Mahesh Babu : నాగార్జునతో మహేష్ బాబు నిజంగానే ఆ మాట అన్నాడా?

Authored By aruna | The Telugu News | Published on: August 26, 2022, 7:40 pm

Mahesh Babu : సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరియు నాగార్జున మధ్య ది ఘోస్ట్‌ ట్రైలర్‌ విడుదల సందర్భంగా ట్విట్టర్ లో జరిగిన చర్చ అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ట్విట్టర్ లో ది ఘోస్ట్‌ ట్రైలర్‌ ను మహేష్ బాబు విడుదల తర్వాత నాగార్జున స్పందించాడు. కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ గారితో కలిసి నటించే అవకాశం నాకు కలిగింది. మళ్లీ ఇద్దరం కలిసి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను అంటూ నాగార్జున ట్విట్టర్ ద్వారా మహేష్ బాబుతో అన్నాడు.

అందుకు మహేష్ బాబు వెంటనే స్పందించాడు. తప్పకుండా మనం ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అంటూ మహేష్ బాబు ట్వీట్ ను చేయడం జరిగింది. ట్విట్టర్ లో నాగార్జున అడిగాడు.. మహేష్ బాబు ఓకే అన్నాడు. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది. నిజంగా వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా వస్తుందా అంటూ అభిమానులు గాల్లో మేడలు కడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

is really mahesh babu sad ok to with nagarjuna movie

is really mahesh babu sad ok to with nagarjuna movie

గతంలో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ను సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మహేష్ బాబు అలాంటి మల్టీ స్టారర్ సినిమాల విషయం లో ఆసక్తి చూపించడం లేదు. కారణం చెప్పలేదు కానీ మహేష్‌ బాబు మరియు ఇతర కొందరు హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఆమడ దూరం లో ఉంటున్నారు. కానీ ఇప్పుడు నాగార్జున మల్టీ స్టారర్ సినిమా ప్రపోజల్ కు మహేష్ బాబు ఓకే చెప్పడంతో చాలా మంది నిజంగానే మహేష్‌ బాబు మనసులో నుండి నాగ్ తో నటించేందుకు ఓకే చెప్పాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp