Jabardasth Faima : ఇటీవలి కాలంలో జబర్ధస్త్ స్టేజ్‌పై అమ్మాయిలు చేస్తున్న రచ్చ మాములుగా ఉండడం లేదు. ఇటీవలి కాలంలో అమ్మాయిల ఎంట్రీ ఎక్కువగా ఉండగా, ఇంతమంది మధ్య మరో అమ్మాయి కూడా వారం వారం తన పర్ఫార్మెన్సుతో దుమ్ము దులిపేస్తుంది. ఒక్కో స్కిట్‌తో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది. తనపై ఎన్ని పంచులు వేస్తున్నా కూడా నిలబడి.. రివర్స్ పంచులతో పిచ్చెక్కిస్తుంది. ఆ అమ్మాయే ఫైమా.. కేరాఫ్ పటాస్. ఇటీవల జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. హైపర్ ఆదితో చేసిన స్కిట్‌లో ఈమె కామెడీ టచ్‌కు అంతా ఫిదా అయిపోయారు. తాజాగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ సహా సుడిగాలి సుధీర్ స్కిట్స్‌లోనూ తనదైన పంచులతో నవ్వించింది ఫైమా.
సపరేట్ కామెడీ టైమింగ్‌తో మాయ చేస్తుంది ఈమె.తాజాగా బుల్లెట్ భాస్కర్‌తో కలిసి ఈమె చేసిన స్కిట్ ఆకట్టుకుంటుంది. ఈ రోజు ఫస్ట్ నైట్ మాములుగా ఉండదు అని భాస్కర్.. ఫైమా చేయి పట్టుకోగా, మహి అంటూ గట్టిగా అరుస్తుంది. వాడెవడే అని అడగగా, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెబుతుంది. ఏదో ఒక రోజు నీ మనసులో స్థానం సంపాదించుకుంటా.నిన్ను ముట్టుకుంటా అని భాస్కర్ అంటాడు. ఇదే మాదిరిగా వర్ష- ఇమ్మాన్యుయేల్ మధ్య సంభాషణ సాగుతుంది. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్ధసస్త్ ప్రోమోకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వినూత్న స్లాంగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ ఇటీవలి కాలంలో ట్రెండింగ్ లోనూ నిలుస్తున్నారు
ఫైమా.అలా షోలో స్కిట్స్ చేస్తున్న ఫైమా తన టీం లీడర్ భాస్కర్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జబర్దస్త్ స్టేజ్ పై చేసేటపుడు కూడా ఇలా తిడతాను అని నేను అంటే, అడుగుతావేంటమ్మా ఏమన్నా తిట్టు అని అనే అంత ఫ్రీడమ్ భాస్కర్ అన్న ఇస్తాడని ఫైమా తెలిపారు.స్కిట్ అసలు అనుకున్న ప్రకారం వెళ్ళదని. ఒక్కోసారి మధ్యలో ఎవరైనా కల్పించుకుంటే అది వేరేలా వెళ్ళిపోతుందని ఆమె అన్నారు.కానీ భాస్కరన్న స్కిట్ లో కథ ఉంటుంది. కొన్ని కీ పాయింట్స్ తీసుకొని స్కిట్ ని చేస్తారని ఆమె వివరించారు.అంటే స్కిట్ కి స్టార్టింగ్, మిడిల్, కంక్లుషన్ ఇలా ఉంటాయి అని అతనిపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.