Kamal Haasan : కమల్ హాసన్ తో స్టార్ హీరోయిన్ డేటింగ్ అంటూ వార్తలు.. ఆ హీరోయిన్ ఏమన్నదో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kamal Haasan : కమల్ హాసన్ తో స్టార్ హీరోయిన్ డేటింగ్ అంటూ వార్తలు.. ఆ హీరోయిన్ ఏమన్నదో తెలుసా?

Kamal Haasan : కమల్ హాసన్ తెలుసు కదా. ఆయనకు వెర్సటైల్ యాక్టర్ అనే పేరు ఉంది. దాదాపు 60 ఏళ్ల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 1960 లోనే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి సినిమాలే జీవితంగా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. ఆయన వయసు 70 దాటినా ఇంకా సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే విక్రమ్ సినిమాతో బాక్సాఫీసును బద్దలు చేశాడు కమల్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :8 December 2022,5:30 pm

Kamal Haasan : కమల్ హాసన్ తెలుసు కదా. ఆయనకు వెర్సటైల్ యాక్టర్ అనే పేరు ఉంది. దాదాపు 60 ఏళ్ల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 1960 లోనే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి సినిమాలే జీవితంగా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. ఆయన వయసు 70 దాటినా ఇంకా సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే విక్రమ్ సినిమాతో బాక్సాఫీసును బద్దలు చేశాడు కమల్ హాసన్.

కమల్ హాసన్ సినిమాలు ఎంత వెరైటీగా ఉంటాయో.. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆయన ఇప్పటికే నటి గౌతమితో సహజీవనం చేసి ఇద్దరూ విడిపోయారు. అంతకు ముందే తన మొదటి భార్యతో విడిపోయాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న కమల్ హాసన్ మరో స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. నటి పూజా కుమార్ తో కమల్ హాసన్ సహజీవనం చేస్తున్నాంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దానికి కారణం.. కమల్ నటించిన విశ్వరూపం, విశ్వరూపం 2, ఉత్తమ విలన్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది పూజా కుమారే.

is kamal haasan dating with star heroine puja kumar

is kamal haasan dating with star heroine puja kumar

Kamal Haasan : నటి పూజా కుమార్ తో కమల్ హాసన్ సహజీవనం అంటూ వార్తలు

వరుసగా కమల్ తో పూజా కుమార్ సినిమాల్లో నటించడంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం స్టార్ట్ అయింది. ఇద్దరూ కలిసి రొమాంటిక్ సీన్లలోనూ నటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఇద్దరూ లిప్ లాక్ లోనూ నటించడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ప్రారంభం అయింది. అయితే.. ఈ వార్తలపై పూజా కుమార్ వెంటనే స్పందించింది. నేను దాదాపుగా ఐదేళ్ల నుంచి కమల్ హాసన్ తో సినిమాలు చేస్తూ వస్తున్నా. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా క్లోజ్. అలా అని.. మా మధ్య ఎలాంటి అఫైర్ లేదు.. ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయకండి అని పూజా కుమార్ ఇటీవల మీడియా స్టేట్ మెంట్ ఇచ్చి.. వాళ్ల మధ్య వస్తున్న పుకార్లకు  పుల్ స్టాప్ పెట్టారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది