Intinti Gruhalakshmi 29 April Today Episode : తులసిని వాకింగ్ కు తీసుకెళ్లిన ప్రవళిక.. ఇంతలో తులసికి షాక్
Intinti Gruhalakshmi 29 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 619 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య మొబైల్ లో అలారం పెట్టి తనను నిద్ర లేపుతారు. దీంతో ఎవరు నిద్రలేపారు నన్ను అని అనుకుంటుంది. ఉదయం లేచి చూడగానే.. అక్క ఒక చిట్టి ఉంటుంది. ఆ చిట్టి మీద టేబుల్ మీద ఫ్లాస్క్, ఫ్లాస్ లో పాలు ఉన్నాయి. నువ్వు తాగి.. నానమ్మ, తాతయ్యకు అందించు. నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి పేపర్ మీద రాసి ఉంటుంది. దీంతో దివ్య షాక్ అవుతుంది.

intinti gruhalakshmi 29 april 2022 full episode
మరోవైపు పరందామయ్య, అనసూయ.. ఇద్దరూ కాఫీ కోసం టెన్షన్ పడుతుంటారు. ఇంతలో గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ నానమ్మ అంటూ దివ్య వాళ్లకు పేపర్, కాఫీ పట్టుకొని వస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు అంటుంది. నువ్వు ఈ టైమ్ కు లేవడమే విచిత్రం అంటారు. మీ కోడలు పొద్దున్నే చెప్పాపెట్టకుండా షికారుకు వెళ్లింది అని చెబుతుంది దివ్య. అంటే.. కాఫీ నువ్వు చేశావా అంటే.. లేదు అమ్మ చేసి ఫ్లాస్క్ లో పోసింది అంటుంది. ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్లినట్టు అని అనుకుంటారు పరందామయ్య, అనసూయ.
కట్ చేస్తే ప్రవళికతో కలిసి తులసి వాకింగ్ కు వెళ్తుంది. వాకింగ్ చేస్తూ.. తన లైఫ్ గురించి చెబుతూ ఉంటుంది తులసి. ఏం చెప్పినా కూడా వాట్ నెక్స్ట్ అని అడుగుతూ ఉంటుంది ప్రవళిక. సరైన సమాధానం చెప్పు.. నీకు పనికొచ్చే సమాధానం చెప్పు అంటుంది ప్రవళిక.
భర్త, కాపురం, కొడుకు, కూతురు, అత్తామామలు.. బాధ్యతలు అవి తప్ప నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకున్నావు అని అడుగుతుంది ప్రవళిక. నా సంసారం.. నా బాధ్యత అదే నా గురించి కదా.. ఇంకా నా గురించి సపరేట్ గా ఆలోచించడానికి ఏముంది అని చెబుతుంది తులసి.
బాధ్యతలను మోయమంటే నీ గురించి నువ్వు ఆలోచించవద్దని కాదు.. నీ ఆశలను చంపుకోవద్దని కాదు. ఆడవాళ్లు కూడా ఇలా బతుకుదామని కలలు కంటారు. ఎందుకంటే.. వాళ్లకూ మనసు ఉంటుంది కాబట్టి. పెళ్లి అంటే బాధ్యతలను మోస్తూ మన జీవితాన్ని త్యాగం చేయడం కాదు అంటుంది ప్రవళిక.
చూశావా చీరతో వాకింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది. మార్పు ఇక్కడి నుంచే మొదలవ్వాలి. రేపటి నుంచి వాకింగ్ కు జాగింగ్ డ్రెస్ లో రా అంటుంది ప్రవళిక. నేను వేసుకుంటే అందరూ నవ్వుతారు అంటుంది తులసి. దీంతో నీకు నచ్చదని వేసుకోవా.. లేక ఎవరైనా నవ్వుతారని వేసుకోవా అంటుంది ప్రవళిక.
Intinti Gruhalakshmi 29 April Today Episode : గాయత్రి ముందే గొడవ పెట్టుకున్న అంకిత, అభి
ఈరోజు నువ్వు ఎలాంటి పనులు పెట్టుకోకు. మనం బయటికి వెళ్తున్నాం అంటుంది ప్రవళిక. దీంతో ఎక్కడికి అంటుంది తులసి. నువ్వు వస్తున్నావు అంతే అంటుంది ప్రవళిక. పదా.. ఇంటికి వెళ్దాం అంటుంది ప్రవళిక. మరోవైపు అంకిత టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో గాయత్రి వచ్చి.. అదేంటి ఒక్కదానివే తింటున్నావు. రెండు నిమిషాలు ఆగు.. అల్లుడు గారు కూడా వస్తున్నారు అంటుంది గాయత్రి.
దీంతో అంకితకు కోపం వస్తుంది. ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలాగే అంకిత బిహేవ్ చేస్తోంది అంటాడు అభి. వచ్చి కూర్చున్నా కూడా భర్తను పట్టించుకోవా. టిఫిన్ సర్వ్ చేయవా అంటుంది గాయత్రి. అయినా కూడా అంకిత ఏం మాట్లాడదు. దీంతో అభినే టిఫిన్ పెట్టుకుంటాడు.
గాయత్రి ముందే.. ఇద్దరూ తిట్టుకుంటారు. నీకు నచ్చినా నచ్చకపోయినా భర్త అడుగుజాడల్లో నడవాల్సిందే అంటుంది గాయత్రి. ఎందుకు ఉండాలి అంటుంది అంకిత. మరోవైపు శృతికి కళ్లు తిరుగుతాయి. ప్రేమ్ చూసి చాలా జ్వరంగా ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు ప్రేమ్.
ఈరోజు నువ్వు జాబ్ కు డుమ్మా. నీతో పాటు నేను కూడా డుమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఈరోజు వంట చేస్తాను అంటాడు ప్రేమ్. ప్రేమ్ వంట వండి తనకు తినిపిస్తాడు. మరోవైపు తులసి కోసం పరందామయ్య, అనసూయ, దివ్య ఎదురు చూస్తుంటారు.
ఏంటి నానమ్మా ఇది. మామ్ పొద్దున అనగా వెళ్లింది ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటుంది దివ్య. ఇంతలో అప్పుడే తులసి వస్తుంది. నాకోసమే ఎదురు చూస్తున్నారా అని అడుగుతుంది. కాఫీ తాగారా అంటుంది.
ముందు నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది అనసూయ. వాకింగ్ కు వెళ్లాను అంటుంది తులసి. నువ్వు వాకింగ్ కు వెళ్లావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
- Also Read
-
An exciting update about Mahesh Babu Sarkaru Vaari Paata
-
Mega Power Star Ram Charan Confirms Movie With Uncle Pawan Kalyan!