Vakeel saab : వకీల్ సాబ్ పనైపోయినట్టే.. అందరూ అనుకున్నంత లేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vakeel saab : వకీల్ సాబ్ పనైపోయినట్టే.. అందరూ అనుకున్నంత లేదు..!

 Authored By govind | The Telugu News | Updated on :22 April 2021,11:30 am

Vakeel saab : వకీల్ సాబ్ సినిమాకి నష్టాలు తప్పలేదా.. అంటే అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో బాగానే వినిపిస్తోంది. వకీల్ సాబ్ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. యూఎస్ ప్రీమియర్ షోస్ తో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇండియా వైడ్ గా షోస్ మొదలయ్యాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి వకీల్ సాబ్ సినిమాని ఎంపిక చేసుకోవడం కరెక్ట్ అని అందరూ చెప్పుకున్నారు. ఇక తాజాగా సుప్రీం కోర్ట్ కూడా ఈ సినిమాని ప్రశంసించింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

is vakeel saab in loss

is vakeel-saab-in loss…?

బాలీవుడ్ పింక్, కోలీవుడ్ లో నేర్కొండ పార్వై గా వచ్చిన సినిమాని మళ్ళీ మన వాళ్ళు చూస్తారా అన్న అనుమానాలకి చెక్ పెట్టారు వకీల్ సాబ్ బృందం. రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ ని అభిమానులు ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో ఆ స్థాయి ఎక్కడా తగ్గకుండా దర్శకుడు వేణు శ్రీరాం చూపించాడు. అయితే ఈ సినిమాకి మొదటి వారం ఉన్నంత కలెక్షన్స్ రెండవ వారం లేకపోవడం షాకిస్తోంది. అనూహ్యంగా కలెక్షన్స్ పడిపోయాయి. రిపీట్ ఆడియన్స్ లేరు. దాంతో వకీల్ సాబ్ సినిమాకి ఓవరాల్ గా చూస్తే నష్టాలే అన్న మాట తాజాగా వినిపిస్తోంది.

Vakeel saab : వకీల్ సాబ్ కి గట్టి దెబ్బే తగిలింది.

కరోనా పెద్ద కారణం కాగా ఎ.పిలో ఈ సినిమాకి బాగా మైనస్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా నైట్ కర్ఫ్యూ తో పాటు సినిమా థియేటర్స్ ని తాత్కాలికంగా బంద్ ప్రకటించారు. కానీ వకీల్ సాబ్ సినిమాకి మాత్రం అనుమతులు ఇచ్చారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో 5 రోజుల్లో వకీల్ సాబ్ సినిమా థియేటర్స్ కూడా మూసి వేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనాలు రాక కొన్ని చోట్ల థియేటర్స్ క్లోజ్ చేశారు. త్వరలో మొత్తంగా వకీల్ సాబ్ సినిమా ఆడుతున్న థియేటర్స్ క్లోజ్ చేయనున్నారట. మొత్తానికి వకీల్ సాబ్ కి గట్టి దెబ్బే తగిలింది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది