Hyper Aadi : జబర్దస్త్ నుండి హైపర్ ఆది టీమ్ తప్పుకోవడంతో ఆ లేడీ గెటప్ కమెడియన్ పరిస్థితి దారుణం
Hyper Aadi : జబర్దస్త్ నుండి హైపర్ ఆది పూర్తిగా తప్పుకున్నట్లే అయ్యింది. ఆయన గతంలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్న సమయంలో రైజింగ్ రాజు ని బాగా ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఇక తన ప్రతి స్కిట్ లో కూడా షైనింగ్ శాంతిని భాగస్వామ్యం చేయడం జరిగింది. శాంతి ప్రస్తుతం ఇతర టీమ్ లీడర్స్ తో కలిసి చేస్తున్నాడు కానీ ఎక్కువగా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నాడు. ఆది టీమ్ లో ఉన్నప్పుడు బయట షో ల్లో కూడా అతడి యొక్క లేడీ గెటప్ కి మంచి రెస్పాన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు పెద్దగా స్కోప్ దక్కడం లేదు.
జబర్దస్త్ నుండి లేడీ గెటప్స్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న వారిలో వినోదిని తర్వాత శాంతికి అంతటి పేరు లభించింది. కానీ ఇప్పుడు ఆది పేరు మాత్రం పెద్దగా వినిపించడం లేదు. ఆది లేకపోవడంతో శాంతికి కూడా ఆఫర్లు తగ్గాయి. అదుగో ఇదుగో అంటూ చాలా మంది చాలా రకాలుగా జబర్దస్త్ స్టేజీ పై సందడి చేశారు. కానీ ఇప్పటి వరకు ఆది వెళ్లి పోయినప్పటి నుండి పెద్దగా క్రేజ్ దక్కడం లేదు. ఆది సినిమా లతో బిజీ అయ్యాడు కానీ శాంతి కనీసం సీరియల్స్ లో కూడా ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నాడు.
వచ్చే ఏడాది బిగ్ బాస్ కు శాంతి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. బిగ్ బాస్ కు శాంతి వెళ్తే జబర్దస్త్ ను పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కి కూడా శాంతి దూరం అవ్వాల్సి ఉంటుంది. అందుకే బిగ్ బాస్ కు ఈటీవీ నుండి వెళ్లాలి అంటే ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. అందుకే శాంతి కూడా వెళ్లే అవకాశాలు లేవు. మొత్తానికి లేడీ గెటప్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న శాంతి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందనే చెప్పాలి.