Intinti Gruhalakshmi 5 Oct Today Episode : శృతి మనసులో మాటను ప్రేమ్ తో చెప్పేలా చేయడానికి ప్రేమ్, తులసి, రాములమ్మ ప్లాన్.. అది వర్కవుట్ అవుతుందా? బెడిసికొడుతుందా? శృతి.. ప్రేమ్ కు తన ప్రేమ విషయం చెబుతుందా?

intinti gruhalakshmi 5 october 2021 full episode
Intinti Gruhalakshmi 5 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 5 అక్టోబర్, 2021 తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 442 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శృతి.. ప్రేమ్ ను లవ్ చేస్తూ.. ఎందుకు తన ప్రేమను త్యాగం చేసింది అని తులసి తెగ ఆలోచిస్తుంటుంది. అసలు.. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.
రాములమ్మ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుంది. శృతి మనసులో ప్రేమ్ ఉన్నాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు నువ్వు రాములమ్మ అని అడుగుతుంది తులసి. ఎదుటి మనిషితో ఉన్న చనువును బట్టి వాళ్లు ఎలా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది అని చెబుతుంది రాములమ్మ. వాళ్లిద్దరి మధ్య ఉన్న చనువు చూస్తే ఎవ్వరైనా అలాగే అనుకుంటారు. ప్రేమ్ అంటే శృతికి చాలా ఇష్టం.. అని చెబుతుంది రాములమ్మ.

intinti gruhalakshmi 5 october 2021 full episode
అంటే.. శృతి ఇప్పుడు ప్రేమ్ మీద ప్రేమ లేనట్టు నటిస్తుందన్నమాట. ఎందుకై ఉంటుంది అని అంటుంది తులసి. తనకంటే మంచి అమ్మాయి ప్రేమ్ కు రావాలని అనుకుంటుందేమో.. అందుకే కావాలని దూరం చేసుకుంటుంది కావచ్చు అని అంటుంది రాములమ్మ. దాని కోసం శృతి లోపల ఉన్న ప్రేమను మనం బయటపెట్టాలి.. అని మనం చేయాలి అని రాములమ్మకు చెబుతుంది తులసి.
ప్రేమ్ ఇంకా తన ఎంగేజ్ మెంట్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడికి అక్షర వస్తుంది. హాయ్ ప్రేమ్.. ఏంటి.. దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? అని అడుగుతుంది. ఇందులో మనం ఆలోచించడానికి ఏం ఉంటుంది. పెద్ద వాళ్లు ఉన్నారు కదా.. వాళ్లే చూసుకుంటారు అని చెబుతుంది.
Intinti Gruhalakshmi 5 Oct Today Episode : అక్షరతో ప్రేమ్ సరిగ్గా మాట్లాడకపోయేసరికి అలిగిన అక్షర
ఎవరికైనా పెళ్లి తమ జీవితంలో ముఖ్యమే కదా.. అంటుంది అక్షర. నాకు ప్రస్తుతం బాగా తలనొప్పిగా ఉంది. నేను నీతో తర్వాత మాట్లాడుతా అని అంటాడు ప్రేమ్. దీంతో నీకు నిజంగా తలనొప్పి ఉంటే పర్లేదు కానీ.. నేను నీకు తలనొప్పి కాకూడదు అంటుంది అక్షర.

intinti gruhalakshmi 5 october 2021 full episode
ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. తనను ఇంకా ఎన్ని రోజులు దూరం పెడతావు.. అని అడుగుతుంది తులసి. శృతి తనను ఇంకా లవ్ చేస్తోందని.. మేం చెప్పినట్టు చేయి.. శృతి నిన్ను ప్రేమిస్తుందని చెబుతారు తులసి, రాములమ్మ. తన నోట్లో నుంచి ప్రేమిస్తుందని చెప్పేలా చేద్దాం అని అంటారు.
తెల్లారగానే అక్షర త్వరగా రా.. నీకు డ్రెస్ కావాలన్నావు కదా.. ఇదుగో తీసుకొచ్చాను అని అంటాడు ప్రేమ్. వావ్.. ప్రేమ్ నువ్వు నాకోసం డ్రెస్ తీసుకొచ్చావా.. సుపర్ బాగుంది అని అంటుంది. అవును అక్షర నీకోసమే తీసుకొచ్చాను అంటుంది. అక్కడే ఉన్న శృతి.. చూసి షాక్ అవుతుంది.

intinti gruhalakshmi 5 october 2021 full episode
ఇన్ డైరెక్ట్ గా శృతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు ప్రేమ్. శృతి కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇవన్నీ చూసిన లాస్య.. అసలు ఏం జరుగుతోందో అర్థం కాదు. శృతిని చూసి తులసి.. ఏంటి శృతి.. నువ్వు ఊహించని మార్పులు జరుగుతున్నాయి కదా అంటుంది. అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శృతి. తులసి, రాములమ్మ.. శృతి వెక్కి వెక్కి ఏడవడం చూస్తుంటారు. ఆ తర్వత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.