Hyper Aadi : హైపర్ ఆది ‘జబర్దస్త్’ వీడటంకు కారణం చెప్పిన అనసూయ
Hyper Aadi : జబర్దస్త్ లో హైపర్ ఆది కనిపించక నెలలు గడుస్తోంది. ఆయన జబర్దస్త్ ను వదిలేశాడా లేదా మల్లెమాల వారు ఆయన్ను బయటకు పంపించారా అనే విషయంలో క్లారిటీ రాక జబర్దస్త్ షో ను ఇష్టపడే ప్రేక్షకులు మరియు అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయంలో క్లారిటీ లేక ప్రతి ఒక్కరు కూడా హైపర్ ఆది ఎందుకు జబర్దస్త్ లో లేడు అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అనుమానంను పంచుకుంటున్నారు. కొందరు పారితోషికం విషయంలోనే హైపర్ ఆది వెళ్లి పోయాడు అంటూ ఉన్నారు. మరి కొందరు మాత్రం జబర్దస్త్ లో ఉన్న కొందు కీలక వ్యక్తులతో ఆదికి గొడవ అయ్యింది. అందుకే వెళ్లాడు అంటున్నారు.
అసలు విషయం హైపర్ ఆది నోరు తెరిస్తే కాని తెలియదు అనుకుంటూ ఉన్న సమయంలో ఆయనకు సన్నిహితురాలు.. స్నేహితురాలిగా పేరున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ ఈ విషయమై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల ఆమెను కొందరు జబర్దస్త్ అభిమానులు కలిశారట. ఆమె ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో వారు హైపర్ ఆది గురించి అడిగే ప్రయత్నం చేశారట. మొదట ఆమె ఆ విషయాన్ని గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదట. కాని ఆ తర్వాత తర్వాత కాస్త విషయాన్ని క్లారిటీ ఇచ్చినట్లుగా వారు చెబుతున్నారు.అనసూయ చెబుతున్న దాని ప్రకారం హైపర్ ఆది ని మల్లెమాల వారు వద్దు అనుకోలేదు..

jabardasth anchor Anasuya clarity about hyper aadi out from show
వారు ఏమీ కూడా ఆదిని బయటకు పంపించలేదు. ఆది ఉండాలనే మల్లెమాల వారు కోరుకున్నారు. ఆయన కోరుకున్న పారితోషికం కూడా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట. అలాగే ఆదికి జబర్దస్త్ లో ఎవరికి విభేదాలు లేవు. కేవలం సినిమా ల్లో వరుసగా ఆఫర్లు వస్తున్న కారణంగానే వెళ్లి పోయాడు. రాబోయే కాలంలో పెద్ద స్టార్స్ సినిమాల్లో ఆదిని చూడబోతున్నారు అంటూ అనసూయ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను వేరే ఛానల్ కార్యక్రమాల్లో చూసే అవకాశం ఉందా అని అనసూయను అడిగితే సినిమాలతో పాటు ఆయన ఇతర షో లు కూడా చేయాలని తాను కోరుకుంటున్నాను అంది.