Intinti Gruhalakshmi 7 Oct Today Episode : మరోసారి సామ్రాట్ నోరు నొక్కిన అనసూయ.. తులసికి సారీ చెబుతాడా? తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకుంటాడా?
Intinti Gruhalakshmi 7 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 757 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య.. ఇక నైనా తులసి గురించి పట్టించుకోవడం మానేద్దాం. మన పని మనం చేసుకుందాం అని నందు లాస్యకు చెబుతాడు. మరోవైపు నీకు ఇది కొంచెం కూడా తప్పు అనిపించడం లేదా అని సామ్రాట్ ను బాబాయి అడుగుతాడు. దీంతో తప్పుగా అనిపించింది కానీ.. తన ముందు ముఖం చెల్లడం లేదు అంటాడు సామ్రాట్. ఫోన్ చేసి తులసికి సారీ చెబుతా అంటాడు సామ్రాట్. దీంతో అందరి ముందు అవమానించి ఇప్పుడు ఫోన్ లో సారీ చెబుతావా అంటాడు బాబాయి. దీంతో ఇంటికి వెళ్లి తనకు సారీ చెబుతా అంటాడు సామ్రాట్.
మరోవైపు కాలనీ వాసులు అందరూ తులసి ఇంటికి వచ్చి ఈసారి దసరా పండుగను ఎవరింట్లో వాళ్లు కాకుండా కాలనీలో చేద్దాం అంటారు. దీంతో తులసి కూడా సరే అంటుంది. మరోవైపు మాకు కొత్త డ్రెస్సులు కావాలి అని అంకిత, శృతి, దివ్య అంటారు. మరోవైపు సామ్రాట్ కారులో వెళ్తుంటాడు. తులసి గారు ఇప్పుడు నాతో మాట్లాడుతారా? ఎలా అని టెన్షన్ పడుతూనే సామ్రాట్ కారులో వెళ్తుంటాడు. తనకు సారీ చెబితే చాలా.. ఆ సంగతి పబ్లిక్ గా ఎందుకు అనౌన్స్ చేశారని అడుగుతారేమో అప్పుడు ఏం చెప్పాలి. జరిగిందేంటో చెప్పేస్తాను. అప్పుడైనా నా మైండ్ క్లియర్ అవుతుంది అని అనుకుంటాడు. పరిస్థితి లా ఉంటుందో. నన్ను చూడగానే అక్కడ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకుంటాడు సామ్రాట్.
మరోవైపు షాపింగ్ కు వెళ్లిన తులసి.. సామాన్లు తీసుకొని తను ముందే వస్తుంది. ఇంతలో అనసూయ పండగకు ఏం వండుతున్నావు.. ఏం వంటలు చేస్తున్నావు అని అడగాల్సినవి అడగకుండా ఏవేవో అడుగుతున్నారు మీ మామయ్య గారు అని అంటుంది అనసూయ.
ఈ దసరా పండుగ ప్రశాంతంగా జరిగేలా చూడు తండ్రి అని దేవుడిని మొక్కుతాడు పరందామయ్య. మొదటి సారి కాలనీ వాళ్లంతా కలిసి పండుగ చేసుకుంటున్నారు కదా. అందుకే అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను అంతే అంటుంది అనసూయ.
Intinti Gruhalakshmi 7 Oct Today Episode : సామ్రాట్ ను మరో సాయం కోరిన అనసూయ
ఇంతలో సామ్రాట్ కారు వస్తుంది. సామ్రాట్ ను చూసి అనసూయ షాక్ అవుతుంది. ఈయన మళ్లీ ఎందుకు వచ్చాడు. నాకోసం వచ్చాడా.. తులసి కోసం వచ్చాడా అని అనుకుంటుంది అనసూయ. నాకోసమే అయి ఉంటుంది అని అనసూయ ఆయన దగ్గరికి వస్తుంది.
ఎదురు పడకూడదు అని అనుకున్న మనిషే ఎదురుపడింది. ఎలాగైనా ఈవిడను తప్పించుకొని తులసి దగ్గరికి వెళ్లాలి అని అనుకుంటాడు సామ్రాట్. నేనే మీ ఇంటికి వద్దామని అనుకున్నా అంటుంది అనసూయ. తులసి సర్దుకుపోతుంది. ఏం జరగనట్టుగా ఉంటుంది అని అంటుంది.
ఇప్పటికే పెద్ద సహాయం చేశారు. అయినా కూడా ఇంకో చిన్న సాయం చేయండి అని అంటుంది అనసూయ. ఏం లేదు బాబు. తులసి ఉద్యోగం తీసేసిన విషయంలో జరిగినదంతా మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఎందుకంటే తులసి బాధపడకూడదు. తులసి బాధ చూసి మనం బాధపడకూడదు అంటుంది అనసూయ.
ఎలాగూ తులసి ఆఫీసుకు రాదు. నువ్వు కూడా ఇక నుంచి మా ఇంటికి రాకు అంటుంది అనసూయ. తులసి గారెతో మాట్లాడుతా అంటే వద్దు అంటుంది అనసూయ. ఎందుకు ఇప్పుడు అంటుంది అనసూయ. దీంతో తులసి గారి దగ్గర ఒక ఫైల్ ఉండిపోయింది.
తనను అడుగుదామని వచ్చా అంటాడు సామ్రాట్. దీంతో తన ఫైల్ ను నేను పంపిస్తా అంటుంది అనసూయ. ఇంట్లోకి వెళ్లిన అనసూయ డౌట్ డౌట్ గానే తులసికి సామ్రాట్ వచ్చాడని చెబుతుంది. ఏదో ఫైల్ మరిచిపోయాడట అని చెబుతుంది. దీంతో తులసి తన దగ్గర ఉన్న ఓ ఫైల్ పట్టుకొని సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది.
నిజంగా మీరు ఫైల్స్ కోసమే వచ్చారా అని అడుగుతుంది తులసి. దీంతో అవును అంటాడు సామ్రాట్. కానీ.. ఈ ఫైల్స్ లో అంత ముఖ్యమైనవి ఏం లేవు కదా.. అని అడుగుతుంది. అసలు ఈ ఫైల్స్ కోసం మీరు ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదు అని అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.