Panch Prasad : చావు బతుకుల మధ్య జబర్దస్త్ కమీడియన్ జీవితం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Panch Prasad : చావు బతుకుల మధ్య జబర్దస్త్ కమీడియన్ జీవితం !

 Authored By aruna | The Telugu News | Updated on :4 June 2023,6:00 pm

Panch Prasad : జబర్దస్త్ కమెడియన్ గా పంచ్ ప్రసాద్ అందరికీ సుపరిచితం. తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ తెలుగు ప్రేక్షకులు మెప్పించాడు. అయితే ఆయన కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఇప్పటికే మల్లెమాల షోల ద్వారా చాలావరకు క్లారిటీ వచ్చింది. గతంలో ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు నాగబాబు, రోజా సహా జబర్దస్త్ సభ్యులంతా డబ్బులేసుకుని ఆయనకు వైద్య అందించారు. అయితే ఇప్పుడు మళ్లీ వ్యాధి తిరగబెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణంగా ఉందని వార్తలు వస్తున్నాయి.మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలో మాట్లాడుతూ ఎన్నో ఆసుపత్రులు తిరిగిన ప్రసాద్ ఆరోగ్యం కుదురుగా లేదని మూడు సంవత్సరాల నుంచి ఆయన ఈ బాధ భరిస్తూ వచ్చాడని వెల్లడించారు. వెంటనే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని డాక్టర్లు సూచించారు. ఒకవేళ అది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పలేమని వారు చెప్పినట్లుగా నూకరాజు చెప్పుకొచ్చారు. ఇక కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం లక్షలలో ఖర్చు అవుతుందని దయచేసి సహాయం చేయండి. ప్లీజ్ అంటూ ఆర్థిక సహాయం కోరుతూ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ పే స్కానర్ డీటెయిల్స్ కూడా షేర్ చేశారు.

Jabardast comedian panch Prasad health condition details

Jabardast comedian panch Prasad health condition details

సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలో పంచ్ ప్రసాద్ ఒక కుర్చీలో కూర్చుని ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపిస్తున్నాడు. ఇక తామందరం కలిసి 7 , 8 లక్షల వరకు కలెక్ట్ చేశామని ఈ ఆపరేషన్ కి ఇంకా ఖర్చు అవుతాయి కాబట్టి అందరూ తమకు తోచినంతగా సహాయం చేయాల్సిందిగా జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలోనే ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి రాగా ఒక కిడ్నీని కూడా ఆయన భార్య సునీత ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఇచ్చేందుకు రెడీ అయింది. ఎవరైనా పంచ్ ప్రసాద్ కు సహాయం చేయాలి అనుకుంటే నూకరాజు యూట్యూబ్ ఛానల్ ను చూడండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది