Samantha : సమంత పేరు పక్కన అక్కినేని తీసేయడానికి కారణం ఇదా..?

Advertisement

Samantha : సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగోంది సమంత. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. ఇందులో సమంత పోషించిన రాజీ పాత్ర తనకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో మరిన్ని బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఆమె కమిటయిన సినిమాలని పూర్తి చేసేంతవరకు కొత్త ప్రాజెక్ట్స్ కమిటవకూడదని డిసైడయిందట. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు వ్యాపార రంగంలోనూ విజయవంతంగా రాణిస్తోంది. ఇటీవలే సౌత్ అండ్ నార్త్ లో ఉన్న స్టార్స్ తో కలిసి తన మింత్ర మాల్‌కి ప్రమోషనల్ వీడియో షూట్ కూడా కంప్లీట్ చేసింది.

is samantha replaced her surname with letter s
is samantha replaced her surname with letter s

ఇక తన డెబ్యూ సినిమా ఏ మాయ చేశావే సినిమాతో అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. కొన్నేళ్ళు చైతూ ప్రేమాయణం సాగించాక ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా ఇండస్ట్రీ ప్రముఖులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్ళి జరిగింది. ఆ తర్వాత సమంత తన పేరు పక్కన అక్కినేని చేర్చుకుంది. పెళ్ళి తర్వాత అక్కినేని సమంతగా అన్నింటా కనిపించింది. అయితే తాజాగా తన పేరు పక్కన అక్కినేని తొలగించి ఎస్ అనే అక్షరం చేర్చి హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ మ్యాటరే సోషల్ మీడియాలో వైరల్ న్యూస్.

Advertisement

Samantha : సమంత స్పందిస్తేగానీ అన్నిటికి చెక్ పడదు.

అయితే ఇందుకు కారణం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. ఈ కారణంగానే సమంత అక్కినేని తీసేసి ఎస్ అనే అక్షరం చేర్చిందని చెప్పుకుంటున్నారు. కానీ కొంతమంది మరోలా మాట్లాడుకుంటున్నారు. అక్కినేని ఫ్యామిలీతో సమంతకి విభేధాలు తలెత్తాయని, అందుకే ఇప్పుడు తన పేరు పక్కన అక్కినేని తీసేసిందని ప్రచారం చేస్తున్నారు. నిజ నిజాలు ఎప్పటికైనా బయటికి రాకమానవు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సమంతకి తన భర్త నాగ చైతన్య ఫ్యామిలీతో ఎలాంటి విబేధాలు లేవట. ఇటీవల సుమంత్ పెళ్ళి విషయంలో వచ్చినట్టుగానే ఇది కూడా రూమర్ అని తెలుస్తోంది. త్వరలో దీనిపై సమంత స్పందిస్తేగానీ అన్నిటికి చెక్ పడదు.

Advertisement
Advertisement