Siri – Shanmukh : బిగ్ బాస్ తర్వాత సిరి మరియు షణ్ముఖ్ కలిశారా.. హౌస్‌లో వారిది నిజమైన ప్రేమేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Siri – Shanmukh : బిగ్ బాస్ తర్వాత సిరి మరియు షణ్ముఖ్ కలిశారా.. హౌస్‌లో వారిది నిజమైన ప్రేమేనా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :22 January 2023,1:00 pm

Siri – Shanmukh : తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ సీజన్‌ లో యూట్యూబ్‌ స్టార్‌ షన్ముఖ్‌ జష్వంత్‌ మరియు సిరి హనుమంతుల యొక్క రొమాన్స్‌.. ముద్దులు.. హగ్గులు హైలైట్ గా నిలిచాయి అనడంలో సందేహం లేదు. ఆ సీజన్ లో వీరిద్దరి యొక్క రొమాన్స్ స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలవడంతో రేటింగ్ కూడా భారీగా నమోదు అయ్యింది. కేవలం బిగ్ బాస్ వల్లే షన్నూ మరియు దీప్తి సునైన యొక్క ప్రేమ బ్రేకప్ అయిన విషయం కూడా చాలా మందికి తెల్సిందే.

బిగ్‌ బాస్ లో ఉన్నప్పుడు ఎమోషనల్‌ గా చాలా గట్టిగా కనెక్ట్‌ అయిన సిరి మరియు షన్నూ లు బిగ్‌ బాస్ తర్వాత కలిశారా అనేది చాలా మందికి అనుమానం. అసలు ఇద్దరి మధ్య స్నేహం కంటిన్యూ అవుతుందా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు ఒకే ప్రాంతం వారు అయినా కూడా గత ఏడాది కాలంగా వీరిద్దరు కలిసిందే లేదట. బిగ్ బాస్ పూర్తి అయిన తర్వాత ఒక షో లో ఇద్దరు కనిపించారు. ఆ తర్వాత మళ్లీ వీరు కనిపించిందే లేదు.

is bigg boss fameShanmukh jaswanth and Siri met again after show

is bigg boss fameShanmukh jaswanth and Siri met again after show

సిరి మరియు షన్నూ లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. హౌస్ లో నిజంగా వీరిద్దరు ప్రేమించుకున్నారా అనే ప్రశ్నకు ఇంకా కూడా సమాధానం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు కూడా చాలా ఎమోషనల్‌ గా కనెక్ట్‌ అయ్యారు అనే వార్తలు వచ్చాయి కానీ వారు మాత్రం తామిద్దరి మద్య ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పలేదు. అదుగో ఇదుగో అంటూ షన్నూ మరియు సిరిల యొక్క ప్రేమ గురించి రకరకాలుగా సోషల్‌ మీడియాలో పుకార్లు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏమాటకు ఆమాట ఇద్దరి జోడీ భలే ఉంటుందని నెటిజన్స్ ఇప్పటికి అంటూనే ఉంటారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది