iBOMMA : ఐబొమ్మను ఎలా నడుపుతున్నారు? వీళ్లకి డబ్బులు ఎలా వస్తాయి? ఇది సేఫేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

iBOMMA : ఐబొమ్మను ఎలా నడుపుతున్నారు? వీళ్లకి డబ్బులు ఎలా వస్తాయి? ఇది సేఫేనా?

iBOMMA : ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐబొమ్మ అనేది ప్రతి ఒక్కరికి నేడు తెలుసు. సినిమా లవర్స్ కు ఐబొమ్మ అనేది బెస్ట్ ప్లాట్ ఫామ్. ఇది ఫ్రీ ఓటీటీ అని చెప్పుకోవచ్చు. థియేటర్లలో సినిమా విడుదలైన ఒక్క రోజులోనే, ఓటీటీలో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ఐబొమ్మలో సినిమా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు ఐబొమ్మలో వెంటనే విడుదల అవుతూ ఉంటాయి. […]

 Authored By gatla | The Telugu News | Updated on :24 August 2023,2:00 pm

iBOMMA : ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐబొమ్మ అనేది ప్రతి ఒక్కరికి నేడు తెలుసు. సినిమా లవర్స్ కు ఐబొమ్మ అనేది బెస్ట్ ప్లాట్ ఫామ్. ఇది ఫ్రీ ఓటీటీ అని చెప్పుకోవచ్చు. థియేటర్లలో సినిమా విడుదలైన ఒక్క రోజులోనే, ఓటీటీలో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ఐబొమ్మలో సినిమా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు ఐబొమ్మలో వెంటనే విడుదల అవుతూ ఉంటాయి.

అందులో నేరుగా వీడియోలను చూడొచ్చు. లేదంటే వీడియోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదంతా ఓకే కానీ.. అసలు ఐబొమ్మలో ఎవరు సినిమాలు పెడుతున్నారు. దాన్ని ఎవరు నడుపుతున్నారు. వీళ్లకు డబ్బులు ఎలా వస్తాయి. అసలు ఐబొమ్మలో సినిమాలు చూడటం నేరమా? డౌన్ లోడ్ చేస్తే నేరమా? అనే డౌట్స్ మనకు వస్తుంటాయి. అసలు ఐబొమ్మ వెబ్ సైట్ ను ఎవరు నడుపుతున్నారో ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. కాకపోతే ఐ బొమ్మ వెబ్ సైట్ డొమేన్ ను మాత్రమే బ్లాక్ చేయగలిగాం. అయినా కూడా వాళ్లు వెనువెంటనే డొమేన్స్ ను మారుస్తుంటారు. అందుకే ఐబొమ్మను ఎవరు నడుపుతున్నారో ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు.

iBOMMA : ఐబొమ్మలో సినిమా చూస్తే మొబైల్ లో వైరస్ వస్తుందా?

ఐబొమ్మ అనేది సైబర్ నేరగాళ్లు వేసే వల అని కూడా చెప్పుకోవచ్చు. ఐబొమ్మ వెబ్ సైట్ లో సినిమాలు చూస్తే ఒక్కోసారి వైరస్ డౌన్ లోన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల చాలా ఇష్యూలు వస్తాయి. అయినా కూడా జనాలు మాత్రం చూడటం మానేయడం లేదు. థియేటర్ ప్రింట్ లో ఫుల్ మూవీ వెంటనే ఐబొమ్మలో వస్తుంటే ఎందుకు జనాలు చూడరు చెప్పండి. థియేటర్లలోకి జనాలు ఎవరు వెళ్తున్నారు.

is iBOMMA safe or not to use

is iBOMMA safe or not to use

కాకపోతే ఐబొమ్మ వల్ల ప్రేక్షకులకు ఎలాంటి నష్టం లేదు కానీ.. సినిమాలు తీసే వాళ్లకు నష్టం. ఐబొమ్మ మీద చర్యలు తీసుకోవడం కోసం ఇండస్ట్రీ వాళ్లు చాలా కష్టాలు పడ్డారు. కానీ.. వాళ్లు ఎవరో మాత్రం కనుక్కోలేకపోయారు. దానికి కారణం.. వాళ్లు ఎవరో.. ఎక్కడ ఉంటారో తెలియదు. వేరే దేశాల్లో ఉంటూ ఈ వెబ్ సైట్ ను నడిపిస్తుంటారు.

ఒక వెబ్ సైట్ డొమేన్ అడ్రస్ ను బ్లాక్ చేయగలం కానీ.. దాని వెనుక ఎవరు ఉన్నారు అని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఒక డొమేన్ బ్లాక్ చేయగానే ఐబొమ్మ వాళ్లు మరో డొమేన్ బుక్ చేసుకొని మూవీస్ ను అందులో పోస్ట్ చేస్తున్నారు. దాన్ని బ్లాక్ చేస్తే.. ఇంకో డొమేన్.. ఇలా ఎన్ని డొమేన్స్ బ్లాక్ చేస్తే.. అన్ని కొత్త డొమేన్స్ ను క్రియేట్ చేస్తూ వెళ్తుంటారు. అందుకే వాళ్లను పట్టుకోవడం సాధ్యం కావడం లేదు.

అసలు ఇలా కొత్త సినిమాలు వెబ్ సైట్ లో పెడితే ఏంటి లాభం అంటారా? వాళ్ల వెబ్ సైట్ లో కొన్ని యాడ్స్ ను డిస్ ప్లే చేస్తుంటారు. దాని వల్ల వాళ్లకు డబ్బులు వస్తాయి. ఐబొమ్మలో ఉన్న సినిమాల్లో మధ్యలో కొన్ని యాడ్స్ వస్తుంటాయి. వాటి ద్వారా వాళ్లకు ఆదాయం వస్తుంది. ఐబొమ్మను ప్రస్తుతం లక్షల మంది జనం చూస్తున్నారు కాబట్టి ఆ లక్షల మంది అటెన్షన్ పొందేందుకు అడ్వటైజర్స్ కూడా ఐబొమ్మను సెలెక్ట్ చేసుకుంటారు. దాని వల్ల ఐబొమ్మను మెయిన్ టెన్ చేసేవాళ్లకు డబ్బులు వస్తాయి.

కొన్ని బ్రాండ్స్ తోనూ ఒప్పందం చేసుకుంటారు. వాటి ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అలా వాళ్లు కొత్త సినిమాలను పైరసీ చేసి అందులో పెట్టి ఎక్కడో విదేశాల్లో ఉంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. థియేటర్లలో ఇప్పుడు సినిమా చూసి రావాలంటే వేలు పెట్టాల్సిందే. అదే ఐబొమ్మలో అదే కొత్త సినిమాను ఉచితంగా చూడొచ్చు. అందుకే జనాలు ఐబొమ్మలో సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. థియేటర్లకు జనాలే వెళ్లడం లేదు. దాని వల్ల సినిమా తీసిన నిర్మాత, దర్శకుడు నష్టపోవాల్సి వస్తోంది. అందుకే మన చట్టాల ప్రకారం చూసుకుంటే ఐబొమ్మలో సినిమాలు చూడటం అనేది ఇల్లీగల్ కిందికే వస్తుంది.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది