investing 100 crores on tollywood hero with zero blockbusters
Tollywood : సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన వాళ్లకు మాత్రమే గుర్తింపు ఆదరణ ఉంటుంది. వారి సినిమాలపై మాత్రమే బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తారు, కానీ కొందరు హీరోల విషయంలో మాత్రం పై పద్ధతి వర్తించదు ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా యొక్క బడ్జెట్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ కమర్షియల్గా ఒక్క సక్సెస్ ను దక్కించుకోలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. అక్కినేని అఖిల్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఆయనకు సక్సెస్ అనేది అందని ద్రాక్షే అయింది. దాంతో ఆయన సినిమాల యొక్క బడ్జెట్ రోజు రోజుకు తగ్గాల్సి ఉంటుంది. కానీ ఏజెంట్ సినిమాకు మాత్రం ఏకంగా వంద కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. సినిమా కు మొదట 60 కోట్లు అనుకున్నారు, కానీ 60 కోట్లతో సినిమా ఆశించిన స్థాయిలో రాలేదు. పైగా కొన్ని సన్నివేశాలు సరిగా లేవని రీ షూట్ చేస్తున్నట్లు గా కూడా సమాచారం అందుతోంది. అందువల్ల సినిమాకు ఏకంగా వంద కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
investing 100 crores on tollywood hero with zero blockbusters
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హిట్ అందుకొని అఖిల్ అక్కినేని కి రూ. 100 కోట్ల బడ్జెట్ అంటే కచ్చితంగా చాలా హెవీ అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అయినా కూడా దర్శకుడు మరియు నిర్మాత ఏమాత్రం వెనకాడకుండా వంద కోట్ల సినిమా ను అఖిల్ అక్కినేనికి ఇవ్వబోతున్నారు. ఈ వంద కోట్ల సినిమా వంద కోట్లను వసూళ్లు చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. వంద కోట్ల వసూళ్లు వస్తే అఖిల్ అక్కినేని టాలీవుడ్ లో స్టార్ హీరో గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టులోనే రావాల్సి ఉన్నా చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో లేదా సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు ఏమో చూడాలి.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.