Home » Entertainment » Is Mahesh Babu Producer For Adavi Sesh Major Movie
Entertainment

అడవి శేష్ మేజర్ సినిమాకి మహేష్ బాబు నిర్మాత ఎందుకయ్యాడు .?

Authored By
vamana sai
The Telugu News | Updated on: December 17, 2020, 11:39 am
Advertisement

అడవి శేష్ టాలీవుడ్ లో డిఫ్రెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు ప్రత్యేకమైన మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అడవి శేష్ అంటే .. ఇలాంటి సినిమాలే వస్తాయని అందరూ ఊహించలేనటువంటి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే క్షణం, గూఢాచారి, ఎవరు లాంటి విభిన్నమైన కథా చిత్రాలు వచ్చాయి. అడవి శేష్ నుంచి వచ్చిన ఈ సినిమాలతో మంచి టాలెంటెడ్ హీరో అని ఇండస్ట్రీ వర్గాల తో పాటు ప్రేక్షకుల్లోను ఒక ఇమేజ్ ని క్రియోట్ చేసుకున్నాడు. దాంతో అడవిశేష్ నుంచి వచ్చే సినిమాల మీద ఒక క్యూరియాసిటీ పెరిగింది.

Advertisement

కాగా తాజా చిత్రం మేజర్ సెట్స్ మీద ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అడవి శేష్ నటిస్తున్న మేజర్ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత. సోనీపిక్స్ తో కలిసి ఈ సినిమాని మహేష్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే మేజర్ సినిమాని మహేష్ బాబు నిర్మించడానికి అసలు కారణం ఏంటన్నది ఇండస్ట్రీలో కొంతమందికి అర్థం కావడం లేదట. అలాగే కొంతమంది ఫ్యాన్స్ కి ఈ విషయంలో ఆతృతగా ఉంది. ఏరకంగా మహేష్ బాబు… అడవి శేష్ తో సినిమా నిర్మిస్తున్నాడు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

Advertisement

ఇందుకు కారణం ఒక్కటే. మహేష్ బాబు కి అడవి శేష్ మీద తన సినిమాల మీద ఉన్న నమ్మకం. ముఖ్యంగా అడవి శేష్ మల్టీ టాలెంటెడ్. సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ మీద అడవి శేష్ కి బాగా పట్టుంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో అడవి శేష్ చాలా కొత్తగా .. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ లో ఆలోచిస్తాడు. ఆ కారణంగానే అడవి శేష్ తో సినిమా నిర్మించాలని మహేష్ డిసైడయ్యాడట. ఇక ఇప్పుడు అడవి శేష్ ఎంచుకున్న కథ ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ బయోపిక్ కావడం. అందుకే ఈ సినిమా కి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శోభిత ధూలిపాళ్ళ, సాయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి