Intinti Gruhalakshmi 6 Dec Episode Highlights : లాస్యకు నందు భారీ షాక్.. తులసినే పెళ్లి చేసుకుంటా అని తెగేసి చెప్పేశాడా? లాస్య పరిస్థితి ఏంటి మరి
Intinti Gruhalakshmi 6 Dec Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం మాత్రమే ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 6 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 495 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి గర్భాశయంలో క్యాన్సర్ అని అద్వైత కృష్ణ.. నందుతో చెబుతుండగా ప్రేమ్ విని షాక్ అవుతాడు. తట్టుకోలేడు. అమ్మకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి వెళ్లబోతుండగా.. నందు ప్రేమ్ ను ఆపుతాడు. వద్దురా.. ఈ విషయం ఎవ్వరికీ తెలియనీయకు. ముఖ్యంగా తులసికి ఈ విషయం తెలియకూడదు అంటాడు. కానీ.. అమ్మకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే నాన్న అంటాడు ప్రేమ్.
దీంతో నందు తీవ్రంగా బాధపడిపోతాడు. అవును.. గత పాతికేళ్ల నుంచి తులసి ఏనాడూ సంతోషంగా ఉన్న రోజు లేదు. పాతికేళ్ల నుంచి తులసి ఎన్నో కష్టాలను చూసింది. చివరకు నేను కూడా తులసిని పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా తులసిని సంతోషంగా ఉంచుతా.. అని అంటాడు నందు. ఇన్ని కష్టాలు పడ్డ తులసికే మళ్లీ అనారోగ్యం రావాలా అని తెగ టెన్షన్ పడతాడు నందు. వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇక నుంచి తులసికి సంతోషాన్నే అందిద్దాం. తులసి కోసం ఇక నుంచి నేను ఏదైనా చేస్తాను.. అని ప్రేమ్ కు మాటిస్తాడు నందు. దీంతో ప్రేమ్ కూడా సంతోషిస్తాడు. వెంటనే తులసి రిపోర్టులు తీసుకొని బయలుదేరుతాడు.
కాకపోతే ఆ రిపోర్టులను మార్చుతాడు. అందులో అన్నీ ఫన్నీ ఎమోజీలను పెట్టి తీసుకెళ్తాడు. మరోవైపు రిపోర్టుల కోసం వెళ్లిన ప్రేమ్ ఇంకా రాలేదేంటని టెన్షన్ పడుతుంది తులసి. ఇంతలో రిపోర్టులు పట్టుకొని వస్తాడు ప్రేమ్. ఏమైందిరా.. రిపోర్టుల్లో ఏముంది అని అడుగుతుంది తులసి.
నువ్వే చూడమ్మా అని రిపోర్టులు తులసికి ఇస్తాడు ప్రేమ్. అందులో అన్నీ ఫన్నీ ఎమోజీలు ఉండటంతో ఏమైందో చెప్పరా.. అంటుంది తులసి. నీకు ఏ సమస్యా లేదు అని రిపోర్ట్ లో తేలింది అమ్మ అంటాడు ప్రేమ్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అందరూ సంతోషంలో మునిగితేలుతారు.
Intinti Gruhalakshmi 6 Dec Episode Highlights : తులసిని స్పెషల్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేసిన ప్రేమ్
ఆతర్వాత తులసిని ప్రేమ్.. తన కోసమే రెంట్ కు తీసుకున్న కాటేజీకి తీసుకెళ్తాడు. ఇక్కడే నువ్వు నీకు నచ్చినన్ని రోజులు సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు. అందరూ వచ్చి.. ఇది నీ ఇల్లు అంటారు. అందరూ సంతోషంగా అక్కడ గడుపుతారు. దీంతో తులసి తెగ సంతోషిస్తుంది.
మరోవైపు నందు, తులసి ఇద్దరూ సరదాగా కాసేపు గడుపుతారు. అందరూ సంతోషంగా ఉండటం చూసి లాస్య తట్టుకోలేకపోతుంది. అందరూ ఒక్కటయ్యారు. నన్ను ఒంటరిని చేశారు అని అనుకుంటుంది లాస్య. ఎలాగైనా నందును నిలదీయాలని అనుకుంటుంది.
దీంతో వెంటనే నందును నిలదీస్తుంది. తులసి అనారోగ్యాన్ని సాకుగా చూపించి తనతో ఉందామనుకుంటున్నావా? అని నందును నిలదీస్తుంది లాస్య. తులసి ఆరోగ్యం ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. వెంటనే నేను లాస్యను పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు డిక్లేర్ చేయమంటావా? అని అంటాడు నందు.
మన పెళ్లి జరగకుండా ఉండటానికి నీకు అడ్డొస్తున్న కారణాలు ఏంటో నాకు అర్థం కావడం లేదు నందు అంటుంది లాస్య. తులసి నాకు పరాయిది కాదు. నేను తాళి కట్టిన భార్య అంటాడు నందు. ఇప్పటి వరకు చాలాసార్లు కష్టాల్లో తులసిని వదిలేసి వెళ్లిపోయాను. ఇప్పుడు అలా చేయదలుచుకోలేదు.. అంటాడు. జరిగిన దాని గురించి కాదు.. జరగబోయేదాని గురించి ఆలోచించు. మన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది.. అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.