పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. నైజాం ఏరియాలో భారీగా వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా ఏపీలో మాత్రం కాస్త తక్కువ దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ టికెట్ల రేట్లు కాస్త తక్కువగా ఉండటం వల్ల వసూళ్లు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో వైకాపా నాయకులు మరియు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ అభిమానుల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పంతానికి వెళ్ళాడు అనేది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టికెట్ రేట్ల పెంపు విషయమై అతి త్వరలోనే జీవో వస్తుందని అందరికీ తెలుసు.
ఇప్పటికే టికెట్లు రేట్ల పెంపుకు సంబంధించిన మార్గ దర్శకాలు రెడీ అయ్యాయి. అది గవర్నమెంటు అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. ఈ లోపు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందడంతో ప్రభుత్వ వర్గాల వారు మరియు సంబంధిత మంత్రి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. కనుక జీవోను విడుదల చేయలేక పోయారు. ఈ లోపు సినిమాను విడుదల చేసి ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ రూపొందిన సినిమా.. భారీగా వసూలు రావలసిన సినిమా కనుక కాస్త ఆలస్యమైనా జీవో వచ్చే వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తే బాగుండేది అంటూ స్వయంగా పవన్ అభిమానులు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.జీవో విడుదలకు ముందు భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేసి ఇప్పుడు నానా హంగామా చేస్తే ఎలా అంటూ వైకాపా మంత్రులు ఆరోపిస్తున్నారు. పవన్ సినిమాలను తొక్కేసిన అవసరం ఎవరికీ లేదని..
అయినా ఒక్క సినిమాను తొక్కినంత మాత్రాన వచ్చేది ఏమీ లేదని వైకాపా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ అభిమానులు కాస్త సంయమనంతో ఆలోచించి మాట్లాడాలంటూ వైకాపా నాయకులు సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కనుక ఇలాంటి వ్యవహారాలు కొన్ని జరుగుతున్నాయి. గతంలో అఖండ ఆ తర్వాత బంగార్రాజు సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాలు పాతటికెట్ల రేట్లు తోనే నెట్టుకు వచ్చాయి. మరి ఆ సినిమాలకు లేని సమస్య ఇప్పుడు ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కనుక ఈ విషయం రాజకీయ మవుతోంది అంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైకాపా ను విమర్శించడం విడ్డూరంగా ఉందని.. అఖండ సినిమా సమయంలో ఎందుకు వీళ్లు మాట్లాడలేదు అంటూ వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.