Intinti Gruhalakshmi 28 Nov Today Episode : లాస్య చేసిన పనికి నందు, తులసి షాక్.. తులసి ఇంటిని తన పేరు మీదికి మార్చుకొని అందరినీ వెళ్లగొట్టిన లాస్య
Intinti Gruhalakshmi 28 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 801 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య మళ్లీ తులసి మీద లేనిపోనివి చెప్పడంతో నీకు ఎప్పుడూ నాతోనే సమస్యా అంటుంది తులసి. దీంతో అత్తయ్య, మామయ్యకు మధ్య గొడవ నీవల్లే జరిగింది అంటుంది లాస్య. దీంతో లేదు.. తులసి వల్ల మేము గొడవ పడలేదు. తులసికి మా గొడవకు సంబంధం లేదు అంటుంది అనసూయ. దీంతో ఇప్పటికైనా నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావా అమ్మ అంటాడు నందు. నాన్నను నువ్వే వెళ్లి తీసుకొని రావాలి అంటాడు నందు. నాకు ఏం జరిగినా నేను పట్టించుకోను. నాన్న ఇంటికి తిరిగి రావాలి అంటాడు నందు. దీంతో ఆయన ఎంత నచ్చజెప్పినా వినడం లేదని అంటుంది అనసూయ.
తులసి చెప్పినా కూడా నందు వినడు. లాస్య మళ్లీ తులసి మీదికే టాపిక్ డైవర్ట్ చేస్తుంటే షటప్ లాస్య అంటాడు నందు. నాకు మానాన్న ఇంటికి రావడమే కావాలి అంతే. నాకు ఎవ్వరి మాటలు వినే సహనం లేదు అంటాడు నందు. దీంతో విన్నావు కదా.. అంటాడు నందు. అందరూ నందును చూసి భయపడతారు. దీంతో ఏం చేయాలో అనసూయకు అర్థం కాదు. అందరికీ డాడ్ కోపం మాత్రమే కనిపిస్తుంది కానీ.. నాకు మాత్రం భయం కనిపిస్తుంది. డాడ్, మామ్ డైవర్స్ అప్పుడు కూడా నేను ఇలాగే బాధపడ్డాను.. అని అంకితలో అంటుంది దివ్య. మీరు ఏమైనా చేసుకోండి. నాన్న ఇంటికి వచ్చే వరకు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టొద్దు అని నందు.. అనసూయ, తులసిని బయటికి నెట్టి డోర్ పెట్టబోతాడు.
తులసి ఆపుతుంది. కానీ.. అస్సలు వినడు నందు. మొండితనం చేయకు.. చేతులు తీయ్ అంటాడు నందు. దీంతో తులసి అస్సలు వినదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను మాత్రం చేతులు తీయను అని అంటుంది తులసి. మొహం మీద తలపు వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటుంది తులసి.
ఆంటీ చేతులు తీసేయండి అంటుంది అంకిత.. ఎవ్వరు చెప్పినా ఇద్దరూ వినరు. ఎవరికి మారు కోపంతో తలుపు మీద తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఇంతలో పరందామయ్యను తీసుకొని సామ్రాట్.. ఇంటికి వస్తాడు. డోర్ దగ్గరికి వచ్చిన పరందామయ్యను చూస్తాడు నందు.
Intinti Gruhalakshmi 28 Nov Today Episode : పరందామయ్యను క్షమించమని కోరిన నందు
నాన్నా అంటూ పరందామయ్య దగ్గరికి వెళ్తాడు. నాన్న అంటూ వెళ్లి హత్తుకుంటాడు. అత్తయ్య పశ్చాతాపం చేయలేని పని కొడుకు మీద ప్రేమ సాధించింది అని అనుకుంటుంది తులసి. ఆ తర్వాత తన కాళ్ల మీద పడతాడు నందు. మీరు తిరిగి వచ్చారు. ఇంతకన్నా నాకు కావాల్సింది ఏం లేదు.
రండి లోపలికి వెళ్దాం అంటాడు నందు. కానీ.. నన్ను క్షమించరా ఇదే నా హద్దు. ఇది దాటి లోపలికి రాలేను అంటాడు పరందామయ్య. నేను ఇక్కడి దాకా వచ్చింది లోపలికి తిరిగి రావడానికి కాదు. ఒక్క మాట చెప్పడానికి అంటాడు. ఈ ఇల్లు ఇప్పటి వరకు చాలా కోల్పోయింది.
ఇక మిగిలినవి అయినా కాపాడుకో. జాగ్రత్తగా దాచుకో. మీ ఇల్లు, మీ నాన్న, గౌరవం అన్నీ ముక్కలయిపోయాయి అంటాడు పరందామయ్య. చాలురా. ఇంకేమీ ముక్కలు కాకుండా చూసుకో. నిజానికి ఇది పగిలిన ముక్కలను పోగు చేసుకునే సమయం. ముక్కలయిన బంధాన్ని ఒక్క దగ్గరికి చేర్చుకో.
నేను ముక్కలయిన గౌరవాన్ని ఒక్కటయ్యేలా చేసుకుంటా అంటాడు పరందామయ్య. దీంతో అమ్మ చేసిన తప్పుకు మా అందరినీ శిక్షించకండి. ఈ ఇల్లు మీది. మీరు లేని ఇల్లు.. ఇల్లే కాదు. ప్లీజ్ లోపలికి రండి నాన్న అంటాడు నందు. దీంతో తప్పలేదు కాబట్టి.. లోపలి దాకా వచ్చాను. ఇంతకంటే లోపలికి రమ్మని చెప్పకు అంటాడు పరందామయ్య.
తర్వాత అంతా లాస్య వల్లే ఇదంతా జరిగింది అని పరందామయ్యను క్షమించమని అడుగుతుంది అనసూయ. దీంతో తప్పు చేసింది మీరు. ఇప్పుడు నన్ను అంటున్నారా అంటుంది. దీంతో తులసి నోరు అదుపులో పెట్టుకో లాస్య అంటుంది తులసి. ఇద్దరూ మళ్లీ తిట్టుకోబోతుండగా లాస్యపై సీరియస్ అవుతాడు నందు.
అందరి ముందు నా మీద అరవకు అంటుంది లాస్య. వాళ్ల మీద అరవకుండా నా మీద అరుస్తున్నావా అంటుంది. దీంతో నువ్వు ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యావు అంటాడు నందు. దయచేసి వీధిలో గొడవ వద్దు మీరు లోపలికి వెళ్లి మాట్లాడుకోండి అంటుంది తులసి.
ప్రేమ్ కూడా నోరు అదుపులో పెట్టుకో అంటాడు. దీంతో నువ్వు ముందు నోర్మూసుకో లేకపోతే అంటుంది లాస్య. దీంతో ఏం చేస్తావు అని లాస్యపై కొప్పడతాడు నందు. దీంతో మీరంతా మంచోళ్లు.. నేనే చెడ్డదాన్ని అంటుంది లాస్య. దీంతో నీకు ఇష్టం లేని వాళ్ల దగ్గర ఉండటం ఎందుకు.. పదా బట్టలు సర్దుకొని మనం వెళ్లిపోదాం అంటాడు నందు.
దీంతో అందరూ ఒక్కటయి నన్ను పరాయిదాన్ని చేశారు అంతే కదా. అందుకే చూడండి.. ఈ ఇంటి పేరును మా మీదికి మారింది అంటుంది. దీంతో నేను అత్తయ్య పేరు మీద రాశాను కదా అంటుంది తులసి. దీంతో నీకు తెలియకుండా ఇల్లును నా పేరు మీదికి మార్చుకున్నా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.