Sr NTR : బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందా సీనియ‌ర్ ఎన్టీఆర్‌ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sr NTR : బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందా సీనియ‌ర్ ఎన్టీఆర్‌ ..?

 Authored By prabhas | The Telugu News | Updated on :10 November 2022,9:40 pm

Sr NTR : ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలలో ఎక్కువగా వినిపించే మాట క్యాస్టింగ్ కౌచ్… కాస్టింగ్ కౌచ్ అంటే మహిళా నటులను వేధించడం , లేదా శృ.. కోసం వారికి అవకాశాలు ఇస్తామని మచ్చిక చేసుకోవడం. నేటి కాలంలో ఇలాంటివి ఫ్యాషన్ గా మారిపోయాయి. అవకాశాల కోసం మహిళ నటులు కూడా రాజీపడడం జరుగుతుంది. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే శ్రీరెడ్డి బహిరంగ విమర్శలు కూడా చేసింది. చాలామంది బాలీవుడ్ నటిమనులు కూడా దీనిపై పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చారు. అలాగే తమిళనాడు సింగరైన చిన్మయి కూడా కాస్టింగ్ కౌచ్ పై బహిరంగంగా మాట్లాడి దీనికి ప్రాచుర్యం కల్పించారు. దీంతో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ కాస్టింగ్ కౌచ్ ను ఆదర్శంగా తీసుకుని ఓపెన్ అవుతున్నారు.

అయితే ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడేన లేదా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా ఉండేదా…? అనే సందేహం చాలా మందికి ఉంది. అయితే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఇలాంటివి అసలు ఉండేవి కావట . అప్పట్లో నటీనటులు కుటుంబ సభ్యులుగా కలిసి ఉండేవారు. అలాగే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేవారు. ఎవరికైనా కష్టం వస్తే తోటి నటీనటులు వారికి సాయం చేసేవారు. అప్పట్లో నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉండేది. ఇంకొన్ని వారి ఇష్టానుసారం జరగడంతో బయటకు వచ్చేవి కాదు. ఇక అప్పట్లో మద్రాస్ పత్రిక కూడా కొన్ని గుసగుసలు అంటూ వార్తలు రాసిన ఎవరు పట్టించుకునే వారు కాదు. ఇక అప్పట్లో ఎక్కువగా టాలెంట్ కు ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పాలి.  టాలెంట్ ఉన్నవారు ఏదో ఒక రంగంలో గుర్తింపును పొందేవారు.

Is there a casting couch even in black and white days Sr NTR

Is there a casting couch even in black and white days Sr. NTR

ఇక భానుమతిని , సావిత్రిని, ఎస్. వరలక్ష్మి ని ఉదాహరణగా తీసుకుంటే.. వారిలో ఉన్న ప్రత్యేక టాలెంట్ వలనే వారికి అవకాశం లభించింది. భానుమతి పాటలు పాడటం తో పాటు నాట్యంలో కూడా ప్రావీణ్యురాలు. ఇక సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి అనే పేరు ఈమె సొంతం. ఎస్ . వరలక్ష్మి సంగీత దర్శకురాలు. వీరంతా వారి యొక్క టాలెంట్ వలనే పైకి వచ్చారు. అప్పట్లో టాలెంట్ కి ప్రాధాన్యం ఉండేది కానీ బాడీ షో కి కాదు. దీంతో అప్పట్లో కాస్టింగ్ కౌచ్ కు ప్రాధాన్యం లేదని చెప్పాలి. ఇక అప్పట్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ యొక్క పద్దతి విధానం కూడా బాగుండేదని చెప్పాలి. అన్నగారు ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయరు కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ ఉండేది కాదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది