Jabardasth Rocket Raghava : జబర్దస్త్ లో రాకెట్ రాఘవ ఇన్నాళ్లు చేయడానికి కారణం ఇదే..!
Jabardasth Rocket Raghava : తెలుగు బుల్లి తెరను దాదాపుగా దశాబ్ద కాలం పాటు ఏకచత్రాధిపత్యంగా అన్నట్లుగా ఏళిన జబర్దస్త్ టైమ్ అయిపోయిందా అంటే ఎక్కువ శాతం అదే అనిపిస్తుంది అంటున్నారు. 2013 సంవత్సరంలో ప్రారంభం అయిన జబర్దస్త్ కార్యక్రమానికి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్లో కొన్ని షో రేటింగ్ ను పెంచితే కొన్ని మార్పులు షో ను పాతాళానికి తొక్కేసినంత పని చేశాయి అంటూ జబర్దస్త్ అభిమానులు మరియు బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో లో ఇంత కాలంగా మారనిది అంటే కేవలం రాకెట్ రాఘవ మాత్రమే.
యాంకర్ గా అనసూయ మొదలు పెట్టి మద్యలో వెళ్లి పోవడంతో రష్మీ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక జడ్జ్ లుగా రోజా మరియు నాగబాబు లు మొదటి ఎపిసోడ్ లో ఉన్నారు. నాగబాబు కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ ను వీడి వెళ్లి పోగా ఇప్పుడు రోజా కూడా జబర్దస్త్ కు దూరం అయ్యింది. ఆమె వెళ్లిన తర్వాత 2013 కి చెందిన జబర్దస్త్ వాళ్లు కేవలం రాకెట్ రాఘవ మాత్రమే మిగిలాడు. ఆయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జబర్దస్త్ కామెడీ షో లో చేసిన వారు కొంత ఫేమ్ రాగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. సినిమాల్లో నటించేందుకు వెళ్తున్నారు. కాని రాఘవ మాత్రం పారితోషికం విషయంలో అస్సలు డిమాండ్ లేదు.

jabardasth comedian rocket raghava interesting information
ఆయన స్క్రిట్స్ విషయంలో డైరెక్టర్ సలహాలు వింటూ ఉంటాడు. నిర్మాతలకు దర్శకులకు అందరికి కూడా గౌరవం ఇస్తూ తాను గౌరవం పుచ్చుకుంటూ ఉంటాడు. అడపా దడపా సినిమాల్లో నటించినా కూడా జబర్దస్త్ ను వదలడం లేదు. బయట నుండి ఆఫర్లు వచ్చినా జబర్దస్త్ ను మాత్రం వదలను అంటూ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అన్నట్లుగానే జబర్దస్త్ ను వీడకుండా ఇన్నాళ్లు కొనసాగుతూ వస్తున్నాడు. రాకెట్ రాఘవ పారితోషికం విషయంలో పేచీ పెట్టక పోవడంతో పాటు.. పక్క చూపులు చూడటం.. జబర్దస్ కంటే వేరే వాటికి ప్రాముఖ్యత ఇవ్వక పోవడం వల్లే ఇన్నాళ్లు జబర్దస్త్ లో రాకెట్ రాఘవను చూస్తున్నాం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.