Jabardasth Naresh : జబర్దస్త్‌ నరేష్‌ సంపాదన ఎంతో తెలుసా… ఇప్పుడు కొత్తది కూడా మొదలయ్యింది

 Authored By prabhas | The Telugu News | Updated on :30 October 2022,2:00 pm

Jabardasth Naresh : జబర్దస్త్ తో ఎంతో మంది కమెడియన్స్ మంచి ఆదాయం పొందుతున్నారు. జబర్దస్త్ ద్వారా వచ్చే ఆదాయం తక్కువే అయినా ఆ కార్యక్రమంతో వచ్చిన గుర్తింపు వల్ల బయట వచ్చే ఆదాయం ఎక్కువ అనే విషయం తెలిసిందే. కొందరు ఒకే టీం కి పరిమితం అయ్యి చేస్తూ ఉంటారు. మరి కొందరు మాత్రం మూడు నాలుగు టీమ్స్ లో కనిపిస్తూ ఉంటారు. జబర్దస్త్ నరేష్ ఒకటి అని కాకుండా 4-5 టీమ్స్ లో సందర్భానుసారంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటాడు. ఒక స్కిట్ లో అతడు కనిపించాలంటే భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. టీం లీడర్స్ అతడికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ పారితోషికం ఇచ్చి మరి తమ స్కిట్స్ లో నటింపజేస్తూ ఉంటారు.

ముఖ్యంగా హైపర్ ఆది తన స్కిట్ లో నరేష్ కి మంచి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో రోజు వారి పారితోషికమును మల్లెమాల వారు నరేష్ కి ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి జబర్దస్త్ నరేష్ ఈటీవీ మల్లెమాల ద్వారా పెద్ద మొత్తంలోనే సంపాదిస్తున్నాడు. అంతే కాకుండా వారంకు రెండు లేదా మూడు ఈవెంట్స్ లో అతడు పాల్గొంటాడట దాంతో కూడా భారీ మొత్తంలోనే అతడికి ఆదాయం సమకూరుతుందని ప్రచారం జరుగుతుంది. ఇదంతా కాదన్నట్లు తాజాగా యూట్యూబ్ ద్వారా కూడా ఈ నరేష్ సంపాదన మొదలు పెట్టాడు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కమెడియన్ అంతా కూడా యూట్యూబ్ ద్వారా సందడి చేస్తున్నారు.

jabardasth naresh remuneration record

jabardasth naresh remuneration record

యూట్యూబ్ లో వారి యొక్క డైలీ వీడియోలను పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా నాటీ నరేష్ కూడా యూట్యూబ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసుకొని తన యొక్క రోజు వారి జీవితం మరియు తను చేస్తే కార్యక్రమాలు చూపిస్తున్నాడు. తద్వారా యూట్యూబ్ లో మంచి ఆదాయమును నరేష్ సొంతం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. మొత్తానికి జబర్దస్త్ పుణ్యమా అని ఎంతో మంది కమెడియన్స్ మాదిరిగా జబర్దస్త్ నరేష్ కూడా మంచి ఆదాయం పొందుతున్నాడు. ముందు ముందు మరింత ఆదాయం దక్కించుకుంటాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. సినిమాల్లో కూడా మెల్ల మెల్లగా నరేష్ అవకాశాలు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి