Intinti Gruhalakshmi 9 July Today Episode : లాస్య ప్లాన్ రివర్స్.. సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ప్రేమ్.. పోటీల్లో ప్రేమ్ గెలుస్తాడా? లాస్యకు షాకిస్తాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 9 July Today Episode : లాస్య ప్లాన్ రివర్స్.. సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ప్రేమ్.. పోటీల్లో ప్రేమ్ గెలుస్తాడా? లాస్యకు షాకిస్తాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :9 July 2022,9:30 am

Intinti Gruhalakshmi 9 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 జులై 2022, శనివారం ఎపిసోడ్ 680 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కాంపిటిషన్ లో అసలు ప్రేమ్ గెలిస్తే కదా అని భాగ్యతో అంటుంది లాస్య. ఇదేంటో తెలుసా.. అని అడుగుతుంది. దాంతో ఏదో ప్లాన్ చేస్తున్నట్టు చెబుతుంది లాస్య. దీన్ని జ్యూస్ లో కలిపి ప్రేమ్ తాగేలా చేస్తా. అప్పుడు వాడు పాడటం కాదు అని లాస్య అంటే దగ్గడం మొదలు పెడుతాడా అంటుంది. ఇక.. మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం అంటుంది లాస్య. మరోవైపు కాంపిటిషన్ స్టార్ట్ అవుతుంది. జ్యూస్ తీసుకెళ్లే అబ్బాయిని పిలిచి తను జ్యూస్ గ్లాస్ ఇచ్చి రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి ఇవ్వమని చెబుతుంది లాస్య. మా అమ్మ ఇచ్చిందని చెప్పు అని అంటుంది. దీంతో సరే అని చెప్పి ప్రేమ్ కు జ్యూస్ అందిస్తాడు. దీంతో ఆ జ్యూస్ తాగుతాడు ప్రేమ్. దీంతో తన ప్లాన్ సక్సెస్ అయినట్టే అని అనుకుంటుంది లాస్య.

intinti gruhalakshmi 9 july 2022 full episode

intinti gruhalakshmi 9 july 2022 full episode

ఇంకాసేపట్లో ఈవెంట్ ప్రారంభం కాబోతుందని.. ఫైనల్ విన్నర్ ను జడ్జిలు కాదు.. ప్రేక్షకులే విజేతను డిసైడ్ చేస్తారని చెబుతుంది హోస్ట్. అందరు పార్టిసిపెంట్స్ రావాలని చెబుతుంది హోస్ట్. ఫస్ట్ పార్టిసిపెంట్ ను పిలుస్తారు. దీంతో తను పాట పాడటం స్టార్ట్ చేస్తాడు. మగువ పాట పాడుతాడు. రక్షిత్ బాగా పాడాడని.. అతడే విన్నర్ అని నందు అంటాడు. మరోవైపు సాధన కూడా ఏదో ఒక రాగం పాట పాడుతుంది. ఇంతలో ప్రేమ్ కు దగ్గు స్టార్ట్ అవుతుంది. ఇంతలో తులసి అక్కడికి వెళ్లి ఏమైంది అని అడుగుతుంది. దీంతో గొంతులో గరగరగా ఉంది. మంటగా ఉంది. పాడటం కష్టం అవుతుందేమో అంటాడు ప్రేమ్. దీంతో ఏం కాదు. దాన్ని పట్టించుకోకు. నువ్వు గెలవాలి.. వేడి నీళ్లు తాగు.. తగ్గుతుంది అని అంటుంది తులసి. దీంతో కొన్ని నీళ్లు తాగుతాడు. తర్వాత ఒక లవంగం ఇచ్చి గొంతులో పెట్టుకో. గొంతు నొప్పి తగ్గుతుంది అని చెబుతుంది తులసి.

ఇంతలో ప్రేమ్ ను పిలుస్తారు. దగ్గుకుంటూనే పైకి వెళ్తాడు కానీ.. పాట బాగానే పాడటం స్టార్ట్ చేస్తాడు. బాగా పాడుతాడు. దీంతో అందరూ చప్పట్లు కొడతారు. దీంతో దగ్గు ఏమైంది అని అనుకుంటుంది లాస్య. ఇంతలో తనకు దగ్గు వస్తుంది. దీంతో బయటికి వెళ్తుంది లాస్య.

