పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం కి షాకిచ్చాడా .?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ తన పవర్ఫుల్ డైలాగులతో ఎంతో మంది యువతని తన వైపు తిప్పుకున్నాడు. తను చూపించే మానరిజం ని చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా అనుసరించి మరీ తమ అభిమానాన్ని తెలియచేస్తూనే ఉన్నారు. సినిమాలకి కొన్ని రోజులు దూరంగా ఉండి ప్రజలలో కి ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళి అక్కడ కూడా ప్రజల మన్ననలను అందుకున్నాడు. ప్రస్తుతానికి మళ్ళీ తనదైన శైలిలో నటనను ప్రదర్శించేందుకు ఫ్యాన్స్ కోసం వరస చిత్రాలతో కనువిందు చేయడానికి రెడీ అయ్యాడు.
అందులో భాగం గా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష అన్న టైటిల్ ప్రస్తుతం ప్రచారం లో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ 26 వ సినిమాగా వకీల్ సాబ్ షూటింగ్ ని పూర్తి చేసినట్లు రీసెంట్ గా మేకర్స్ వెల్లడించారు. దాంతో ఇప్పుడు అభిమానుల దృష్టి విరూపాక్ష పై పడింది. క్రిష్ తో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులు పెద్ద పండగ చేసుకునేలా ఉన్నారు. ఇక పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమా కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ.ఎయం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో నడుస్తుందని తెలిసిన విషయమే. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని పవన్ కెరీర్ లో ఫస్ట్ హిస్టరికల్ మూవీ కాబట్టి పవర్ స్టార్ ఇమేజ్ కి సరిపోయేలా అన్నీ అంశాలతో ఈ సినిమా రూపొందిస్తున్నాడట దర్శకుడు క్రిష్. కాగా త్వరలో మొదలవబోయో ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ కూడా రెడీ చేశారని సమాచారం. అయితే వీలైనంత త్వరగా క్రిష్ సినిమా ముగించి అయ్యప్పనుం కోషియం రీమేక్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
అంతేకాదు కుదిరితే రెండు సినిమాలని సమాంతరంగా కూడా చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్నా మొన్నటి వరకు వకీల్ సాబ్ కంప్లీట్ చేసి అయ్యప్పనుం కోషియం చేస్తాడనుకున్న పవన్ కళ్యాణ్ కాస్టింగ్ సమస్య తలెత్తడం తో వెంటనే క్రిష్ సినిమాని లైన్ లో పెట్టి షాకిచ్చాడు.