరూ కుటుంబ సభ్యులు వచ్చి తులసిని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు.

ఊరికే కళ్లు తిరిగి ఎందుకు పడిపోతుందో అర్థం కాదు. ఇంతలో తులసికి స్పృహ వస్తుంది. ఒకసారి హాస్పిటల్ కు వెళ్దాం అంటాడు అభి. ఆసుపత్రికి తీసుకెళ్తారు. కొన్ని మందులు ఇచ్చి టెస్టులు చేపిస్తుంది డాక్టర్. స్కానింగ్ కూడా తీపిస్తారు. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ షాక్ అవుతుంది.గర్భాశయంలో చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నట్టు డౌట్ గా ఉంది అంటుంది డాక్టర్. ట్రీట్ మెంట్ తో తగ్గిపోవాలి.. కానీ ఒకసారి బయాక్సీ చేపిద్దాం అంటుంది డాక్టర్.

అంటే క్యాన్సరా అంటాడు అభి. ఒకసారి చెక్ చేసి చూద్దాం అంటుంది డాక్టర్. అభి టెన్షన్ పడుతుంటాడు.. ఏం చేయాలో అర్థం కాదు.నేను వెల్ నెస్ సెంటర్ కు వెళ్తున్నాను. అక్కడికి తులసిని తీసుకెళ్దాం అంటుంది డాక్టర్. కొద్ది రోజులు అక్కడ ఉంచుదాం. ఆ సెంటర్.. ఫేమస్ అంకాలజిస్ట్ డాక్టర్ అధ్వైత కృష్ణ గారిది అని చెబుతుంది డాక్టరమ్మ. క్యాన్సర్ అవేర్ నెస్ మీద సోషల్ మీడియాలో ఆర్టికల్స్ రాయిస్తారు.. అంటాడు అభి.అభి.. తులసిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడతారు. అయితే.. వెల్ నెస్ సెంటర్ కు కొన్ని రోజులు తీసుకెళ్లాలి అంటాడు ప్రేమ్. నేను రాను అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 26 Nov Today Episode : అందరూ తులసితో పాటు వెల్ నెస్ సెంటర్ కు వెళ్లేందుకు రెడీ

నువ్వు రాకుండా ఉంటే ఎలా అంటాడు నందు. ఇంట్లో వాళ్లను వదిలేసి వారం రోజులు ఉండాలంటే నావల్ల కాదు అంటుంది తులసి.దీంతో అందరం కలిసి అక్కడికి వెళ్దాం అంటాడు పరందామయ్య. దీంతో సరే.. అంటారు అందరు. నా ఒక్కదాని కోసం మీరందరూ వస్తారా? అంటే తప్పేముంది ఆంటి.. మాకోసం మీరు ఉన్నప్పుడు.. మీకోసం మేము ఉండటంలో తప్పేముంది అంటుంది శృతి.

మనమేమన్నా పిక్ నిక్ కు వెళ్తున్నామా? నేను అయితే రాను అంటుంది లాస్య. నిన్నెవరూ బొట్టు పెట్టి పిలవట్లేదు. ఇష్టం లేకపోతే నువ్వు రాకు అంటాడు ప్రేమ్. నేనే కాదు నందు కూడా రాడు అంటుంది లాస్య. దీంతో ఆమాట చెప్పాల్సింది నువ్వు కాదు.. నాన్న అంటాడు ప్రేమ్.కానీ.. నందు ఏం మాట్లాడడు. ఇవన్నీ కాదు.. మనమంతా వెల్ నెస్ సెంటర్ కు వెళ్తున్నాం అంటుంది అనసూయ. దీంతో అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు.

ఉదయాన్నే అందరూ బయలుదేరుతుండగా.. నందు రాడు. అందరూ బ్యాగులు సర్దుకుంటారు. నందు కూడా బ్యాగు సర్దుకుంటుండగా ఎక్కడికి వెళ్తున్నవు అని అడుగుతుంది లాస్య. నేను తులసి వాళ్లతో కలిసి వెళ్తున్నా అంటాడు నందు. ఏ హోదాతో వాళ్లతో వెళ్తున్నావు అంటుంది లాస్య. పాతికేళ్లుగా తనతో సేవలు చేయించుకున్నందుకు వెళ్తున్నా అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది