Intinti Gruhalakshmi 3 Oct Today Episode : నందుకు జనరల్ మేనేజర్ పదవి ఇచ్చి.. తులసిని ఉద్యోగంలో నుంచి పీకేసిన సామ్రాట్.. ఇంతలో సామ్రాట్ కు షాక్
Intinti Gruhalakshmi 3 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 753 హైలైట్సై ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయ.. తులసి రాగానే ఏమైందో అనుకుంటుంది. సైలెంట్ గా ఉంది. ఏం మాట్లాడటం లేదేంటి అని అనుకుంటుంది. ఇంతలో అభి.. అనసూయ దగ్గరికి వచ్చి ఏమైంది నానమ్మ.. అమ్మ విషయంలో ఏం చేశావు అని అడుగుతాడు. దీంతో ఎందుకు అంత తొందర నేను చూసుకుంటా కదా అంటుంది అనసూయ. ఇంతలో తులసి వచ్చి తనకు పాలు ఇస్తుంది. దీంతో రేపు ఆఫీసు ఉందా తులసి అని అడుగుతుంది అనసూయ. దీంతో ఉంది అత్తయ్య.. పని ఎక్కువైంది అని అంటుంది. దీంతో ఆ సామ్రాట్ కు మరోసారి గట్టిగా చెప్పాలి అని అనుకుంటుంది అనసూయ.
కట్ చేస్తే సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు బాబాయి. దీంతో ఏం లేదు అంటాడు సామ్రాట్. తులసితో లంచ్ చేద్దామని చెప్పి నిన్న ఫోన్ చేస్తే విసుక్కున్నావట ఎందుకు అని అడుగుతాడు బాబాయి. దీంతో సామ్రాట్ కు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. తనను కసురుకొని కాల్ కట్ చేశావట అంటాడు బాబాయి. దీంతో కంప్లయింట్ చేసిందా అని అడుగుతాడు సామ్రాట్. చూడు బాబాయి.. మనిషి అన్నాక, మనసు అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండటం కుదరదు. మూడ్ బాగలేకపోతే చిరాకు పడి ఉంటాను. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు అని అంటాడు సామ్రాట్.
కట్ చేస్తే ఆఫీసులో బిజీగా ఫైల్స్ చూస్తుంటుంది తులసి. ఝాన్సీ తనకు ఫైల్స్ వివరిస్తూ ఉంటుంది. లాస్య వాళ్లను చూసి ఈవిడ గారు ఫైల్స్ మీద సంతకం పెట్టడం కోసం ఇంకొకరు ఈమెకు విడమరిచి చెప్పాలా అని అనుకుంటుంది లాస్య.
ఆ తర్వాత ఒకటి ఓల్డ్ ఫైల్ మేడమ్. దీని మీద సంతకం పెట్టండి అంటుంది ఝాన్సీ. దీంతో సరే అని సంతకం పెడుతుంది తులసి. ఇక్కడ కూడా చేయండి అంటుంది ఝాన్సీ. పక్కనుండి నువ్వు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నా పని తేలికగా అవుతోంది ఝాన్సీ అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 3 Oct Today Episode : నీ వల్ల కంపెనీకి 10 కోట్ల లాస్ అయ్యేవి అని చెప్పిన నందు
కట్ చేస్తే సామ్రాట్ అక్కడికి వస్తాడు. బయటి నుంచి తులసి సంతకాలు పెట్టడం చూస్తాడు. తనను చూసి నిలబడుతుంది తులసి. కానీ.. తనను పట్టించుకోకుండానే వెళ్లిపోతాడు సామ్రాట్. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు.
మరోవైపు ఉద్యోగులు మొత్తం మీరు వచ్చాక మాకు ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం వచ్చింది అని ఉద్యోగులు అంటారు. ఇంతలో నందు వచ్చి నీ వల్ల కంపెనీకి లాస్ అంటూ ఆ ఫైల్ మీద సంతకం పెట్టి కంప్లయింట్ ఉన్న ఫైల్ మీద సంతకం చేసి బకాయిలుగా ఉన్న 10 కోట్లను రిలీజ్ చేయాలంటూ సంతకం పెట్టింది అంటాడు నందు.
మన రంగనాథ్ దగ్గర ఫైల్ చూసి అనుమానం వచ్చి చూశాను. లేకపోతే కంపెనీకి 10 కోట్ల నష్టం వచ్చి ఉండేది అంటాడు నందు. ఇంతలో అక్కడికి వచ్చిన సామ్రాట్.. థాంక్స్ నంద గోపాల్ గారు అంటాడు సామ్రాట్.
తప్పు ఎందుకు జరిగిందో తులసిని కూడా ఒక మాట అడిగి తెలుసుకోవాలి కదా అంటాడు బాబాయి. దీంతో హంతకుడు కూడా తన తప్పును సమర్థించుకుంటాడు. అంత మాత్రం చేత తప్పు తప్పు కాకుండా పోతుందా అంటాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే బాబాయి అంటాడు సామ్రాట్.
తను తప్పు చేయలేదని తులసి గారు చెబితే అప్పుడు డిస్కస్ చేద్దాం అంటాడు సామ్రాట్. నేను వెరిఫై చేయని ఫైల్ మీదగ్గరికి ఎలా వచ్చింది. ఎలా సైన్ చేశారు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో తులసికి ఏం అర్థం కాదు.
ఝాన్సీ మీద కంప్లయింట్ చేస్తే అనవసరంగా తన జాబ్ పోతుంది అని అనుకుంటుంది. దీంతో తప్పు నాదే.. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను అని అంటుంది తులసి. దీంతో లాస్య రెచ్చిపోతుంది. ఈ కంపెనీ కిరాణ షాప్ కాదు.. ఒక్క తప్పుకు మూల్యం కోట్లలో ఉంటుంది అంటుంది లాస్య.
ఆ తర్వాత ఝాన్సీని కలిసి ఎందుకు అక్కడ ఆ ఫైల్ పెట్టావు అని నిలదీస్తుంది తులసి. నీ ఉద్యోగానికి ఏం కాదు. ఎవరు నీతో ఈ పని చేయించారు అని అడుగుతుంది తులసి. నువ్వే చెప్పావా ఎవరైనా చెప్పించారా అని అడుగుతుంది తులసి.
ఈవెనింగ్ పార్టీలో నందును తులసి ప్లేస్ లో జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నానని సామ్రాట్ అందరి ముందు ప్రకటించడంతో తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.