Samantha : సమంతకు బాలీవుడ్ చెక్ పెడుతున్న సౌత్ హీరోయిన్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంతకు బాలీవుడ్ చెక్ పెడుతున్న సౌత్ హీరోయిన్..

 Authored By govind | The Telugu News | Updated on :18 April 2022,10:00 pm

Samantha – Rashmika Mandanna: సమంత కెరీర్ సినిమాల పరంగా మాంచి ఊపు మీదుంది. ఆమె బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్  ఇస్తోంది. ఇప్పటికే తెలుగులో శాకుంతలం అనే పాన్ ఇండియన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ను తాజాగా సమంత పూర్తి చేసింది. అలాగే, తమిళంలో తెరకెక్కిన మల్టీస్టారర్ కతువాక్కుల రెండు కాదల్ మెగా మల్టీస్టారర్ ఆచార్య కంటే ఒక్క రోజు ముందుగా అంటే ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో వస్తోంది.

ఇక సెట్స్ మీద యశోద సినిమా ఉంది. అయితే, బాలీవుడ్‌లో సమంత చైన్ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేయనుందనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతోంది. కానీ, అఫీషియల్‌గా మాత్రం ఈ ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. మొన్నా మధ్య ఫ్యామిలీ మేన్ సిరీస్ దర్శకుడు..బాలీవుడ్ హీరో కలిసి సందడి చేసింది. ఇది కొత్త ప్రాజెక్ట్ కోసమే అని ప్రచారం జరిగింది గానీ, ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. తాప్సీ నిర్మాణంలో కూడా సమంత ఓ సినిమా చేయనుందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్ కూడా లేదు.అయితే, హిందీలో సమంతకు మరో సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గట్టిపోటీ ఇస్తుందని తాజాగా అక్కడి మీడియాలో ప్రచారం అవుతోందట.

is samantha dominated by rashmika mandanna in bollywood

is samantha dominated by rashmika mandanna in bollywood

Samantha : సమంత కంటే ఎక్కువ రష్మిక చేతిలోనే ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో మాంచి దూకుడు చూపిస్తోంది రష్మిక. త్వరలో అక్కడ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో మూడు ప్రాజెక్ట్స్ కూడా లైన్‌లో పెట్టింది. అయితే, అర్జున్ రెడ్డి దర్శకుడు అక్కడ యానిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిణీతి చోప్రాను అనుకున్నారు. కానీ, తన డేట్స్ ఇబ్బంది కావడంతో సమంతను తీసుకుందామను కున్నారట. ఇంతలోనే ఏం జరిగిందో గానీ, రష్మిక మందన్నను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. చాలా బోల్డ్ పాత్ర..బోల్డ్ సీన్స్ కూడా బాగానే ఉంటాయట. అయినా రష్మిక ఓకే చెప్పేసింది. ఇక తెలుగులో కూడా ఓ సినిమాకు సమంతను అనుకొని చివరికి రష్మికను తీసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సినిమాల పరంగా చూస్తే సమంత కంటే ఎక్కువ రష్మిక చేతిలోనే ఉన్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది