Hyper Aadi : పెద్దలను అవమానించడమే హైపర్ ఆది కామెడీనా.. ఇదేం పాడు పని ఆది?
Hyper Aadi : ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రధాన షోల్లో ఎక్కువగా హైపర్ ఆది కనిపిస్తున్నాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ డాన్స్ షో మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ప్రతి షో లో కూడా ఆది ఉంటాడు. ఇవి కాకుండా పండగ సందర్భంగా వచ్చే ప్రతి ఒక్క స్పెషల్ ఈవెంట్ లో కూడా ఈయన సందడి మామూలుగా ఉండడం లేదు. ఈయన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నే ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన స్క్రిప్ట్ ఇస్తూ ఉంటాడు.. కనుక తనను తాను హైలైట్ చేసుకుంటూ డైలాగ్స్ రాసుకోవడం, స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం చేస్తున్నాడు. తాజాగా ఉగాది సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.
ఆ కార్యక్రమంలో కూడా ఆది హడావుడి మామూలుగా ఉండదదని ప్రోమో చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇక మరో షో లో ఈయన సీనియర్ నటీమణులతో కబడ్డీ ఆడుతూ వారిని అవమానకరంగా మాట్లాడటం విగ్గులు పీకేస్తా, బస్తాల కొద్ది మేకప్ అంటూ రకరకాలుగా వారి ని అవమానపరిచినట్లు గా మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక్కచోటే కాకుండా హైపర్ ఆది ఎక్కడ పడితే అక్కడ సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పంచులు వేస్తూ అవతలి వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. వారు బాధ పడుతారు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. అతని పంచ్ డైలాగులు నవ్వు తెప్పిస్తాయి

jabardast Hyper Aadi bad comments on seniors with name of comedy
కానీ అదే సమయంలో అతని పంచ్ డైలాగులకు అవతలివారు మనోభావాలు దెబ్బతింటాయని గుర్తించలేదు.సీనియర్ల పై పంచులు వేస్తూ వారిని అవమానిస్తూ చేసే కామెడీ అవసరమా అంటూ స్వయంగా హైపర్ ఆది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైపర్ ఆది పంచులు గతంలో మాదిరిగా పేలడం లేదు అనేది ఒక టాక్. పంచ్ ప్రసాద్ కంటే హైపర్ ఆది పంచులు మరీ దారుణంగా తయారయ్యాయని.. ఆటో రాంప్రసాద్ పంచ్ లతో పోలిస్తే హైపర్ ఆది పంచులు పెద్దగా నవ్వు తెప్పించకుండానే తేలి పోతున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బూతులు మాట్లాడుతూ పెద్ద వారిని అవమానిస్తూ హైపర్ ఆది చేస్తున్న కామెడీ మరింతగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.