Intinti Gruhalakshmi 29 Aug Today Episode : భూమి పూజలో తులసిని అవమానించిన అభి.. సామ్రాట్ కు నందు గురించి తెలుస్తుందా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 29 Aug Today Episode : భూమి పూజలో తులసిని అవమానించిన అభి.. సామ్రాట్ కు నందు గురించి తెలుస్తుందా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

 Authored By gatla | The Telugu News | Updated on :29 August 2022,9:00 am

Intinti Gruhalakshmi 29 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 723 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లాస్య కావాలని భూమి పూజను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. అది జరగని పని అని పరందామయ్య అనసూయతో అంటాడు. మరోవైపు తులసి గారు, నేను పూజలో కూర్చొంటాం. మీరు గెస్టులను చూసుకోండి అని లాస్య, నందుకు చెబుతాడు సామ్రాట్. ఆ తర్వాత ప్రేమ్… సామ్రాట్ ను చూసి హత్తుకుంటాడు. మా అమ్మ కలను నెరవేర్చుతున్నారు అని అంటాడు. ఇన్ని రోజులు మా అమ్మ తన కోసం కాకుండా మా అందరి కోసం బతికింది. అయినా తనకు ఇప్పటి వరకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. మా అమ్మకు ఎవరూ ఇవ్వలేని గౌరవాన్ని మీరు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను. మీరు ఏమంటారో అని అనుకున్నాను. కానీ.. మీరు ఏమనుకున్నా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాను అంటాడు. నాకు నా జీవితంలో మా అమ్మ తర్వాతే ఎవరైనా అంటాడు ప్రేమ్.

intinti gruhalakshmi 29 august 2022 full episode

intinti gruhalakshmi 29 august 2022 full episode

అమ్మంటే ఎవరికైనా అంతే అంటాడు సామ్రాట్. ఏదో ఒక రోజు మా అమ్మ ఎంతో ఎత్తుకు ఎదగాలి. లోకమంతా మా అమ్మవైపు చూడాలి అని అనుకున్నాను. ఆ కలను మీరు నిజం చేశారు అంటాడు ప్రేమ్. ఎప్పటికీ ఇలాగే మా అమ్మకు సపోర్ట్ గా ఉంటానని మాటివ్వండి సార్ ప్లీజ్ అంటాడు ప్రేమ్. ఒకవేళ తను అలసిపోయి ఆగిపోయినా మీరు మాత్రం ఆగనివ్వకూడదు. మాటివ్వండి సార్.. ప్లీజ్ అంటాడు ప్రేమ్. దీంతో సరే అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత భూమి పూజ ప్రారంభం అవుతుంది. పంతులు గారు అన్నీ వచ్చినట్టే కదా అని అడుగుతుంది తులసి. అన్నీ వచ్చాయి అంటాడు పూజారి. మీరు వచ్చాకే పూజకు కల వచ్చింది అంటాడు పంతులు. ఇంతలో సామ్రాట్ వచ్చి పూజ మొదలు పెట్టడానికి ఇంకెంత టైమ్ పడుతుంది అంటాడు సామ్రాట్. దీంతో ఇంకో పావుగంట పడుతుంది అంటాడు పంతులు. దీంతో ఈలోగా మనం ప్రెస్ మీట్ పూర్తి చేద్దాం అంటాడు సామ్రాట్.

అయ్యో.. ప్రెస్ మీటా.. అదెందుకు అంటుంది. దీంతో నేను స్టార్ట్ చేసిన వెంచర్స్ లో ఇది 20వది. దీంతో మీడియా వాళ్లు ఇంటర్వ్యూ కావాలంటూ ఒకటే విసిగిస్తున్నారు అంటాడు సామ్రాట్. దీంతో అయ్యో.. నాకు అందరి ముందు మాట్లాడటం రాదు అంటుంది తులసి. ఏం కాదు వెళ్లండి.. అని అందరూ బతిమిలాడుతారు.

మరోవైపు ఈ తులసిని ఎందుకు ఇంతలా బతిమిలాడుతున్నాడు సామ్రాట్. నువ్వు ఏనాడైనా బతిమిలాడావా అంటూ నందుతో అంటుంది లాస్య. ఇంతలో అక్కడికి తులసి తమ్ముడు దీపక్ వస్తాడు. నమస్కారం మాజీ బావ గారు అంటాడు దీపక్. ఇంతలో తులసి అతడిని చూసి రా ఏమైంది.. ఎంత సేపు అయింది వచ్చి అని అడుగుతుంది. అమ్మ రాలేదా అని అడుగుతుంది.

