Serial Actress Lahari : ఇంటింటి గృహలక్ష్మి ఫేమ్ శృతి రియల్ గా అంత అమాయకురాలు కాదు.. పొగరు ఎక్కువ?
Serial Actress Lahari : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి శృతి తెలుసు. ఎందుకంటే.. ఆ సీరియల్ లో శృతిది ముఖ్యమైన పాత్ర. తన అసలు పేరు లహరి. తను పలు సినిమాల్లోనూ నటించింది. చాలా సీరియళ్లలో నటించి.. బెస్ట్ సీరియల్ నటిగా పేరుతెచ్చుకుంది. అయితే.. తన లేటెస్ట్ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మిలో తన పాత్ర పేరు శృతి. తను ప్రేమ్ ను ప్రేమిస్తుంది. కానీ.. నందు ఒప్పుకోకపోవడం వల్ల తన ప్రేమను త్యాగం చేస్తుంది. ఆ సీరియల్ లో తనది చాలా అమాయకమైన పాత్ర. అదొక్కటే కాదు.. చాలా సీరియళ్లలో తనది చాలా అమాయకమైన పాత్ర. అయితే.. అందరూ అనుకున్నట్టు.. సీరియళ్లలో చూపించినట్టు రియల్ లైఫ్ లో అయితే లహరి అంత అమాయకురాలు మాత్రం కాదట.

intinti gruhalakshmi fame sruthi real life behaviour
తను ఇప్పటి వరకు పాల్గొన్న చాలా ఇంటర్వ్యూలను బట్టి చూస్తే.. తను ఏమాత్రం అమాయకురాలు కాదని.. తనకు కొంచెం పొగరు అని అంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల తను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తను చెప్పిన సమాధానాలు చాలా పొగరుగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.
Serial Actress Lahari : ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన లహరి
తన వ్యక్తిగత విషయాల గురించి కానీ.. సీరియల్స్ గురించి గానీ చెప్పుకొచ్చిన సమయంలో తను ఆటిట్యూట్ చూపించిందటున్నారు. తను ఇప్పటి వరకు నటించిన సీరియల్స్ లో ఏది ఇష్టమైన పాత్రో చెప్పాలంటూ ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. అన్నీ ఇష్టమైనవి కాబట్టే వాటిలో నటించా.. అంటూ సమాధానం చెప్పింది.అలా మరికొన్ని ప్రశ్నలకు కూడా అటువంటి సమాధానమే చెప్పడం.. ఆ ఇంటర్వ్యూను చూసిన వాళ్లు.. లహరి సీరియళ్లలో ఉన్నంత అమాయకంగా రియల్ లైఫ్ లో ఉండదు అనే విషయం అర్థం అవుతోంది అని అంటున్నారు. ఏది ఏమైనా.. ప్రస్తుతం తను నటిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తన పాత్ర మాత్రం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఆ సీరియల్ తన పాత్ర చుట్టూనే తిరుగుతోంది.