Intinti Gruhalakshmi 3 Dec Today Episode : లాస్యకు చుక్కలు చూపించిన అంకిత, శృతి.. తులసి, సామ్రాట్ ఇద్దరూ షాపింగ్ కు.. అందరూ వాళ్లను చూసి తప్పుగా అనుకుంటారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 3 Dec Today Episode : లాస్యకు చుక్కలు చూపించిన అంకిత, శృతి.. తులసి, సామ్రాట్ ఇద్దరూ షాపింగ్ కు.. అందరూ వాళ్లను చూసి తప్పుగా అనుకుంటారా?

Intinti Gruhalakshmi 3 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 806 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బరువు మోయడానికి బలం ఉండాలి.. లెక్కలు రాయడానికి తెలివి ఉండాలి. అలాగే.. కుటుంబ బాధ్యత మోయడానికి ఫారెన్ చదువు అవసరం లేదు. లోక జ్ఞానం ఉంటే చాలు అంటుంది తులసి. కానీ.. మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీకు వచ్చే జీతంతో […]

 Authored By gatla | The Telugu News | Updated on :3 December 2022,9:30 am

Intinti Gruhalakshmi 3 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 806 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బరువు మోయడానికి బలం ఉండాలి.. లెక్కలు రాయడానికి తెలివి ఉండాలి. అలాగే.. కుటుంబ బాధ్యత మోయడానికి ఫారెన్ చదువు అవసరం లేదు. లోక జ్ఞానం ఉంటే చాలు అంటుంది తులసి. కానీ.. మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీకు వచ్చే జీతంతో ఖర్చులను పోల్చితే నెలకు ఐదారు వేల కంటే ఎక్కువ మిగలదు అంటే.. తులసి లెక్కలు వేసి నెలకు 20 వేలు మిగులుతాయి అంటుంది తులసి. దీంతో ఇందులో పనిమనిషి జీతం ఏది.. ఎంటర్ టైన్ మెంట్ ఖర్చులు ఏవి.. బట్టల ఖర్చులు ఏవి అని అడుగుతాడు సామ్రాట్. దీంతో తప్పదు సామ్రాట్ గారు.. డబ్బులు ఆదా చేయాలంటే ఆది ఆడది మాత్రమే చేయగలుగుతుంది.

intinti gruhalakshmi 3 december 2022 full episode

intinti gruhalakshmi 3 december 2022 full episode

ఖర్చులకు తగ్గట్టుగా మగాడు సంపాదించలేకపోవచ్చు కానీ.. ఆదాయానికి తగ్గట్టుగా ఆడది కుటుంబాన్ని మోయగలదు అంటుంది తులసి. వావ్.. ఒప్పుకుంటాను తులసి గారు అంటాడు సామ్రాట్. అవును.. ఆదా డబ్బుతో ఏం చేస్తారు అని అడుగుతాడు. దీంతో నా పిల్లల ఖర్చుల కోసం ఉపయోగిస్తా అంటుంది తులసి. దీంతో వాళ్లు తమ తండ్రి దగ్గరే ఉన్నారు కదా అంటాడు సామ్రాట్. అవును కానీ.. ఆయనకు ప్రస్తుతం జాబ్ లేదు కదా అంటుంది తులసి. ఆయన్నే వద్దనుకొని వదిలేసినప్పుడు ఆయన ఇచ్చే భరణంతో బతకడంలో అర్థం లేదు. దేవుడు సంపాదించుకునే శక్తి ఇచ్చాడు.. మార్గం కూడా చూపించాడు. ఇది నాకు చాలు అంటుంది తులసి. దీంతో మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు అంటాడు సామ్రాట్. ఆ తర్వాత నేను షాపింగ్ నకు వెళ్లాలి అంటుంది తులసి. నేను కూడా వస్తా అంటాడు సామ్రాట్.

దీంతో నేను బస్సులో వెళ్తాను అంటుంది తులసి. నాకేం అభ్యంతరం లేదు. మిడిల్ క్లాస్ అబ్బాయిలా నేను ఎప్పుడో మారిపోయాను అంటాడు సామ్రాట్. దీంతో మిడిల్ క్లాస్ అబ్బాయిలా కాదు. అంకుల్ లా అంటుంది తులసి.

