Liger : లైగర్ తో విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో హీరో ఇమేజ్ వస్తుందా ..?
Liger : లైగర్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ పాన్ ఇండియన్ సినిమా ముంబై లో ఇప్పటికే 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా లైగర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్థాయిలో భారీ హిట్ అందుకొని రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా లైగర్ సినిమా విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు హిందీలో ఒక్క సినిమా చేయకపోయినా విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో క్రేజ్ మాత్రం బాగానే ఉంది. దాంతో పూరి జగన్నధ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లైగర్ రూపొందిస్తుండటం తో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Liger : కాని మన వాళ్ళకి ఈ తరహా కథలు నచ్చవు.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా గురించే టాలీవుడ్ వర్గాలు ఆసక్తికరమైన చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సక్సస్ అవుతాడా అన్న టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలే అంటున్నారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ తరహా కథలతో తెరకెక్కాయి. కాని మన వాళ్ళకి ఈ తరహా కథలు నచ్చవు. అందుకే ఆసక్తి చూపించలేదు. ఫలితంగా రెండు ఫ్లాప్స్ ని చూశాడు విజయ్. అయితే పూరి ఈ సినిమాకి పెట్టిన టైటిల్ అండ్ క్యాప్షన్ తో పాటు విజయ్ దేవరకొండ లుక్ మీద బాగా బజ్ క్రియేట్ అయింది. పక్కా పూరి మార్క్ సినిమా కాబట్టి ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.