Sr NTR : ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలలో ఎక్కువగా వినిపించే మాట క్యాస్టింగ్ కౌచ్… కాస్టింగ్ కౌచ్ అంటే మహిళా నటులను వేధించడం , లేదా శృ.. కోసం వారికి అవకాశాలు ఇస్తామని మచ్చిక చేసుకోవడం. నేటి కాలంలో ఇలాంటివి ఫ్యాషన్ గా మారిపోయాయి. అవకాశాల కోసం మహిళ నటులు కూడా రాజీపడడం జరుగుతుంది. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే శ్రీరెడ్డి బహిరంగ విమర్శలు కూడా చేసింది. చాలామంది బాలీవుడ్ నటిమనులు కూడా దీనిపై పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చారు. అలాగే తమిళనాడు సింగరైన చిన్మయి కూడా కాస్టింగ్ కౌచ్ పై బహిరంగంగా మాట్లాడి దీనికి ప్రాచుర్యం కల్పించారు. దీంతో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ కాస్టింగ్ కౌచ్ ను ఆదర్శంగా తీసుకుని ఓపెన్ అవుతున్నారు.
అయితే ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడేన లేదా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా ఉండేదా…? అనే సందేహం చాలా మందికి ఉంది. అయితే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఇలాంటివి అసలు ఉండేవి కావట . అప్పట్లో నటీనటులు కుటుంబ సభ్యులుగా కలిసి ఉండేవారు. అలాగే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేవారు. ఎవరికైనా కష్టం వస్తే తోటి నటీనటులు వారికి సాయం చేసేవారు. అప్పట్లో నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉండేది. ఇంకొన్ని వారి ఇష్టానుసారం జరగడంతో బయటకు వచ్చేవి కాదు. ఇక అప్పట్లో మద్రాస్ పత్రిక కూడా కొన్ని గుసగుసలు అంటూ వార్తలు రాసిన ఎవరు పట్టించుకునే వారు కాదు. ఇక అప్పట్లో ఎక్కువగా టాలెంట్ కు ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పాలి. టాలెంట్ ఉన్నవారు ఏదో ఒక రంగంలో గుర్తింపును పొందేవారు.
ఇక భానుమతిని , సావిత్రిని, ఎస్. వరలక్ష్మి ని ఉదాహరణగా తీసుకుంటే.. వారిలో ఉన్న ప్రత్యేక టాలెంట్ వలనే వారికి అవకాశం లభించింది. భానుమతి పాటలు పాడటం తో పాటు నాట్యంలో కూడా ప్రావీణ్యురాలు. ఇక సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి అనే పేరు ఈమె సొంతం. ఎస్ . వరలక్ష్మి సంగీత దర్శకురాలు. వీరంతా వారి యొక్క టాలెంట్ వలనే పైకి వచ్చారు. అప్పట్లో టాలెంట్ కి ప్రాధాన్యం ఉండేది కానీ బాడీ షో కి కాదు. దీంతో అప్పట్లో కాస్టింగ్ కౌచ్ కు ప్రాధాన్యం లేదని చెప్పాలి. ఇక అప్పట్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ యొక్క పద్దతి విధానం కూడా బాగుండేదని చెప్పాలి. అన్నగారు ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయరు కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ ఉండేది కాదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.