Intinti Gruhalakshmi 29 Aug Today Episode : తన తమ్ముడు దీపక్ ను సామ్రాట్ కు పరిచయం చేసిన తులసి

రా.. సామ్రాట్ గారిని పరిచయం చేస్తాను అని తీసుకెళ్తుంది తులసి. మరోవైపు అభి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది లాస్య. సామ్రాట్ గారు అంటూ పరిచయం చేయబోతుండగా మీ తమ్ముడు దీపక్ అంటాడు. దీంతో మీకెలా తెలుసు అని అడుగుతుంది తులసి.

దీంతో మీ కళ్లలో ఆ వెలుగు చూసి చెప్పాను. మిమ్మల్ని చూడటం మొదటి సారే కానీ.. తులసి గారు మీ గురించి చాలా చెప్పారు అంటాడు సామ్రాట్. మీకు మీ అక్కంటే చాలా ఇష్టమట కదా అంటాడు సామ్రాట్. దీంతో ఇష్టమే సార్ కానీ ఏం చేయగలను.. ఒక మగాడి దాష్టికానికి బలయితే నేను ఏం చేయలేక చేతులు ముడ్చుకొని కూర్చొన్నాను అంటాడు దీపక్.

దీపక్ సంతోషంగా పూజ చేసుకోబోతున్నాం. ఇలాంటప్పుడు చేదు మెమోరీ ఎందుకు. వదిలేయ్ అంటుంది తులసి. నందు నిప్పుల మీద ఉన్నట్టున్నాడు. కంట్రోల్ చేయాలి. అభి వస్తే భాగుండు… అని అనుకుంటుంది లాస్య. చేదు గతాన్ని నువ్వు మరిచిపోయావేమో కానీ.. నేను మరిచిపోలేదు అక్క అంటాడు దీపక్.

దీంతో కొన్ని చేదు మెమోరీస్ ను అంత ఈజీగా మరిచిపోలేం. వాటిని మరిచిపోయినట్టు నటించాలి అంటాడు సామ్రాట్. అక్క జీవితం ఎడారిలా మారుతుంది చూస్తూ ఎలా ఊరుకోవాలి అంటాడు. చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అంటాడు సామ్రాట్. దీంతో ఎప్పటికప్పుడు మా అక్క నా కాళ్లకు సంకెళ్లు వేసేది. లేకపోతేనా అంటాడు దీపక్.

మీ బాధలో నిజాయితీ ఉంది దీపక్ గారు అంటాడు సామ్రాట్. మా అక్క ఎదుగుదలకు తమ్ముడుగా నేను ఏం చేయలేకపోయినా మీరు పెద్దమనసుతో అన్నీ చేస్తున్నారు. చాలా థాంక్స్ సార్ అంటాడు దీపక్. ఇందులో నేను చేసిందేం లేదు అంటాడు సామ్రాట్.

మరోవైపు మీడియా వాళ్లు వచ్చారు అని బాబాయి చెబుతాడు. దీంతో ప్రెస్ మీట్ కోసం వెళ్తారు తులసి, సామ్రాట్, బాబాయి. లాస్య, నందు కూడా అక్కడికి వెళ్తారు. ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ స్కూల్ అనేది ఒక బిజినెస్ కాదు.. మ్యూజిక్ ను అందరి జీవితాల్లో భాగం చేయాలని మొదలు పెట్టిన పవిత్ర కార్యం. ఇది నా ఆలోచన కాదు. ఒక మధ్యతరగతి మహిళ మనసులో నుంచి వచ్చిన అద్భుతమైన ఆలోచన అంటాడు సామ్రాట్.

తన బ్రెయిన్ చైల్డ్ తులసి వనం గురించి తులసి గారి మాటల్లోనే విందాం అంటాడు సామ్రాట్. దీంతో తులసి మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. కానీ.. నా విజయం వెనుక ఒక మగాడి ఉక్రోషం ఉంది.. అని తన పాత విషయాలను గుర్తు చేసుకుంటుంది.

ఒకప్పుడు నంద గోపాల్ కు బెస్ట్ ఎంప్లాయి అవార్డు వచ్చినందుకు మీడియా వాళ్లు ఇంటర్వ్యూ చేయగా అప్పుడు నంద గోపాల్.. తన విజయం వెనుక ఆడది ఉంది కానీ.. ఆ ఆడది తులసి కాదు.. లాస్య అని చెబుతాడు నందు. దీంతో తులసి చాలా బాధపడుతుంది.

నా భార్యకు వంటిల్లే లోకం. తను ఒక ఆదర్శ గృహిణి. తనకు నా వెనుక ఉండి ఎంకరేజ్ చేసేంత చదువు లేదు. అడిగినప్పుడు కమ్మగా కాఫీ పెట్టివ్వడమే తనకు తెలుసు అంటాడు నందు. వండిపెట్టడం తప్ప తనకు ఇంకేం తెలియదు.. అంటాడు నందు. లాస్యను వచ్చి తన పక్కన కూర్చోమంటాడు నందు. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది