Home » Entertainment » Is Pradeep Machiraju Remuneration Higher Than A Star Hero
Entertainment

Pradeep machiraju : ప్రదీప్ మాచిరాజు రెమ్యూనరేషన్ స్టార్ హీరోని మించి ఉందా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: May 20, 2021, 7:54 am
Advertisement

Pradeep machiraju : ప్రదీప్ మాచిరాజు ..ప్రస్తుతం బుల్లితెర మీద కొనసాగుతున్న టాప్ మోస్ట్ యాంకర్. గత కొన్నేళ్ళుగా ఫీమేల్ యాంకర్స్‌దే హవా. మేల్ యాంకర్స్ అంతగా కనిపించేవాళ్ళు కాదు. సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి లాంటి వాళ్ళ తర్వాత సుమ ఇప్పటికీ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఫాంలో ఉన్న వాళ్ళంటే రష్మీ గౌతం, అనసూయ, శ్రీముఖి, హరితేజ, కొత్తగా వచ్చిన వర్షిణి..ఇప్పుడిప్పుడే వస్తున్న విష్ణు ప్రియ..ఇంత మంది అందాల భామల మధ్యలో ఒక మేల్ యాంకర్ తట్టుకొని నిలబడగలడా..నిలబడ్డాడు.

Advertisement

is-pradeep-machiraju-remuneration-higher-than-a-star-hero

స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్నాడు. గడసరి అత్తా సొగసరి కోడలు కార్యక్రమం ద్వారా జీ తెలుగులో ప్రసారమైన లేడీస్ గేం షోతో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. ఈ షో చేస్తున్నప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా వాటన్నిటిని లెక్క చేయకుండా తట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు ఏ కొత్త షో మొదలవుతున్నా ప్రదీప్ యాంకర్ అని దాదాపు మేకర్స్ ఫిక్స్ అవుతున్నారు. అంతగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్ తో ప్రదీప్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగింది.

Advertisement

Pradeep machiraju : ప్రదీప్ రెమ్యునరేషన్ డబుల్ అయిందంటున్నారు.

ప్రస్తుతం ప్రదీప్ రెమ్యునరేషన్ ఒక్కో ఎపిసోడ్‌కు లక్షన్నర అని టాక్ వినిపిస్తోంది. ఇంతక ముందు ఎపిసోడ్ కు 75 వేలు తీసుకునేవాడట. ఇప్పుడు అది డబుల్ అయిందంటున్నారు. అంతేకాదు సినిమాలలో అప్పుడప్పుడు కనిపించే ప్రదీప్..గత ఏడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగానూ మారాడు. ఈ సినిమాలో ఒక సాంగ్ యూట్యూబ్ లో ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఈయన అందుకున్న రెమ్యూనరేషన్ 25 లక్షలని చెప్పుకుంటున్నారు. ఏదేమైన బుల్లితెర మీద ప్రదీప్ రేంజ్ మామూలుగా లేదు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి