Intinti Gruhalakshmi 26 Sep Today Episode : హనీ.. సామ్రాట్ సొంత కూతురు కాదా.. తన చెల్లి కూతురా? సామ్రాట్ అబద్ధం ఎందుకు చెప్పాడు?
Intinti Gruhalakshmi 26 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 747 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్.. ప్రెస్ మీట్ కోసం రెడీ అవుతాడు. ఇంతలో తులసి వస్తుంది. ప్రెస్ మీట్ లో ఏం టెన్షన్ పడకండి. ఏ ప్రశ్నకైనా కూల్ గా సమాధానం చెప్పండి అని అంటాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది తులసి. ప్రెస్ మీట్ కోసం రిపోర్టర్లు వెయిట్ చేస్తుంటారు. తులసితో తన జీవితం పంచుకోవడానికి చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టారేమో అని లాస్య.. నందుతో అంటుంది. నేను కూడా ప్రెస్ మీట్ లో మీతో పాటే కూర్చొంటా అంటే సరే అని హనీని కూడా ఎత్తుకొని ప్రెస్ మీట్ దగ్గరికి తీసుకెళ్తాడు సామ్రాట్. మా కొత్త ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వడానికి మిమ్మల్ని ఆహ్వానించాను అని చెబుతాడు సామ్రాట్.
మీరు అప్ డేట్ ఇచ్చే ముందు మేము అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అంటుంది ఓ రిపోర్టర్. ఆ రిపోర్టర్ లాస్య చెప్పినట్టుగా కావాలని ప్రశ్నలు అడగుతుంది. భూమి పూజ జరిగిన రోజే తులసి గారు పార్టనర్ షిప్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ మీ పక్కన కూర్చున్నారు. మీ పార్టనర్ షిప్ కోసం మీరు ఏం చేశారు. ఆవిడ కాళ్లు పట్టుకున్నారా? తెర వెనుక ఏం జరిగింది సార్ అని అడుగుతుంది రిపోర్టర్. దీంతో తులసి, సామ్రాట్ షాక్ అవుతారు. మీరు ప్రశ్నలు కొంచెం పద్ధతిగా అడగండి అని అంటుంది తులసి. దీంతో సరే అది రూమరే అని అనుకుందాం. ఏమాత్రం చదువులేని తులసి గారిని ఆఫీసులో అతి పెద్ద పోస్ట్ లో పెట్టడం కూడా రూమరేనా? ఎవరి మీదా చూపించని శ్రద్ధ మీరు కేవలం తులసి గారి మీదనే చూపించడం కూడా రూమరేనా అని రిపోర్టర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు.
ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు అని అంటాడు సామ్రాట్. మీకు నిజంగా తెలియదో.. తెలిసీ తెలియక నాటకం ఆడుతున్నారో కానీ.. మీ ఇద్దరి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీరిద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడుతున్నారు. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని అని అంటారు మీడియా వాళ్లు.
Intinti Gruhalakshmi 26 Sep Today Episode : ప్రెస్ మీట్ లో సామ్రాట్ భార్య గురించి అడిగిన రిపోర్టర్
మీ బిజినెస్ పార్టనర్ ను లైఫ్ పార్టనర్ గా చేసుకుంటున్నారు ఓకే కానీ.. మీ భార్య సంగతి ఏంటి. నిందలన్నీ నిజాలుగా ఒప్పుకున్నట్టేనా.. అని అంటుంది రిపోర్టర్. అడిగే వాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే. ఊహించుకున్నదే నిజం అనుకుంటారు అంటుంది తులసి.
వాళ్లేమనుకుంటున్నారు.. రూమర్లు, పుకార్లు అంటూ ఏదైనా అడగొచ్చు.. తప్పు లేదు కానీ.. దాని తాలూకు బాధ భరించే వాళ్లకే తెలుస్తుంది అంటుంది తులసి. ఒక ఆడ, ఒక మగ కలిసి బిజినెస్ పార్టనర్స్ గా ఉండటం నేరమా.. తప్పా? అలా ఉంటే వాళ్ల మధ్య ఏదో సంబంధం ఉన్నట్టేనా అని ప్రశ్నిస్తుంది తులసి.
