ప్యాన్ ఇండియా ప్లాన్స్.. కొరటాల శివ-అల్లు అర్జున్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్!!
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా మీద కన్నేసిన సంగతి తెలిసిందే. అందుకే పుష్పను ముందుగా అనుకున్న దానికంటే భారీ ఎత్తులో తీసేందుకు రెడీ అయ్యారు. పుష్పతో బన్నీ బాలీవుడ్ ప్రయాణం మొదలుకాబోతోంది. ఈ క్రమంలో తన తదుపరి చిత్రాలు కూడా ప్యాన్ ఇండియన్ లెవెల్‌లోనే ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అసలు బన్నీకి ఇప్పుడు సౌత్‌పై మంచి పట్టుంది.

Is Saiee Manjrekar In Allu Arjun Koratala siva Movie
ఇక హిందీ మార్కెట్‌ను కూడా కవర్ చేసేస్తే ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోవచ్చు. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతోన్న సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ కాంబోలో, తన స్నేహితులు నిర్మిస్తోన్న ఈ మూవీని బన్నీ జాగ్రత్తగా దగ్గరుండి మరీ అన్ని చూసుకుంటున్నాడట.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ‘దబాంగ్3’లో సల్మాన్ సరసన నటించిన సయీ మంజ్రేకర్.. తెలుగులో అడవి శేష్ ‘మేజర్’లో కనిపించనుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు టాక్. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.