jabardasth Naresh : జబర్దస్త్ నరేష్‌కు చుక్కలు చూపించేశారుగా.. కింద తడిచిపోయినట్టుంది!
jabardasth Naresh : ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ తమదైన శైలిలో కామెడీ స్కిట్ ల ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో గత ఎపిసోడ్ లో భాగంగా ఐస్ ముక్కలతో చేసిన స్కిట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముందుగా ఐస్ ముక్కలపై హైపర్ ఆది పంచ్ ప్రసాద్ కూర్చొని తమదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఆది తరఫు నుంచి బాబు ఐస్ పై నిలబడగా పంచ్ ప్రసాద్, ఇమ్మానియేల్ వస్తారు.
వీరిద్దరూ చూపే బంగారమాయేనే అనే పాటకు డాన్సు వేస్తూ ఐస్ గడ్డపై డాన్స్ చేయడానికి తంటాలు పడతారు. అదే సమయంలో జబర్దస్త్ పొట్టి నరేష్ మాట్లాడుతూ ఇంతసేపు చేశారు ఫన్నే రావడం లేదని అనగానే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ పొట్టి నరేష్ ను చుట్టుముట్టి తనను బలవంతంగా కూర్చోబెట్టారు. ఇక నరేష్ కింద మొత్తం తడిసిపోయింది వదిలేయండి అని చెప్పినా వినకుండా బలవంతంగా తనను ఐస్ పై కూర్చోబెట్టారు.

jabardasth comedians comments on jabardasth naresh in sridevi drama company
jabardasth Naresh : చత్రపతి డైలాగ్స్ అంటూ చుక్కలు
ఇలా అందరూ కలిసి తనని ఐస్ ముక్కలపై కూర్చోబెట్ట గా హైపర్ ఆది వచ్చి పొట్టి నరేష్ ఇప్పుడు చత్రపతి సినిమాలోని డైలాగులు మొత్తం చెబుతాడు అంటూ తనని బలవంతంగా అక్కడి కూర్చోబెట్టారు. ఇలా ఒక డైలాగ్ చెప్పపోతే దానిని సాగదీస్తూ ఆ డైలాగు పూర్తి కాకుండా జబర్దస్త్ నరేష్ కి చుక్కలు చూపించారు. చివరికి నరేష్ వారిని వేడుకోవడంతో తనని ఐస్ ముక్క పై నుంచి పైకి లేపారు. ఇక ఆ సందర్భంలో హైపర్ ఆది మాట్లాడుతూ సోఫా దగ్గరికి రాగానే నన్ను ఎలా ఉంది అని అడిగావు కదా ఇలాగే ఉంది అంటూ నరేష్ పై పంచ్ వేసాడు.