కట్ చేస్తే.. శృతి, అంకిత ఇద్దరూ కలిసి వంట వండుతూ ఉంటారు. ఇంతలో లాస్య వస్తుంది. తను రాగానే ఈ ఇంట్లో నువ్వు చూడని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే.. అంటుంది శృతి. దీంతో తెలియక వచ్చి ఉంటుందేమో అంటుంది అంకిత.

దీంతో మీ బెడ్ రూమ్ పైన ఉంది అంటారు. అంత వెటకారం వద్దు అంటుంది లాస్య. అయినా వంటింట్లోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అంకిత. దీంతో ఈ పూట అందరికీ నేనే వంట చేసి పెడతాను అంటుంది లాస్య. దీంతో సంతోషంగా చేసుకో. మాకేం అభ్యంతరం లేదు అంటారు.

Intinti Gruhalakshmi 3 Dec Today Episode : పరందామయ్యను చూడటానికి వచ్చిన భాగ్య

ఇంతలో భాగ్య అక్కడికి వస్తుంది. వాళ్ల మాటలను వింటుంది. వంట అంటే మామూలు కాదు. ఈ ఇంట్లో మనిషికి ఒక వంట వండాలి అని ఎవరికి ఎలా వండాలో చెబుతారు ఇద్దరూ. ఇది ఇల్లా లేక రెస్టారెంటా.. ఉన్న నలుగురికి 40 రకాల వంటలా నావల్ల కాదు అంటుంది లాస్య.

నాకు ఎలా ఇష్టమో అలా వండుతా. అందరూ అలా తినాల్సిందే అంటుంది లాస్య. కావాలనే ఇంట్లో వాళ్లంతా చేరి లాస్యను ఆటపట్టిస్తున్నారు అని అనుకుంటుంది భాగ్య. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది. ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అని అనుకుంటుంది.

ఇలా అయితే నాకు వంటింటితో సంబంధం లేదు. మీ పాట్లు మీరు పడండి అంటుంది లాస్య. ఇంతలో అక్కడికి వెళ్లిన భాగ్య.. తులసి అక్కకు ఓపిక ఎక్కువ. పాపం లాస్యకు అలాంటి ఆరాటం లేదు అంటుంది భాగ్య. దీంతో బాగా చెప్పావు భాగ్య అంటుంది లాస్య.

అయినా ఈ ఇంట్లో చేయడానికి బోలెడు పనులు ఉన్నాయి. వంటింటి పనులు మీరు చూసుకోండి. మిగితావి నేను చూసుకుంటా అంటుంది లాస్య. మరోవైపు సామ్రాట్, తులసి ఇద్దరూ కలసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు.

ఈ రోజు ఎండ ఎక్కువగా ఉన్నట్టుంది అంటాడు సామ్రాట్. దీంతో మీరే ఈరోజు ఏసీ కారు వదిలి ఎండలోకి వచ్చారు అంటుంది తులసి. మధ్య తరగతి మనస్తత్వం ఒకటి ఉంటుంది. అది స్వతహాగా ఉండాలి అంటుంది తులసి.

ఇంతలో బస్సు వస్తుంది. అందరూ ఎక్కిపోతారు. కానీ.. సామ్రాట్ ఎక్కడు. వామ్మో.. ఏంటి పరుగులు అంటాడు సామ్రాట్. బస్సు ఆగిందే ఆలస్యం.. ఎక్కిపోవాలి అంటుంది తులసి. దీంతో సరే.. నేను ఎక్కుతా అంటాడు.

ఇంకో బస్సు వచ్చినా ఎక్కడు. ఈ బస్సు ఎక్కడం నావల్ల కాదు అంటాడు సామ్రాట్. మీరు క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్లండి అంటుంది తులసి. దీంతో లేదు లేదు నేను వస్తాను. ఈసారి చూడండి అంటాడు సామ్రాట్.

తర్వాత చివరకు బస్సు ఎలాగోలా ఎక్కుతాడు  సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది