Mahesh Babu : మహేష్ బాబుకి ఆ కమెడీయన్ డబ్బింగ్ చెబుతాడా.. సొంత వాయిస్ కాదా..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజై దాదాపు అర్ధ సంవత్సరం కావొస్తున్నది. కానీ ఇంకా ఆయన సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడం ఫ్యాన్స్‌లో ప్రస్టేషన్ పెరిగిపోతున్నది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. అయితే మూవీ ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉంది. ఈ మూవీ ఆగస్టులో ప్రారంభం అవుతుంది. ఆ నెలలోనే సెట్స్‌పైకి వెళ్తుంది అని మేకర్స్ తెలియజేశారు.ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Mahesh Babu ఆ వాయిస్ మహేష్ ది కాదు..
ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని, 2026 లో సినిమా చూసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. మహేష్ బాబుకి కమెడీయన్ డబ్బింగ్ చెబుతాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంటెన్స్ తో కూడిన డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆడియన్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. తండ్రి కృష్ణ వాయిస్ కి మహేష్ వాయిస్ చాలా దగ్గరగా ఉంటుంది. అయితే మహేష్ బాబు డబ్బింగ్ ఆర్టిస్ట్ సహాయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక సినిమా మొత్తానికి ఆయన డబ్బింగ్ చెప్పలేదు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన బుల్లెట్ భాస్కర్ మిమిక్రీ కూడా చేస్తారు.
ముఖ్యంగా ఆయన మహేష్ బాబు వాయిస్ మక్కీకి మక్కీ దించుతారు. ఆయన మాట్లాడుతుంటే మహేష్ బాబు మాట్లాడుతున్నట్లే ఉంటుంది. 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే చిత్రం మొత్తానికి బుల్లెట్ భాస్కర్ మహేష్ బాబు పాత్రకు డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్ని బుల్లెట్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే మహేష్ బాబు నటించిన కొన్ని యాడ్స్ కి కూడా బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పారట. ఇది ఊహించని పరిణామం. కాబట్టి వన్ నేనొక్కడినే చిత్రంలో మీరు వినేది మహేష్ వాయిస్ కాదు. అయితే మహేష్‌ని కలిసే అవకాశం బుల్లెట్ భాస్కర్‌కి ఒక్కసారి కూడా రాకపోవడం గమనర్హం.