Rashmi Gautam – Sudigali Sudheer: రష్మి గౌతమ్ – సుడిగాలి సుధీర్ ల జంటకి బుల్లితెర మీద ఎంత క్రేజ్, పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే. ఎన్ని ఎపిసోడ్స్ అయినా వీరిని జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. నిజంగా వీరిద్దరు పెళ్ళి చేసుకుంటారేమో అని మాట్లాడుకునేవాళ్లు..చేసుకుంటే బావుంటుందనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. స్మాల్ స్క్రీన్ మీద వీరిద్దరికి పెర్‌ఫెక్ట్ జోడీ. స్టార్ హీరో హీరోయిన్ కలిసి వరుసగా మూడు నాలుగు సినిమాలు చేస్తే హిట్ పెయిర్ అంటూ అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఎలాగైతే విపరీతమైన క్రేజ్ ఉంటుందో అదే క్రేజ్ రష్మి గౌతమ్ – సుడిగాలి సుధీర్ లకి ఉంది.
is rashmi-gautam-sudigali-sudheer marriage fixed
ఎంత కాదనుకున్న ఖచ్చితంగా వీరిద్దరి మీద షోలో ఒక్కసారైనా టాపిక్ రాకుండా లేకుండా ఉండదు. అలా టాపిక్ వచ్చిన ప్రతీసారీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సిగ్గుపడటం, ఓర చూపులు చూసుకుంటూ కవ్వించటం, నిజంగా ప్రేమికుల్లా ప్రవర్తించడం జనాలకి బాగా నచ్చుతుంది.
ఇప్పటికే షోలో భాగంగా ఘనంగా ఇద్దరికీ పెళ్ళి జరిపించారు. ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల చాలామంది వీరు నిజంగా పెళ్ళి చేసుకున్నారా..అని కన్‌ఫ్యూజన్ లో పడ్డారు. బయట వీరు ఎన్నిసార్లు మేము స్కిట్స్‌లో భాగంగానే అలా బిహేవ్ చేస్తాము తప్ప మా మధ్య ఏమీలేదని చెప్పిన సందర్భాలున్నాయి.
అయితే ఇన్నాళ్లు బయట జనాలు రష్మి గౌతమ్ – సుడిగాలి సుధీర్ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఆశపడ్డారు. కానీ ఏకంగా ఇప్పుడు ఓ జబర్దస్త్ కమెడియన్ రష్మీ – సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందన్నాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే మరో కామెడీ షో వస్తోంది. ఇందులో ఓ స్కిట్‌లో భాగంగా మీ చివరి కోరిక ఏంటి అంటూ అక్కడున్న వాళ్లందర్నీ సుధీర్ ప్రశ్నలు అడిగాడు. అక్కడున్న 20 మంది కమెడియన్లు ఒక్కోలా ఆన్సర్స్ చెప్పారు. వారిలోనే సుడిగాలి సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ కూడా ఉన్నాడు. ఆటో రామ్ ప్రసాద్‌ను కూడా చివరి కోరిక ఏంట్రా అంటూ అడిగాడు సుధీర్. దానికి అతను ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు. నా చివరి కోరిక రష్మి – సుధీర్ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉందన్నాడు. దానికి వెంటనే సుధీర్ ఏదైనా జరిగేది చెప్పారా అంటూ కౌంటర్ పంచ్ వేశాడు.
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
This website uses cookies.