
Intinti Gruhalakshmi Serial Actress kasturi shankar comments on siddarth tweets
Siddharth : హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి అందరికీ విదితమే. ఇటీవల ‘మహా సముద్రం’ చిత్రంతో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సంగతులు అలా ఉంచితే.. దేశంలో జరిగే పలు విషయాలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు సిద్ధార్థ్. తన అభిప్రాయలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటాడు. కాగా, తాజాగా సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్‌పై కస్తూరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తను చేసిన తప్పును తెలుసుకుని బాధపడాలని హితవు పలికింది ఆమె.ఇంతకీ సిద్ధార్థ్ ఏం ట్వీట్ చేశాడంటే..ఇటీవల భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లినపుడు అక్కడ భద్రతకు సంబంధించిన ఇష్యూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ విషయమై సైనా నెహ్వాల్ స్పందించింది. దేశ ప్రధానికి భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేసింది. కాగా, సైనా చేసి ట్వీట్ పైన సిద్ధార్థ్ వ్యంగ్యంగా స్పందించాడు. దాంతో సిద్ధార్థ్ ట్వీట్ పైన కస్తూరీ శంకర్ ఫైర్ అయింది.సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌లో అసభ్య పదజాలం ఉండగా, వివాదం తారాస్థాయికి చేరింది. ఈ విషయమై మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగి, చర్యలకు సిద్ధమవుతోంది.సింగర్ చిన్మయి కూడా సిద్దార్థ్ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి, అభ్యంతరం వ్యక్తం చేసింది. కస్తూరీ శంకర్ తాజాగా చేసిన ట్వీట్‌లో .. సిద్ధార్థ్ నటుడిగా తనకు ఇష్టమేనని, కానీ, ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం సరికాదని పేర్కొంది.
Intinti Gruhalakshmi Serial Actress kasturi shankar comments on siddarth tweets
గతంలో సిద్ధార్థ్ రాజకీయంగా వ్యక్తపరిచిన భావాల పట్ల ఎదురు దాడి జరిగితే తాను అండగా నిలిచానని, కానీ, సిద్ధార్థ్ తాజాగా చేసిన ట్వీట్‌లో పర్సనల్ అటాక్ ఉందని అంది కస్తూరీ శంకర్. ఓ జాతీయ హీరో ఇలా తప్పుదోవలో ట్వీట్ చేయడం సరికాదని, బ్యాడ్మింటన్, కాక్ అండ్ బుల్ స్టోరి చెప్పకుండా చేసిన తప్పుకు సిద్ధార్థ్ బాధపడాలని కస్తూరీ శంకర్ తెలిపింది. ట్వీట్ ఎందుకు డిలీట్ చేయలేదు, సారీ ఎంకు చెప్పలేదని ప్రశ్నించింది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.