Good News : ప్రస్తుతం మారుతున్న కాలంలో కూడా మన సమాజంలో ఆడ మగ తేడాలు ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ కూడా ఆడపిల్లను చిన్నచూపు చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో ఆడపిల్లల చదువు కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అలాగే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా ఆడపిల్లల చదువు కోసం ఎన్నో స్కాలర్ షిప్లను తీసుకొస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ పదో తరగతి విద్యార్థినిలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిభవంతులైన విద్యార్థినీలకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్ట్ భువనేశ్వరి తెలిపారు. దీనికోసం గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లుగా జీఈఎస్టి పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 4న నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి తెలియజేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. ఇక ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేస్తామని తెలిపారు. ఈ క్రమంలో మొదటి పది ర్యాంకులు పొందిన బాలికలకు 5000 చొప్పున అందజేస్తామని తెలిపారు. అలాగే తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3000 చొప్పున అందజేస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపారు.
వీరందరికీ ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు స్కాలర్షిప్ ఇస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినిలు www.ntrtrust.org వెబ్సైట్లో ఈనెల 11 నుంచి 30 లోపు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇంకా మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 7660002627 లేదా 7660002628 నెంబర్లకు ఫోన్ చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి సూచించారు. ఆసక్తి గల విద్యార్థినిలు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.