Intinti Gruhalakshmi 27 Sep Today Episode : సామ్రాట్ ను అవమానించిన అభి.. హనీ ఎవరో అసలు నిజం అందరికీ చెప్పేసిన బాబాయి

Authored By Varun G | The Telugu News | Updated on: September 27, 2022, 9:16 am

Intinti Gruhalakshmi 27 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 748 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీని చూస్తూ తన చెల్లి గురించి మాట్లాడుకుంటాడు సామ్రాట్. ఇంతలో హనీ లేచి ఏమైంది నాన్న అంటుంది. మా నాన్న ఎవరి ముందు అవమానపడకూడదు. మా అమ్మ గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పడం లేదు. నేను అడుగుతా చెప్పు అని అంటుంది హనీ. కానీ.. సామ్రాట్ తనకు ఏం చెప్పలేకపోతాడు. రాత్రి అయింది పడుకో అని చెప్పి వెళ్లిపోతాడు సామ్రాట్. రాత్రి ఒంటరిగా ఆలోచిస్తున్న సామ్రాట్ దగ్గరికి వచ్చిన బాబాయి ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు బాబాయి. తులసిని ఆహారంగా వేసి ప్రెస్ వాళ్ల ముందు మౌనంగా కూర్చున్నావు. నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు అని అడుగుతాడు బాబాయి. దీంతో నేను ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసు కదా అంటాడు సామ్రాట్.

intinti gruhalakshmi 27 september 2022 full episode

intinti gruhalakshmi 27 september 2022 full episode

తను ధైర్యంగా మాట్లాడి అందరి నోళ్లు మూయించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేది అని అంటాడు బాబాయి. ఒక నిజం దాచడం కోసం ఒక చిన్న ప్రాణం జీవితాంతం బాధపడకుండా ఉండటం కోసం నేను ఆ పని చేశాను. ఆ సమయంలో నాకు హనీ తప్ప ఇంకెవరూ గుర్తుకు రాలేదు బాబాయి అంటాడు సామ్రాట్. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఈ  నిజాన్ని దాస్తావు అంటే.. నాకు తెలియదు బాబాయి అంటాడు సామ్రాట్. దీంతో ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం అని అంటాడు బాబాయి.

కట్ చేస్తే అభికి అస్సలు నిద్ర పట్టదు. దీంతో లేచి కిందికి వస్తాడు. అప్పుడు నందు, లాస్య కూడా వస్తారు. నువ్వు ఇంటికి పెద్ద కొడుకువు. ఇంటికి బాధ్యత తీసుకోవాల్సిన వాడివి అంటాడు నందు.

అభి మాటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కదా అంటుంది లాస్య. నాతో క్లోజ్ గా ఉంటున్నందుకే ఇంట్లో వాళ్లు నిన్ను దూరం పెడుతున్నారు. నా కారణంగా నువ్వు ఇంట్లో దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అంటాడు నందు.

Intinti Gruhalakshmi 27 Sep Today Episode : అభిని రెచ్చగొట్టిన లాస్య

మొత్తానికి అభిని రెచ్చగొడుతుంది లాస్య. కావాలని అతడిని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు నందు, లాస్య. కట్ చేస్తే తెల్లవారుతుంది. మేము ఇక వెళ్లి వస్తాం సామ్రాట్ గారు అని చెబుతుంది తులసి.

ఇక మా అమ్మ మీతో కలిసి పని చేయదు అని అంటాడు అభి. ప్రెస్ మీట్ కు పిలిచి నిన్ను అంతలా అవమానపరిచేలా చేశాడు ఆ పెద్దమనిషి. ఎందుకు ఇలా చేశాడు అని నువ్వు అడగవు. నన్ను అడగనివ్వవా అంటాడు అభి.

ఆయన ఏం చెబితే అది వేదం అని అంటాడు అభి. ఈయన్ను ఎలా నమ్ముతున్నావు అని అంటాడు అభి. ప్రెస్ వాళ్ల ముందు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పమను అంటాడు అభి.

ఈ మనిషి ఎలాంటోడో తెలియకుండా మామ్ ప్రపోజల్ కు ఇన్వెస్ట్ చేస్తున్నాడని ఆయన్ను ఊరేగిస్తున్నారు అంటాడు అభి. కోట్ల ఆస్తి ఉండటం గొప్ప కాదు.. నిజాయితీ ఉండటం గొప్ప అంటాడు అభి.

అంత నిజాయితీ ఉన్నవాడైతే తన భార్య గురించి నిజం చెప్పమను అంటాడు అభి. ప్రెస్ వాళ్ల ముందు ఎందుకు తలదించుకున్నాడు. తన వైపు తప్పు ఉండబట్టే కదా అంటాడు అభి. బాబాయికి కోపం వస్తుంది.

దీంతో ప్రతి మనిషి జీవితంలోనూ బయటికి చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి. అంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు అంటాడు సామ్రాట్. మీ భార్య ఏమైంది.. లేచిపోయిందా? వదిలేశారా? లేక చంపేశారా అని అడుగుతాడు అభి.

దీంతో సామ్రాట్ కు కోపం వస్తుంది. ఏం చేశారు చెప్పండి అని అడుగుతాడు అభి. దీంతో ఏం కూశావురా అంటూ బాబాయి వెళ్లి అభి గల్ల పట్టుకుంటాడు. దీంతో బాబాయి ఏం చేస్తున్నావు అని అంటాడు సామ్రాట్.

అవును.. తప్పు చేశాడు మావాడు అంటాడు బాబాయి. అవును.. మా వాడు హంతకుడే అంటాడు బాబాయి. చేయని తప్పుకు తన జీవితాన్ని చంపుకున్న హంతకుడు అంటాడు బాబాయి. కూతురు కాని కూతురు కోసం తన సంతోషాన్ని చంపుకున్న హంతకుడు అంటాడు బాబాయి.

నీ లాంటి వాళ్లు వేసే నిందలు మోస్తూ.. హనీ తన కూతురు కాదు.. తన చెల్లెలు కూతురు అని తనలోనే దాచుకున్న హంతకుడు అంటాడు బాబాయి. దీంతో అభి షాక్ అవుతాడు. అవన్నీ చెప్పుకునే స్థితిలో ఇప్పుడు మా వాడు లేడు అని అంటాడు బాబాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp