Intinti Gruhalakshmi 29 Nov Today Episode : ఇంట్లో స్పృహ తప్పి పడిపోయిన అనసూయ.. తులసి చేతుల్లోనే అనసూయ ప్రాణాలు విడుస్తుందా? పరందామయ్యకు షాక్
Intinti Gruhalakshmi 29 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 802 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ ఎమోషన్స్ తో ఆడుకున్నా. నిన్ను మోసం చేసి ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకున్నా అని చెబుతుంది లాస్య. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. నువ్వు చీట్ అంటాడు అభి. దీంతో ఎవరు చీట్ కాదు. అందరూ చీటర్సే ఇక్కడ అంటుంది లాస్య. దాని కన్నా ముష్టి అడిగితే ఇచ్చేదాన్ని కదా అంటుంది తులసి. ఈ ఇల్లు ఇప్పుడు నా పేరు మీద ఉన్నా మీరు ఈ ఇంట్లో ఇదివరకులా ఉండొచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉండదు.. అంటుంది లాస్య.
కానీ.. ఎవ్వరూ మాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అంటారు. నందుకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లకండి. అందరూ ఇంట్లో ఉండండి.. అంటాడు నందు. పరందామయ్య దగ్గరికి వెళ్లి నాన్న.. ప్లీజ్ మీరంతా నాతోనే ఉండండి. నాన్న దయచేసి నాతో ఉండండి అని బతిమిలాడుతాడు నందు. దీంతో మామయ్య ఇంత జరిగాక కూడా మీ అబ్బాయి తన వాళ్లను వదిలి ఉండాలని అనుకోవడం లేదు. అందరూ కలిసి ఉండాలని ఆయన ఆరాటపడుతుంటే అందరూ సపోర్ట్ చేయండి అంటుంది తులసి. లాస్య తప్పులకు మీ నాన్నను శిక్షించకండి అంటుంది తులసి. మీ అందరికీ తెలుసు. మీ నాన్నకు మీరంటే ప్రాణం. ఇంతకుముందు అయితే ఇల్లు ముక్కలు అయ్యేది. ఇప్పుడు మీరు కాదంటే మీ అబ్బాయి గుండె ముక్కలు అవుతుంది అంటుంది తులసి.
దీంతో ప్లీజ్ నాన్న. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటాను అంటాడు. దీంతో అందరూ ఇంట్లోకి వెళ్తారు కానీ.. పరందామయ్య, అనసూయ మాత్రం ఇంటి బయటే ఉంటారు. దీంతో తులసి, నందు ఇద్దరూ పరందామయ్యకు చేతులెత్తి మొక్కుతారు. దీంతో పరందామయ్య, అనసూయ కూడా ఇంట్లోకి వెళ్తారు.
నా ఫ్యామిలీని సంతోషంగా ఉంచు అని దేవుడిని మొక్కుకొని తులసి బయటికి వచ్చేస్తుంది. తర్వాత కారులో సామ్రాట్, తులసి ఇద్దరూ వెళ్తుంటారు. తులసి గారు బాధపడకండి అంటాడు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అంతే. నేను జుట్టుపీక్కునేవాడిని. ఇరిటేషన్ పెరిగింది తప్ప ఏం చేయలేకపోయాను అంటాడు.
Intinti Gruhalakshmi 29 Nov Today Episode : సరదాగా ముచ్చట్లు పెట్టుకున్న సామ్రాట్, తులసి
మీరు ఇంకా లక్కీ. అందరూ కలిసిపోయారు. నందుకు థాంక్స్ చెప్పాలి. అందుకు ఆయనే కారణం. పేరెంట్స్ కోసం చాలా తగ్గాడు. కాంప్రమైజ్ అయ్యాడు. మనిషి మారినట్టే కదా. పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అంటాడు సామ్రాట్.
ఇక ముందు ఏమౌతుందో అని దిగులు అంటుంది తులసి. మీ ఫ్యామిలీ అంతా కలిసిపోయారు కదా. అంతా బాగుంది కదా అంటాడు సామ్రాట్. లాస్య ఏం చేస్తుందో అని భయపడుతుంది తులసి.
ఇంతకుముందులా ఆయన గుడ్డిగా లాస్య వైపు లేరు. ఎవరు ఏంటో.. క్లారిటీతో ఉన్నారు.. అంటుంది తులసి. దీంతో ఇక మీ గురించి మీరు ఆలోచించుకోండి అంటాడు సామ్రాట్. మీ ఎదుగుదలను నేను దత్తత తీసుకున్నా అంటాడు సామ్రాట్.
ఎంతైనా నావల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే మీకు సారీ చెబుతా అంటుంది తులసి. దీంతో ఇంతలో కారు ఆగిపోతుంది. ఏమైంది అని అడుగుతుంది. దీంతో మీరు సారీ చెప్పడం నాకే కాదు.. ఈ కారుకు కూడా ఇష్టం లేదు అంటాడు. కారు ఆగిపోయింది అంటాడు.
కిందికి దిగి ఈ కారు ఇప్పుడు నడవదు. మెకానిక్ రావాల్సిందే అంటాడు సామ్రాట్. తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. మధ్యలో ఒక టీ స్టాల్ వద్ద మాటరాని మౌనమిది అనే పాట వస్తుండగా వింటూ ఉంటారు సామ్రాట్, తులసి.
ఇద్దరూ ఇలయారాజా పాటల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ ఇలయరాజా ఫ్యాన్స్ కావడంతో పాటల పోటీలు పెట్టుకుంటారు. ఆ తర్వాత నాకు ఐస్ క్రీమ్ కావాలి.. అంటుంది. దీంతో ఈ బండి మీద వద్దు అంటాడు సామ్రాట్.
మరోవైపు అనసూయ ఇంట్లో కళ్లు తిరిగి కింద పడిపోతుంది. తనను చూడటానికి తులసి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.