Intinti Gruhalakshmi 9 July Today Episode : ప్రేమ్ కు బదులు లాస్యకు ఎందుకు దగ్గులేసింది

తెగ దగ్గుతూ ఉంటుంది. ఏమైంది లాస్య అని అడుగుతుంది భాగ్య. ప్రేమ్ కు దగ్గు తెప్పిస్తా అని నువ్వు తెచ్చుకున్నావేంటి అని అడుగుతుంది భాగ్య. దీంతో తను తెచ్చుకోలేదు.. నేనే తెప్పించాను అంటుంది తులసి. ఎందుకు ఇలా నన్ను గెలిగించుకుంటున్నావు అని అడుగుతుంది.

నువ్వు ప్రేమ్ కు ప్రత్యేకంగా జ్యూస్ పంపిస్తున్నప్పుడే నేను చూసి.. నువ్వు ఇచ్చిన గ్లాస్ ను మార్చాను. నువ్వు ప్రేమ్ కు పంపించిన గ్లాస్ ను ఏం చేశానో తెలుసా? అని చెప్పి తను ఆ గ్లాస్ ను క్యాటరింగ్ బాయ్ కి ఇస్తుంది. దాన్ని తీసుకెళ్లి అతడు లాస్యకు ఇస్తాడు.

అంటే లాస్య మందు కలిపిన గ్లాస్ మొత్తం తాగేసిందా అని అడుగుతుంది భాగ్య. అవును.. తను తీసుకున్న గోతిలో తనే పడింది అని అంటుంది. తను బాగా దగ్గడం చూసి.. పక్కనే ఉన్న తులసి చెట్టుకు ఉన్న రెండు తులసి ఆకులను తెంపి వాటిని నోట్లో వేసుకో.. నిమిషంలో దగ్గు తగ్గుతుంది. ప్రేమ్ గెలుపు కళ్లారా చూద్దువు గానీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

ఆ తులసి ఆకులను తినగానే తన దగ్గు తగ్గుతుంది. కాస్త నెమ్మదిస్తుంది లాస్య. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్ ను గెలవనివ్వను అని అనుకుంటుంది లాస్య. మరోవైపు సెమీ ఫైనల్స్ లోకి రక్షిత్, ప్రేమ్ ఇద్దరూ మిగులుతారు. దీంతో ప్రేమ్ ను మోటివేట్ చేస్తుంది తులసి.

ఇప్పుడు నీ టైమ్ వచ్చింది. నీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణాలు ఎప్పుడు నువ్వు సొంతం చేసుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి అని చెబుతుంది. మరోవైపు లాస్య, భాగ్య ఇద్దరూ అక్కడున్న ప్రేక్షకులకు ఏదో చెబుతుంటారు. వాళ్లు వచ్చాక.. నందు అడుగుతాడు.

ఆడియెన్స్ తో ఏం మాట్లాడారు అని లాస్యను అడుగుతాడు. దీంతో రక్షిత్ కు ఓటేయమని అడిగాం అని అంటుంది. దీంతో నీకు ఇష్టం లేకపోతే నువ్వు ప్రేమ్ కు ఓటేయకు. ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు, అభి కూడా రక్షిత్ కే ఓటేయాలి అని అంటుంది.

కట్ చేస్తే.. ఫైనల్స్ స్టార్ట్ అవుతాయి. రక్షిత్ వెళ్లి ఫైనల్ సాంగ్ పాడుతాడు. ఒకే ఒక లోకం నువ్వే అనే పాట పాడుతాడు. బాగా పాడటంతో అందరూ చప్పట్లు కొడతారు. తర్వాత ప్రేమ్ పాడటం స్టార్ట్ చేస్తాడు. అమ్మను మించి దైవం ఉన్నదా అనే పాట పాడుతాడు ప్రేమ్. పాట అయిపోగానే అందరూ చప్పట్లు కొడతారు.

ఆ తర్వాత ఓటింగ్ పెడతారు. అందరినీ నచ్చిన వాళ్లకు ఓటేయాలని చెబుతారు. దీంతో అందరూ ఓట్లు వేస్తారు. ఒక్క ఓటు తేడాతో ఎవరు గెలిచారో జడ్జిలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది