Intinti Gruhalakshmi 6 Oct Today Episode : తన ప్రేమ విషయం అక్షరకు చెప్పిన ప్రేమ్.. ఇంట్లో వాళ్లంతా షాక్.. అక్షర ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుంది..?

intinti gruhalakshmi 6 october 2021 full episode
Intinti Gruhalakshmi 6 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 6 అక్టోబర్, 2021, బుధవారం ఎపిసోడ్ 443 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.ప్రేమ్ మీద ఉన్న ప్రేమను ఎలాగైనా శృతితో చెప్పించాలని ప్రేమ్, తులసి, రాములమ్మ కలిసి నాటకం ఆడుతుంటారు. దీంతో ప్రేమ్ తన ప్లాన్ ను స్టార్ట్ చేస్తాడు. శృతికి అసూయ వచ్చేలా.. ప్రేమ్.. అక్షరతో క్లోజ్ అవుతాడు.ప్రేమ్ ఇంత త్వరగా అక్షరతో క్లోజ్ అవడం.. లాస్యకు అనుమానం తెప్పిస్తుంది. ఎక్కడో తేడా కొడుతోందని లాస్య అనుకుంటుంది. ప్రేమ్ లో ఇంత సడెన్ గా మార్పు రావడం ఏంటని అనుకుంటుంది లాస్య. ప్రేమ్.. శృతిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాడు. ప్రేమ్.. తన ప్రేమను అంత ఈజీగా వదులుకోడు. శృతిని అంత త్వరగా దూరం పెట్టడు.. అని నందుతో చెబుతుంది.

intinti gruhalakshmi 6 october 2021 full episode
ప్రేమ్ ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. హఠాత్తుగా ప్లేట్ ఫిరాయిస్తే ఎలా అని అంటుంది లాస్య. ఆ చాన్స్ లేదు లాస్య.. శృతి ఇప్పుడు మన గుప్పిట్లో ఉంది.. అని చెప్పనా నందు వినడు. దీని వెనుక ఏదో జరుగుతుంది.. అన్నీ తెలుసుకుంటాను అని చెబుతుంది లాస్య. కట్ చేస్తే.. శృతి తెగ బాధపడిపోతుంది. నన్ను క్షమించండి ఆంటి.. నా ప్రేమను త్యాగం చేయాలంటూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు. నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను.. అంటుంది లాస్య. ఇంతలో వందన వచ్చి ఏమైంది.. అంతలా ఏడుస్తున్నావు.. ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు వందన అంటుంది శృతి.

intinti gruhalakshmi 6 october 2021 full episode
Intinti Gruhalakshmi 6 Oct Today Episode : వందనకు జరిగిన విషయాలన్నీ చెప్పిన శృతి
దీంతో వందనకు జరిగిన విషయాలు అన్నీ చెబుతుంది శృతి. ఎంత పని చేశావు శృతి. త్యాగం పేరు చెప్పి నీ భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నావా? ప్రేమ్ ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగదు అంటే.. లేదు.. ప్రేమ్ అక్షరను పెళ్లి చేసుకోకపోతే ఈ ఇల్లు రోడ్డు మీద పడుతుంది. నందు అంకుల్ అప్పులు తీరవు.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేమ్ ను నేను దూరం చేసుకోవడమే కరెక్ట్.. అని వందనతో చెబుతుంది శృతి.
ప్రేమ్ ఆలోచిస్తుండగా… తులసి వచ్చి ఏమైంది ప్రేమ్ అని అడుగుతుంది. శృతి గురించి అని అంటాడు ప్రేమ్. కొన్ని రోజులు ఓపిక పట్టుకో. తనే వచ్చి నోరు విప్పి నీమీద ఉన్న ప్రేమ గురించి చెబుతుంది అంటుంది తులసి. నాకు ఆ నమ్మకం లేదమ్మా.. అంటాడు ప్రేమ్. కాస్త సమయం ఇవ్వు తనకు. తన మనసులో ఏదో పెట్టుకొని తన ప్రేమను దాచేస్తోంది. తనకు కొంచెం సమయం ఇవ్వాలి అని ప్రేమ్ ను ఓదార్చుతుంది తులసి.

intinti gruhalakshmi 6 october 2021 full episode
ఇంతలో పెళ్లి పనులు స్టార్ట్ అవుతుంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సరదాగా వేడుకను జరుపుకుంటారు. శృతిని కూడా తీసుకొని వస్తుంది అక్షర. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి.. ప్రేమ్ పక్కన ప్లేస్ ఖాళీగా ఉంది.. రా శృతి. ప్రేమ్ పక్కన కూర్చో అని చెబుతుంది అక్షర. దీంతో అందరూ షాక్ అవుతారు.
ఆ వేడుకలో ప్రేమ్ మీద నాకు ఓ అనుమానం ఉంది అంటుంది అక్షర. నీ వెంట చాలా అమ్మాయిలు పడి ఉంటారు కానీ.. నువ్వు ఎవరినీ ప్రేమించలేదా.. అని అడుగుతుంది అక్షర. దీంతో అందరూ షాక్ అవుతారు. నన్ను ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అక్షర అంటాడు ప్రేమ్. అది సరే.. నువ్వు ఎవరినీ ప్రేమించలేదా.. అని అడుగుతుంది అక్షర. ప్రేమించాను.. అంటాడు ప్రేమ్. ఆ అమ్మాయి పేరు శృతి అని అంటాడు ప్రేమ్. దీంతో అక్షర షాక్ అవుతుంది. అంటే.. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి కొంచెం శృతి లాగానే ఉంటుంది అని చెబుతాడు ప్రేమ్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

intinti gruhalakshmi 6 october 2021 full episode
ఇంతకీ ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశావో నాకు చెప్పు ప్రేమ్ అని అడుగుతుంది అక్షర. ఇక్కడ ఉన్నవాళ్లలో ఎవరో ఒకరికి ప్రపోజ్ చేయ్ ప్రేమ్. నేను చూస్తాను.. అంటుంది అక్షర. ఎవరికి ప్రపోజ్ చేయాలి అని ప్రేమ్ అడుగుతాడు. దీంతో శృతికి ప్రపోజ్ చేయ్ అని చెబుతుంది అక్షర. శృతి ఏమనుకోకు.. ప్రేమ్ ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఏమనుకోకు ప్లీజ్ అని అడుగుతుంది అక్షర. అయ్యో అక్షర వద్దు అని అంటుంది శృతి. నాకోసం ప్లీజ్ అనగానే శృతి ఒప్పేసుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

intinti gruhalakshmi 6 october 2021 full episode