ఎందుకు సూటిపోటి మాటలతో బాధిస్తారు. వాళ్ల బతుకులను వాళ్లను బతకనివ్వరా? మీ ముందు అగ్ని పరీక్షకు నిలబడాలా? తరతరాలుగా ఆంక్షలను, ఇనుప గోడల మధ్య మక్కిన ఆడది.. ఇప్పుడిప్పుడే అడుగులు బయటపెట్టి స్వేచ్ఛగా ఎగరాలని అనుకుంటోంది అంటుంది తులసి.
ఎందుకు మిమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారు. మేము చేసిన తప్పులేంటి అని అడుగుతుంది తులసి. నా ముందు కూర్చొన్న రిపోర్టర్లలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. మీ కుటుంబంలో కూడా ఆడవాళ్లు ఉంటారు. ఉద్యోగం చేస్తుంటారు. వాళ్లను కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? అని రిపోర్టర్లతో అంటుంది తులసి.
ప్రతి మగాడిని చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి ఆడదాన్ని నిందించకండి.. గౌరవించండి. మీరు రాసే రాత ఆడదాని తలరాత మారుస్తుందని గుర్తుంచుకోండి. ఆడదాన్ని కూడా బతకనివ్వండి. బయట మా గురించి నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు.. పట్టించుకోను. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం వ్యాపార భాగస్వామ్యం మాత్రమే అంటుంది తులసి.
ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా.. అవునన్నా కాదన్నా ఆ భాగస్వామ్యం తెగిపోదు. ఎవరేమనుకున్నా.. భయపడి వెనక్కి తగ్గేదే లేదు.. రాసుకోండి అని అంటుంది తులసి. దీంతో రిపోర్టర్లు అందరూ చప్పట్లు కొడతారు.
సామ్రాట్ గారి భార్య గురించి అడిగారు. అది ఆయన వ్యక్తిగత జీవితం. ఆయన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం ఏంటి.. అంటూ ప్రశ్నిస్తుంది తులసి. దీంతో నేను ఈ ప్రశ్న అడగడం తప్పే. క్షమించండి సామ్రాట్ గారు అంటుంది రిపోర్టర్.
ఆ తర్వాత రిపోర్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత తులసి కుటుంబ సభ్యులు అందరూ తనను మెచ్చుకుంటారు. నా కోడలు ఎప్పుడూ తప్పు చేయదు అంటుంది అనసూయ. సామ్రాట్ మాట్లాడిన చోట మాట్లాడకుండా ఉంటే ఎన్నిరోజులు ట్రావెల్ చేస్తావు మామ్ అంటాడు అభి.
అసలు ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారో నాకూ ఆశ్చర్యంగానే ఉంది అని అంటుంది తులసి. ఆయన మౌనం వెనకాల ఏదో చెప్పుకోలేని కారణం ఉండి ఉంటుంది అంటుంది తులసి. నువ్వు ధైర్యం చేసి గట్టిగా మాట్లాడావు కాబట్టి సరిపోయింది అంటుంది అనసూయ.
తర్వాత హనీ దగ్గరికి వెళ్తాడు. తను పడుకొని ఉంటుంది. నిప్పులాంటి నిజాన్ని నా మనసులోనే దాచుకొని నీ సంతోషం కోసం నేను తప్పు చేస్తున్నాను అని అనుకుంటాడు సామ్రాట్. నాన్న కాని నాన్నను క్షమించమ్మా. ఈ అమ్మ ప్రేమను వదులకొని నా చెల్లి తన జీవితాన్ని కాదనుకొని వెళ్లిపోయింది.
నీలో నా చెల్లిని చూసుకుంటున్నాను అని హనీతో చెబుతాడు. నా చెల్లికి అందించాల్సిన ప్రేమను నీకు అందిస్తున్నాను. ఇది తప్పా ఒప్పా అనేది దేవుడే చెప్పాలి. భారమంతా ఆ దేవుడికే వదిలేస్తున్నాను అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.