Bigg Boss Season 7 : బిగ్ బాస్ 7 లోకి పాపులర్ కమెడియన్ .. ఎవరు ఊహించరు కూడా ..!!
Bigg Boss Season 7 : బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ షో ఎప్పుడు వస్తుందా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ షో త్వరలోనే మొదలుకానుంది. 6 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్బాస్ ఏడవ సీజన్ వచ్చే నెల మూడో తేదీ నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ షో కి హోస్ట్ గా కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ నాగార్జుననే హోస్ట్ అని ప్రోమో విడుదల చేసి కన్ఫామ్ చేశారు. ఇకపోతే ఈసారి సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై పెద్ద చర్చ నడుస్తుంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్బాస్ 7 లోకి వెళ్ళేది వీళ్లఅంటూ వైరల్ చేశారు. కొన్ని రోజులుగా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్ లిస్ట్ మాత్రం బయటికి రాలేదు. అయితే తాజాగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల ఎంపిక పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ షోలో దీపికా పిల్లి, మోహన భోగరాజు, బుల్లెట్ భాస్కర్, సురేఖ వాణి, మొగలిరేకులు సాగర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళతోపాటు మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఊహించని కంటెస్టెంట్ పేరు తెరపైకి వచ్చింది. బిగ్బాస్ 7 లోకి జబర్దస్త్ కమెడియన్ నాటీ నరేష్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.
జబర్దస్త్ నరేష్ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయిందని సమాచారం. ఇకపోతే జబర్దస్త్ నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నరేష్ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో తో పాపులారిటీని సంపాదించుకున్న నరేష్ బిగ్బాస్ హౌస్ లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఈసారి బిగ్ బాస్ లో కొత్త రూల్స్, కొత్త టాస్కులు, కొత్త గేమ్స్ ఉండబోతున్నాయట. లాస్ట్ సీజన్ అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈసారి సీజన్ 7 కి గట్టిగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. మరి ఈ సీజన్ అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.