Intinti Gruhalakshmi 3 Nov Today Episode : ఎట్టకేలకు తులసి మాటలకు ఒప్పుకున్న నందూ.. తల్లి కోసం ఆ బాధ్యత తీసుకున్న ప్రేమ్..
Intinti Gruhalakshmi 3 Nov Today Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’. రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతూ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం.మంగళవారం ఎపిసోడ్‌లో జీకే దగ్గరకు వెళ్లిన నందూను ఆయన అవమానిస్తాడు. తులసి కాళ్లు పట్టుకోవాలని అంటాడు. అనంతరం తులసి వల్ల ఇళ్లు ముక్కలైపోతుందని లాస్య భయపెట్టేలా మాట్లాడుతుంది. ఇంతలోనే తులసి ఎంట్రీ ఇచ్చి ధీటుగా మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే దివ్యపై నందూ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత వచ్చి కూతురికి సారీ చెప్తాడు నందూ.
ఇకపోతే తులసికి నందూ తన ఇంటికి వచ్చిన విషయాన్ని జీకే ఫోన్‌లో చెప్తాడు. ఆ సమయంలో నందూ పట్ల తాను వ్యవహరించిన తీరును జీకే వివరిస్తాడు. ఆ తర్వాత డబ్బు విషయంలో ఎంకరేజ్ చేయకండని తులసి జీకేకు చెప్తుంది. దానికి సరేనని అంటూనే జీకే.. ‘నీకు ఏదైనా సహాయం కావాలంటే అడుగు అమ్మా.. నీ ఆత్మగౌరవం గురించి నాకు తెలుసు కానీ, అన్నయ్యగా నీకు ఈ మాట చెప్తున్నాను ఏదేని సాయం కావాలంటే అడుగమ్మా’ అని అంటాడు జీకే. ఆ మాటలకు పొంగిపోతుంది తులసి. కన్నీటి పర్యంతమై అన్నయ్యగా జీకే చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది.
మరో వైపున ఆ సమయంలో పరంధామయ్య అక్కడకు వస్తాడు. తులసి ఏదో బాధలో ఉందన్న సంగతి గ్రహించి ఏమైందమ్మా.. నీలో నువ్వే బాధపడుతున్నవేంటని ప్రశ్నిస్తాడు పరంధామయ్య. అప్పుడు ఆమె జీకేతో జరిపిన సంభాషణల గురించి వివరిస్తుంది. ఈ క్రమంలోనే పరంధామయ్య నందూపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు వాడికి సిగ్గుందా? అని అంటూ ఫైర్ అవుతాడు. మళ్లీ ముఖం పెట్టుకుని జీకే వద్దకు ఎలా వెళ్లాడని అడుగుతాడు. అలా పరంధామయ్య మాట్లాడుతుండగానే తులసి కలగజేసుకుంటుంది. ఆయన్ను తిట్టకండి మామామయ్య అవసరాల కోసం ఆయన అలా ప్రవర్తిస్తున్నారన్నట్లుగా మాట్లాడుతుంది తులసి.
ఇక ఈ విషయాల గురించి తెలుసుకుని అంకిత రూమ్‌లోకి వస్తుంది. అప్పుడు అస్సలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అరిచేస్తుంటుంది. అంతలోనే అభి స్పందించి మామ్ కరెక్టుగా చేస్తోందంటూ జీకే దగ్గర డబ్బులు తీసుకున్నంత మాత్రాన సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకుతుందా అని మాట్లాడి కామ్‌గా ఉంటాడు. సీన్ కట్ చేస్తే.. లాస్య , నందూ విడాకుల విషయమై మాట్లాడుకుంటుండగా మధ్యలో తులసి వస్తుంది. ప్రాజెక్టు స్టేటస్ ఏంటని అడుగుతుంది. క్లైంట్స్ ఫోన్ చేస్తున్నారని, అడుగుతుంది. అప్పుడు నందూ అసలు నాకు ప్రాజెక్టుతో సంబంధం లేదని అంటాడు. అప్పుడు తులసి మీరు కేవలం నాకు మాత్రమే విడాకులు ఇచ్చారు. ప్రాజెక్టుకు కాదని చెప్తుంది. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకు పూర్తి చేయకపోతే జరిగే నష్టం మీకే అని అంటుంది తులసి.
అలా ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో తల్లి కోసం ప్రాజెక్టు తాను తీసుకుంటానని ప్రేమ్ ఒప్పుకుంటాడు. శశికళ దగ్గర చేసిన అప్పును తీర్చేయాలని తాను అనుకుంటున్నట్లు శ్రుతికి ప్రేమ్ చెప్తాడు. అలా ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్న క్రమంలో అమ్మా నాన్న ఒకే ఇంట్లో ఉంటారు. అలా వారు విడిపోయినప్పటికీ కలిసి ఉండేలా విధి రాతరాశాడని, మన కోసం అమ్మ ఎంతో కష్టపడుతుందని ప్రేమ్ శ్రుతికి వివరిస్తాడు. అయితే, ప్రేమ్ చెప్పిన మాటలన్ని విన్న శ్రుతి ఆయనకు సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ్, శ్రుతి ఇద్దరూ కాసేపు ముచ్చటించుకుంటారు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ప్రాజెక్టు స్టేటస్, నందూ ప్రాజెక్టు గురించి ఏం అనుకుంటున్నాడనేది తెలుస్తుంది.